సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దుబ్బాక, హుజురాబాద్ ఓటమితో కేసీఆర్ మానసిక స్థితి దెబ్బతిందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు.
తెలంగాణ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకే వచ్చానని జేపీ నడ్డా అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం బీజేపీ పోరాడుతుందన్నారు. మాది క్రమశిక్షణ గల పార్టీ. కరోనా నిబంధనలు పాటిస్తూ నిరసన తెలిపాం. నన్ను ఎయిర్‌పోర్ట్ దగ్గరే అడ్డుకున్నారు. కరోనా నిబంధనలు ఉన్నాయంటూ పోలీసులు చెప్పారు. నిబంధనలు పాటిస్తూనే గాంధీజీకి నివాళులర్పిస్తానని పోలీసులకు చెప్పాను. రెండు రోజులుగా జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉన్నాయి. తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతోంది. తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలన నడుస్తోంది. తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది. బండి సంజయ్‌పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని నడ్డా నిప్పులు చెరిగారు.
చదవండి: హైదరాబాద్‌లో టెన్షన్ టెన్షన్.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న బీజేపీ
‘‘కేసీఆర్‌తో పోరాడేది కేవలం బీజేపీయే. 317 జీవో సవరించే వరకు బీజేపీ పోరాడుతుంది. తెలంగాణ ప్రజల తరఫున బీజేపీ చేపట్టిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాను. తెలంగాణ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాం. బండి సంజయ్ జీవో 317 ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల వ్యతిరేక ఉత్తర్వులను సవరించాలని పోరాడారు. తెలంగాణ మంత్రులు ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శాంతియుతంగా జాగరణ దీక్ష చేపడితే పోలీసులు బండి సంజయ్‌పై మ్యాన్ హ్యాండిల్ చేశారు. కేసీఆర్ తీరుపై సిగ్గుపడుతున్నాం. కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంలా మారింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కింద ఒక్క చుక్క నీరు రాలేదు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు గా ఉంది కేసీఆర్ తీరు. బండి సంజయ్ అరెస్ట్‌ను జాతీయ పార్టీ ఖండిస్తుంది... ప్రజాస్వామ్య యుతంగా పోరాటం చేస్తామని’’ జేపీ నడ్డా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment