సాక్షి, యాదాద్రి: ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబమే వెలిగిపోతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభమై కొలనుపాక, రాజానగరం, రాజాపేట మండలం దూదివెంకటాపురం మీదుగా రఘునాథపురానికి చేరుకుంది. కొలనుపాక, రఘునాథపురంలలో జరిగిన కార్నర్ మీటింగ్‌లలో భట్టి మాట్లాడారు.
ఆ తర్వాత కొలనుపాక గ్రామ శివారులో ఆయన ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్లఅయిలయ్య, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుడుదుల నగేశ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. మైసూర్ ప్యాలెస్ తరహాలో నూతన సెక్రటేరియట్‌ను నిర్మించి తెలంగాణ వెలిగిపోతోందని సీఎం అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రగతిశీల భావనతో సామాజిక తెలంగాణ కావాలని తెచ్చుకున్న రాష్ట్రంలో సీఎం నయా ఫ్యూడల్ సంప్రదాయాన్ని తీసుకువస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ కూడా దేశంలో భాగమేనని ఒక్కొక్కరికీ వందల ఎకరాల్లో ఫాం హౌస్‌లు ఎట్లా ఉంటాయని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదాయం, ఖర్చులు, చేసిన అప్పులు, అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజెప్పేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలని భట్టి డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ వల్ల జరుగుతున్న నష్టం ప్రజలకు తెలుస్తోందన్నారు. ధరణి వల్ల భూములపై హక్కులు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హక్కులు కల్పిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment