సాక్షి,హైదరాబాద్: కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని.. కాంగ్రెస్‌కు ప్రాజెక్టులు, నీళ్ల గురించి అవగాహన లేదని మాజీ సీఎం కేసీఆర్ చేసీన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. అసులు కేసీఆర్‌కు నీళ్ల గురించి ఏం అవగాహన లేదని అన్నారు. కేసీఆర్‌కు నీళ్ల గురించి ఏం తెలియదు కాబట్టే కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీకి నీళ్ల పూర్తి అవగాహన ఉంది కాబట్టే కాంగ్రెస్ హయాంలో శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను నిర్మించామని తెలిపారు. నీళ్ల పేరుతో నిధులు దోచుకోవటమే కేసీఆర్ తెలుసని.. అలా చేయటం కాంగ్రెస్‌కు తెలియదని అన్నారు. ఇక.. టీఆర్‌ఎసీ నిర్వహించే నల్గొండ సభ కంటే ముందే కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు.
కాళేశ్వరంతో తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం
నల్గొండలో సభ పెట్టడం కాదని.. సీఎం కేసీఆర్ కృష్ణా జలాలపై చర్చకు రావాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరంతో తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు.
‘తప్పు చేసిన వారిని బొక్కలో వేస్తాం. కేసీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. మేం అడిగిన ప్రశ్నలకి కేసీఆర్ సమాధానం చెప్పడం లేదు. కేసీఆర్ వల్ల తెలంగాణకి తీవ్రమైన నష్టం కలిగింది. అట్టహాసంగా చేసిన ప్రాజెక్టులు కులిపోతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో కాళేశ్వరంపై వచ్చిన విజిలెన్స్ రిపోర్ట్‌ను ప్రవేశ పెడతాం’ అని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
నల్గొండ సభలోపే.. చాలా మంది కాంగ్రెస్‌లోకి!
కేసీఆర్ తెలివి తక్కువోడు కాబట్టే కాళేశ్వరం కుప్పకూలిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఉంటదో, ఊడుతదో నాలుగు రోజుల్లో తెలుస్తుందని అన్నారు. కేసీఆర్ వైఖరి వల్ల తెలంగాణ కు తీవ్ర నష్టం జరిగిందని, నల్లగొండ సభ పెట్టే లోపే చాలా మంది కాంగ్రెస్‌లో చేరుతారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment