సభలో తేల్చుకుందాం! | Revanth Reddy accuses BRS of handing over irrigation projects and challenges KCR to debate | Sakshi
Sakshi News home page

సభలో తేల్చుకుందాం!

Published Mon, Feb 5 2024 3:48 AM | Last Updated on Mon, Feb 5 2024 3:48 AM

Revanth Reddy accuses BRS of handing over irrigation projects and challenges KCR to debate - Sakshi

ఆదివారం మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌. చిత్రంలో మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్‌

ఎంత సమయం కావాలన్నా ఇస్తాం.. 
కేసీఆర్‌ నల్లగొండకు వెళ్లేముందు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలి. ఆయనకు ఎంత సమయం కావాలంటే అంత కేటాయిస్తాం. ఒక్క నిమిషం కూడా మైక్‌ కట్‌ చెయ్యం. ప్రతి అంశంపై చర్చించాలి. చెయ్యి నొప్పి, కాలు నొప్పి అని సాకులు చెప్పి సమావేశాలకు గైర్హాజరు కావొద్దు. ఎంతసేపైనా చర్చిద్దాం. కావాలంటే చద్దర్లు, దుప్పట్లు కూడా తెచ్చుకోండి. అవసరమైతే తలుపులేసి మాట్లాడుకుందాం. కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్‌రావు కూడా రావాలి. ఎమ్మెల్సీ కవిత కూడా హాజరుకావొచ్చు. అవసరమైతే ఉభయసభలను ఒకే సమయంలో సమావేశపరుస్తాం. 

సాక్షి, హైదరాబాద్‌: అరవై ఏళ్ల ఉమ్మడి పాలనలో కంటే కేసీఆర్‌ సీఎంగా ఉన్న పదేళ్లలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి ఎను ముల రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ ధనదాహానికి తెలంగాణ బలైందని, రాష్ట్రంలో కృష్ణాబేసిన్‌ పరిధిలో ఉన్న ప్రాజెక్టులు ఎడారిగా మారాయని పేర్కొన్నారు. రాష్ట్ర సాగునీటి రంగాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగిస్తున్నారంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వా న్ని బదనాం చేస్తున్నారన్నారు.

త్వరలో జరిగే రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టులు, నిధుల వినియోగం, నీటి పారుదల అంశాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. దమ్ముంటే ప్రతిపక్ష నేత కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరై చర్చలో పాల్గొనాలని సవాల్‌ విసిరారు. ఆదివారం సచివాలయంలో మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖలతో కలసి రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన తప్పులను, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, కవితారావు అంతా కలసి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. అసలు తెలంగాణలోని ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు పునాదిపడినది కేసీఆర్‌ ఎంపీగా ఉన్నప్పుడే. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోనే తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేలా బిల్లులో పొందుపర్చారు. తెలంగాణ ఏర్పాటు బిల్లులోని ప్రతి అక్షరాన్ని తన సమ్మతితోనే పెట్టారని చెప్పుకునే కేసీఆర్‌.. ప్రాజెక్టుల అప్పగింత నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు? 

స్వయంగా సంతకాలు చేసి కూడా.. 
తెలంగాణ, ఏపీ మధ్య 811 టీఎంసీల జలాలను పంచుకునేందుకు 2015 జూన్‌ 18, 19 తేదీల్లో కేఆర్‌ఎంబీ (కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు) సమావేశం జరిగింది. ఆ సమావేశానికి అప్పటి సీఎం కేసీఆర్, నాటి ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, సాగునీటి నిపుణుడు విద్యాసాగర్‌రావు హాజరయ్యారు. తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల చొప్పున నీటిని పంచేందుకు ఒప్పుకొన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉన్న తెలంగాణకు కేవలం 299 టీఎంసీలే నీరే తీసుకునేందుకు ఎలా ఒప్పుకొన్నారు? ఇదంతా ఆ సమావేశం మినిట్స్‌లో రికార్డు అయింది.

రాష్ట్రానికి రావాల్సిన నీటిని ఏపీకి ధారాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్‌. అంతేకాదు 2022 మే 27న జరిగిన సమావేశంలో 15 ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు అంగీకరించారు. గత ఏడాది మే 19న జరిగిన కృష్ణాబోర్డు 17వ సమావేశంలో ప్రాజెక్టులను అప్పగించేందుకు ఒప్పుకుంటూ కేసీఆర్‌ స్వయంగా సంతకాలు చేశారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం 2023–24 బడ్జెట్‌లో గోదావరి బోర్డు, కృష్ణా బోర్డులకు చెరో రూ.200 కోట్ల చొప్పున రూ.400 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు కూడా. ఇంత చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు నల్లగొండలో నిరసన తెలుపుతాననడం సిగ్గుచేటు. 

కేసీఆర్‌ చేతగానితనం వల్లే.. 
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు భూభాగమంతా తెలంగాణలోనే ఉంటుంది. కానీ రెండు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాగర్‌ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం స్వా«దీనం చేసుకునే ప్రయత్నం చేసింది. ఏపీ పోలీసులు తుపాకులతో మోహరించారు. తెలంగాణ ప్రాజెక్టును స్వా«దీనం చేసుకునేందుకు ఏపీకి ఎంత దమ్ము ఉండాలి. కేసీఆర్‌ చేతగానితనం వల్లే అలా జరిగింది. అధికారం కోల్పోయి ఇంట్లో కూర్చున్న కేసీఆర్‌ బయటికి వచ్చే పరిస్థితి లేక ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారు. 

కేసీఆర్‌వన్నీ తుగ్లక్‌ నిర్ణయాలు: ఉత్తమ్‌
కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అన్నీ తుగ్లక్‌ నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాఖ్యానించారు. లక్షకోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మూన్నాళ్ల ముచ్చట అయ్యిందని, పలు ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని అన్నారు. తక్కువ ఖర్చుతో పూర్తి చేసే ప్రాజెక్టులకు అంచనాలను రెట్టింపు చేసి నిధులన్నీ దుబారా చేశారన్నారు. రెండు టీఎంసీల కోసం లక్ష కోట్లు ఖర్చు చేసి, గ్రావిటీ ద్వారా వచ్చే 8 టీఎంసీలను తీసుకెళ్తుంటే చోద్యం చూశారు. నీటినిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ప్రాజెక్టులు ఏడారిగా మారుతున్నాయని, రాష్ట్ర రైతాంగం నోట్లో మట్టికొట్టిన పరిస్థితిని కేసీఆర్‌ సృష్టించారన్నారు. 

ఆయన కుట్రతోనే ప్రాజెక్టులకు బొక్కలు.. 
రాష్ట్ర ప్రయోజనాలు తీర్చాల్సిన జలాలను కేసీఆర్‌ కుట్రపూరితంగా ఆంధ్రకు కట్టబెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్‌ హయాంలో టీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు మంత్రులుగా పనిచేశారు. కేంద్రంలో కేసీఆర్‌తోపాటు నరేంద్ర మంత్రులుగా కొనసాగారు. అప్పట్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 44వేల క్యూసెక్కుల జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్లే ప్రయత్నాలను టీఆర్‌ఎస్‌ మంత్రులు ఎందుకు అడ్డుకోలేదు? కేసీఆర్‌ లో పాయికారీ ఒప్పందాలతోనే తెలంగాణకు అన్యా యం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ము చ్చుమర్రికి నీటిని తరలించుకెళ్లేలా మరో టన్నెల్‌ ఏర్పాటు చేసుకునేందుకు కేసీఆర్‌ కారణమయ్యారు.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రాయలసీమ ప్రాజెక్టుతో రోజుకు 8 టీఎంసీల నీటిని తరలించుకునేందుకు శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద బొక్కపెట్టారు. దానికి సంబంధించి 2020 మే 5న ఏపీ జీఓ 203ని కూడా తెచి్చంది. అప్పట్లో ప్రగతిభవన్‌కు వచి్చన ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌ ఏకాంత చర్చల తర్వాతే ఆ జీఓ జారీ అయింది. ఆ ఏడాది ఆగస్టు 5న కృష్ణాబోర్డు సమావేశం ఉంటే కేసీఆర్‌ బిజీగా ఉన్నానంటూ వెళ్లలేదు. వెంటనే ఆ ప్రాజె క్టు టెండర్లు, కాంట్రాక్టర్‌ ఎంపిక కూడా పూర్తయ్యాయి. ఆ తర్వాత కమీషన్ల కోసం కుట్ర చేసిన వ్యక్తి కేసీఆర్‌. ఇలాంటి వ్యక్తి ప్రజా ఉద్యమాలు చేస్తానంటే ప్రజలే బుద్ధిచెప్తారు. తెలంగాణ వ చ్చాక కేసీఆర్‌ సీఎంగా, ఆయన అల్లుడు హరీశ్‌రా వు నీటిపారుదల, ఆర్థికశాఖల మంత్రిగా ఏమేం చేశారో అన్నింటినీ ప్రజల ముందు పెడతాం. వా రి ఘనకార్యాలన్నింటికీ ఆధారాలు ఉన్నాయి.

ప్రాజెక్టులను బోర్డుకు ఇచ్చే ప్రసక్తే లేదు 
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదు. కృష్ణా, గోదావరి నదులు పుట్టినచోటి నుంచి సముద్రంలో కలిసేవరకు ఉన్న ప్రాజెక్టులన్నింటిపై సమీక్షించి రాష్ట్రాల వారీగా నీటి వాటాలు తేల్చాలి. కేవలం ఏపీ, తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులతో ముడిపెట్టొద్దు. ఈ అంశంపై ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులను కలసి వినతిపత్రాలు ఇచ్చాం. అది తేలేవరకు ప్రాజెక్టుల అప్పగింత మాటే ఉండదు. ప్రస్తుతం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి పనులు పూర్తిచేస్తాం..’’అని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement