సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మైనంపల్లి హన్మంతరావు, మధుయాష్కీ గౌడ్, సునీతారెడ్డి తదితరులు
మల్కాజిగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాలి: రేవంత్‌రెడ్డి
కేసీఆర్ పతనానికి బీజం ఇక్కడే పడిందని వ్యాఖ్య
కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ గెలవాలని పిలుపు
సాక్షి, హైదరాబాద్: ఓ సామాన్యుడిని సీఎం స్థాయికి ఎదిగేలా చేసిననది, బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పతనానికి బీజం వేసినది మల్కాజి గిరి లోక్‌సభ నియోజక వర్గమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నిక ల్లో మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో ఆశించిన స్థాయి లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవలేదని, ఇప్పటికైనా లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. గురువారం జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో పార్టీ నాయకులను ఉద్దేశించి సీఎం రేవంత్ మాట్లాడారు.
‘‘లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. నా బలం, బల గం కార్యకర్తలే. మల్కాజిగిరిలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు కొందరు నాయకులు అమ్ముడుపో యి నా, కార్యకర్తలు నన్ను భుజాల మీద మోసి గెలిపించి ఢిల్లీకి పంపారు. ప్రతీ బూత్‌లో ఒక్కో కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేశారు. నాటి మల్కాజిగిరి గెలుపే నన్ను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది..’’ అని పేర్కొన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర మంతా కాంగ్రెస్ తుఫాను వచ్చినా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్నారు. ఇక్కడి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం నాలుగు గెలిస్తే అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేదని పేర్కొ న్నారు.
అందుకే మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ విజయం సాధించేలా పార్టీ యంత్రాంగం కృషి చేయాలని కోరారు. హోలీ పండుగలోగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందని, కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత తనదని చెప్పారు. పార్టీకి బలమైన నాయకత్వం ఉందని, సమన్వయంతో ముందుకెళితే విజయం సాధిస్తామని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, సునీతారెడ్డి, సుధీర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment