సాక్షి, హైదరాబాద్: బీజేపీ మేనిఫెస్టోపై ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఫొటోలను జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ఫొటోలను వాడటం ప్రశంసలుగా భావిస్తున్నామన్నారు. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలని బీజేపీ నాయకులను ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు. బల్దియాలో అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో బీజేపీ ముఖ్యంగా తెలిపింది. గ్రేటర్ పరిధిలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని, లక్ష మందికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద సామాన్యుని సొంతటి కలను నెరవేరుస్తామని పెర్కొంది. విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్స్, ఫ్రీ వైఫై సదుపాయాన్ని ఇస్తామంది. మహిళలకు బస్సులు, మెట్రోలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని బీజేపీ హామీనిచ్చింది.
Dear BJP manifesto writers,
— KTR (@KTRTRS) November 26, 2020
Glad that you chose pictures of the work done by TRS Govt in your GHMC manifesto
We will take this as a compliment to our work
But let me remind you what they say in Hyderabad
नकल मारने को भी अकल चाहिए। 😀
కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె https://t.co/guN76K5N7n
Comments
Please login to add a commentAdd a comment