సాక్షి, సిద్దిపేట: బీజేపీ నాయకులు గల్లీలో తిడుతున్నారని, ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారని ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలో నిర్వహించిన మేడే, గొర్రెల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ఇక్కడి పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతోందని ఆరోపించారు.
ఇతర రాష్ట్రాల నుంచి మాంసాన్ని దిగుమతి చేసుకోకుండా.. ఇక్కడి గొల్లకుర్మలకే గొర్రెలు ఇచ్చి మాంసం ఉత్పత్తి చేయడం కోసం రూ.11 వేలకోట్ల నిధులతో గొర్రెల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని వివరించారు. కార్మికులకు కులం, మతం లేదని, కార్మి కుల శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాస్తుందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment