
హైదరాబాద్: రాబోవు లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ స్వతంత్రంగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో ఈసారి 17 లోక్‌సభ సీట్లకు పోటీ చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు.
ఈసారి అసుదుద్దీన్ ఓవైసీ ఓడిస్తామనే ధీమా వ్యక్తం చేశారు. ఇక సర్వేలపై మాట్లాడుతూ.. సర్వేలల వస్తున్న ఫలితాలు నిజం కాదన్నారు. కాంగ్రెస్- బీఆర్‌ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయన్నారు.
ఇక మేడిగడ్డలో కాంగ్రెస్ నేతలు సెటిల్మెంట్‌చేసుకుంటున్నారని, కాళేశ్వరం అవతకకలపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. కృష్ణా జలాలపై బీఆర్‌ఎస్ లేనిపోని రాద్దాంతం చేస్తోందని, కాళేశ్వరం అవకతవకలపై దృష్టి మళ్లించేందుకు ఈ నాటకమని కిషన్‌రెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment