ఎన్టీఆర్‌ చావుకు కారణమైన వారిని తరిమికొట్టాలి: కొడాలి నాని | Kodali Nani Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ చావుకు కారణమైన వారిని తరిమికొట్టాలి: కొడాలి నాని

Published Mon, Oct 10 2022 8:31 PM | Last Updated on Mon, Oct 10 2022 8:34 PM

Kodali Nani Comments On Chandrababu - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: ఎన్టీఆర్‌ చావుకు కారణమైన వారిని తరిమికొట్టాలని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్‌కు 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు మద్దతు ఉంటే చాలు.. చిరంజీవి అవసరం రాకపోవచ్చన్నారు. అమరావతి రైతుల ముసుగులో కమ్మ కుల ఉగ్రవాదులు చేస్తున్నదే పాదయాత్ర. 200 ఏళ్లైనా అమరావతి నిర్మాణం పూర్తికాదని కొడాలి అన్నారు.
చదవండి: ‘షూటింగ్‌ గ్యాప్‌లో ట్వీట్లా?.. పవన్‌ తాప‍త్రయం అదేనా? 

నన్ను కుల బహిష్కరణ చేయడానికే ఓడిపోయిన పదిమంది కమ్మ టీడీపీ నాయకులు, గుడివాడ వచ్చి తొడలు కొట్టారు. తన అనుయాయులను నయా జమీందారులను చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన. అమరావతి ముసుగులో చంద్రబాబు చెబుతున్నది రైతులు నమ్మవద్దని కొడాలి నాని అన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మనుగడకు కాలమే సమాధానం చెప్పాలి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ప్రధాని కావాలనుకుంటున్నారేమో? అంటూ కొడాలి నాని వ్యాఖ్యానించారు.



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement