తెలుగుదేశం పార్టీ డ్రామాలు అడుతుందని అందరికి తెలుసుకాని, మరీ ఇంత నీచంగా ఆడుతుందని ఊహించలేం.అదేదో సినిమా డైలాగు ఉన్నట్లుగా ఇంతకన్నా దిగజారవు అనుకున్నప్పుడల్లా నా అభిప్రాయం తప్పు అని రుజువు చేస్తునే ఉన్నావని ఆ డైలాగులో ప్రమఖ నటి అంటుంది.ఆ డైలాగు టీడీపీకి బాగా అతుకుతుందని చెప్పాలి. లేకుంటే చివరికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో కూడా దిక్కుమాలిన రాజకీయం చేయడమా?ఇంతకన్నా సిగ్గు చేటు అయిన విషయం ఉంటుందా?అందులోను స్వయంగా ఆయన కుటుంబ సభ్యులే ఇలాంటి లేకితనానికి పాల్పడడమా?
✍️ఎవరైనా తమ కుటుంబ పెద్ద ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటారు. మరెవరైనా లేనిపోని వదంతులు సృష్టిస్తే ఖండిస్తారు. కాని చిత్రంగా చంద్రబాబు కుటుంబ సభ్యులే ఆయన ఆరోగ్యంపై అపోహలు కలిగించడమా! వినడానికే ఎంత బాద కలిగిస్తుంది. ఎవరూ చంద్రబాబు ఆరోగ్యం పాడవ్వాలని కోరుకోరు.ఆయన అవినీతి కేసులో రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. అందువల్ల ఆయన ఆరోగ్య బాద్యత ప్రభుత్వ జైళ్ల శాఖపై ఉంటుంది.అందులోను ఒక పార్టీ అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్లు పనిచేసి,ప్రతిపక్ష నేతగా పదిహేనేళ్లుగా ఉన్న ఉన్న వ్యక్తి పట్ల అధికారులు ఎంత జాగ్రత్తగా ఉంటారు.చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణిలు ట్వీట్‌లు చేస్తూ ఆయన ఐదు కిలోల బరువు తగ్గారని చెప్పారు.
✍️సహజంగానే ఇది నిజమేనేమో అని టీడీపీ క్యాడర్ నమ్మి కొంత ఆందోళనకు గురి అవుతుంది.ఇది నిజమా?కాదా? అని నిర్ధారణ అయ్యేలోపు ఈ సమాచారం అలజడికి కారణం అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడువారు ఎంత బాద్యతగా ఉండాలి.తీరా చూస్తే జైలు అధికారులు చెప్పినదాని ప్రకారం ఆయన జైలులో ప్రవేశించినప్పటి నుంచి ఇంతవరకు ఒక కిలో బరువు పెరిగారట.ఆయన 66 కిలోల నుంచి అరవై ఏడు కిలోలకు బరువు పెరిగారు.అంటే దాని అర్ధం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లే కదా! ఆయనకు సుగర్ సమస్య మొదటి నుంచి ఉంది. అలాగే చర్మ సంబంధిత ఇబ్బంది చాలాకాలం నుంచి ఉంది. అయినా ఆయన పార్టీ ప్రచారం కోసం నిత్యం జనంలో తిరుగుతున్నారు. ఎండల్లో ఉంటున్నారు. చమటలుకక్కుతున్నారు.
✍️తనకు వయసు అన్నది ఒక సంఖ్యేకాని, తన ఆరోగ్యానికి ఢోకా లేదని పలుమార్లు తన ఫిట్‌నెస్ గురించి తానే చెప్పుకున్నారు. ఎండల్లో తిరిగినప్పుడే రాని ఇబ్బంది ఇప్పుడు నీడపట్టున ప్రత్యేకమైన భవనంలో ఉన్నప్పుడు ఎందుకు వస్తుందన్నది సహజమైన ప్రశ్న. ఎండ బాధ లేదు... పార్టీ మీటింగ్‌ల టెన్షన్ లేదు. కాకపోతే కేసు వల్ల ప్రతిష్ట దెబ్బతిందన్న బాధ ఉండవచ్చు. కొంత స్ట్రెస్ ఉండవచ్చు. కాని టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్ వంటివారు జైఉలో ఆయనను పరామర్శించి బయటకు వచ్చి చంద్రబాబు చాలా ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. పైగా తన కేసు గురించి కాకుండా, ప్రజలలో స్పందన రాకపోవడం గురించి కాకుండా, కృష్ణా నదీ జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగడంపై ఆయన ఆలోచిస్తున్నారని కేశవ్ చెప్పారు.దాని బట్టి ఆయనకు జైలులో ఉన్నానన్న మానసినక స్ట్రెస్ కూడా లేదని అనుకోవాలి. అసలు చంద్రబాబుబరువు తగ్గినట్లు కుటుంబ సభ్యులకు ఎవరు చెప్పారు? వారు ఏమైనా ఆయనను కలవడానికి వెళ్లినప్పుడు తూకం మిషన్ కూడా తీసుకువెళ్లారా? అలా చేసినట్లు లేరు కదా? మరెందుకు ఈ వదంతి లేవదీశారు?దీనికి మూడు,నాలుగు కారణాలు కనిపిస్తాయి. ఒకటి టీడీపీ క్యాడర్‌ను కాస్త యాక్టివేట్ చేయడం.ఎందుకంటే 34 రోజులుగా చంద్రబాబు జైలులోనే ఉన్నారు. రోజూ ఆందోళనలు చేయడం అంటే వారికి భారంగా మారుతోందట.
✍️పైగా అవినీతి జరగలేదని వారెవ్వరూ అనుకోవడం లేదు. అలాంటప్పుడు ఈ టెక్నిక్ ఏమైనా ఉపయోగపడుతుందేమో అన్న ఆలోచ చేసి ఉండాలి. రెండోది ప్రజలలో సానుభూతి సంపాదించడం. చంద్రబాబు ఈ వయసులో జైలులో ఉన్నారే అన్న భావన కలిగి అది రాజకీయంగా లబ్ది చేకూరాలన్నది వారి లక్ష్యం కావచ్చు.చంద్రబాబు జైలుకు వెళ్లినప్పటి నుంచి ఇంతవరకు జనంలో ఆశించిన స్పందన రాలేదన్నది వారి ఆందోళన.దానిని అధిగమించి సానుభూతి సంపాదించాలన్నది వారి ఉద్దేశం కావచ్చు. మూడోది చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతిన్నదని ప్రచారం చేసి వీలైతే అలజడులు సృష్టించాలన్న భావన కూడా ఉండే అవకాశం ఉంది.
✍️ఎందుకంటే చంద్రబాబు, లోకష్‌లు పలు సభలలో కార్యకర్తలను రెచ్చగొట్టిన సంగతులు తెలిసిననవే. అందువల్లే ఆంగళ్లు, పుంగనూరు, భీమవరం వంటి చోట్ల టీడీపీ కార్యకర్తలు గొడవలకు దిగి జైళ్ల పాలయ్యారు. ఆ తర్వాత క్యాడర్ కేసులకు భయపడి అల్లర్లు చేయడం తగ్గించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంది.దీంతో చంద్రబాబు పట్ల సానుకూలత రావడం లేదన్న అభిప్రాయంతో కూడా ఏమైనా గొడవలు జరిగితే బాగుండు అని అనుకుని ఉండవచ్చు. నాలుగోది న్యాయ వ్యవస్తను ఏదో రకంగా ప్రభావితం చేయడానికి ఆరోగ్య సమస్యను వాడుకోవాలని తలపెట్టి ఉండవచ్చు. అందుకే ఒకవైపు టీడీపీ సీనియర్ నేతలు, మరో వైపు కటుంబ సభ్యులు చంద్రబాబు ఆరోగ్యం అంటూ హడావుడి చేశారని చెప్పాలి. నిజంగానే టీడీపీ నేతలకు, చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్యంపై అంత శ్రద్ద ఉంటే ఆయనకు ఉన్న ఇబ్బందులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లి ఏదైనా మంచి ఆస్పత్రిలో చేర్పించుకోవచ్చు కదా! గతంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐ స్కామ్‌లో అరెస్టు అయినప్పుడు ఒక్క రోజు మినహా బెయిల్ వచ్చేవరకు గుంటూరు ఆస్పత్రిలోనే ఉన్నారు కదా!
✍️ఆ మాత్రం చంద్రబాబు చేసుకోలేరా? అన్న ప్రశ్న వస్తుంది.చంద్రబాబుకు ఆహారంకాని, మందులు కాని అన్నీ ఇంటి నుంచే పంపుతున్నారు కదా?అలాంటప్పుడు అందులో ఎందుకు తేడా వస్తుంది. ఏదైనా ఇబ్బంది వస్తే వారే బాద్యులు అవుతారు కదా!వీటన్నిటిని విస్మరించి జనం అమాయకంగా నమ్మేస్తారనుకుని లేనిపోని వదంతులు లేవదీస్తే టీడీపీకే పరువు నష్టం. చివరికి ఏమైంది. జైళ్ల శాఖ ఉన్నతాదికారులు అసలు విషయాలు బయటకు చెప్పేశారు.
✍️చంద్రబాబు కిలో బరువు పెరిగిన సంగతి నుంచి ఆయన కోసం ఇరవై నాలుగు గంటలు వైద్య సిబ్బంది సిద్దంగా ఉండడం ,ఆహారం, మందులు కుటుంబ సభ్యులే ఇస్తున్న వివరాల వరకు వెల్లడించేశారు. తద్వారా చంద్రబాబు ఆరోఓగ్యానికి ఇబ్బంది లేదని తేల్చారు. ఆయనకు చర్మ సంబంధమైన సమస్య వస్తే వెంటనే నిపుణులను తీసుకు వచ్చి మందులు ఇప్పించారు. ఇంకా అవసరమైతే వేరే బయట ఆస్పత్రికి తీసుకు వెళ్లమని కోరవచ్చు.ఇవేవి చేయకుండా లోకేష్ తప్పుడు ఆరోపణలు చేయడం దారుణంగా ఉంటుంది. జైలులో భద్రత లేదని, గంజాయి స్మగ్లర్లు ఉన్నారని, తీవ్రవాదులు దాడులు చేయవచ్చని ఇలా ఏవేవో కాకమ్మ కధలు చెబితే అధికారులు పట్టించుకుంటారా? వారి బాద్యత నిర్వహిస్తారు తప్ప .ఇలా పిచ్చి ప్రచారం చేయడం వల్ల సానుభూతి రాకపోగా టీడీపీపై మరింత అసహ్యం ఏర్పడే ప్రమాదం ఉంటుందని చెప్పక తప్పదు.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment