రైతు సమస్యలుపక్కనపెట్టి రాజకీయాలా? | Ktr comments over Revanth Reddy | Sakshi
Sakshi News home page

రైతు సమస్యలుపక్కనపెట్టి రాజకీయాలా?

Published Thu, May 16 2024 4:32 AM | Last Updated on Thu, May 16 2024 4:32 AM

Ktr comments over Revanth Reddy

ధాన్యం కొనుగోలు చేయకుంటే బీఆర్‌ఎస్‌ రోడ్డెక్కి ధర్నా చేస్తుంది

కొత్తగా చేస్తున్న అప్పులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయో చెప్పాలి

ఏపీలో జగన్‌ గెలుస్తారనే సమాచారం ఉంది: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: క్షేత్రస్థాయిలో రైతులు పడుతు న్న ఇబ్బందులను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను నెల రోజులుగా పట్టించుకోవడం లేదన్నారు. రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పట్టే దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయని చెప్పారు. 

తెలంగాణభవన్‌లో బుధవారం కేటీఆర్‌ మీడియా తో మాట్లాడారు. ధాన్యం కొనుగోలుపై పర్యవేక్షణ లేదని, హమాలీలు, ధాన్యం సంచుల కొరత, తరు గు పేరిట క్వింటాల్‌కు మూడున్నర కిలోల చొప్పున కోత విధించడం వంటి సమస్యలు ఉన్నాయన్నారు. వీటిపై కామారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల తదితర జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారని చెప్పారు. రాజకీయాలను పక్కన పెట్టి ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేలా చూడాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

 రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో రైతులకు అండగా రోడ్డెక్కి ఆందోళన చేస్తామన్నారు. రైతాంగం ఆందోళన, ధైర్యం చెడొ ద్దని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కేటీఆర్‌ పిలుపుని చ్చారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు వారి తోనే బీఆర్‌ఎస్‌ పార్టీ నిలబడుతుందన్నారు. రుణ మాఫీ, ధాన్యం కొనుగోలు, బోనస్‌ వంటి హామీలు అమలయ్యేంత వరకు రైతుల తరపున బీఆర్‌ఎస్‌ పోరాడుతుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

అప్పులపై రేవంత్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
గత ప్రభుత్వం అప్పులు చేసిందంటూ శ్వేతపత్రాల పేరిట చిల్లర రాజకీయం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం రూ.3.89లక్షల కోట్లు మాత్రమేనని ఆర్‌బీఐ నివేదిక వెల్లడించిందన్నారు. అప్పులు చేయడం తప్పు అని ప్రచారం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా ఎందుకు అప్పులు చేస్తుందని ప్రశ్నించారు.

 కొత్తగా చేస్తున్న అప్పులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అప్పులు చేయడానికి అప్పులు చేయడం దివాలాకోరు విధానం అని, దీనిపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో ఏనాడూ విద్యుత్‌ ఉద్యోగులను పల్లెత్తు మాట అనలేదని, ఉద్యోగులతో తమది పేగుబంధం అని కేటీఆర్‌ పేర్కొన్నారు.  

నయీం లాంటి వ్యక్తికి కాంగ్రెస్‌ టికెట్‌
వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల ఎమ్మె ల్సీగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీ బ్లాక్‌మెయిలర్, ఎన్నో పార్టీలు మారిన నయీం తరహా వ్యక్తికి టికెట్‌ ఇచ్చిందన్నారు. ఈ స్థానం నుంచి ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారని చెప్పారు. 

కాంగ్రెస్‌ పార్టీ మోసపూరిత వాగ్దానాలు, ఐదున్నర నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వపాలన చూసి బీఆర్‌ఎస్‌కు మద్దతు పలకాలన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా 30 వేల మంది ఉద్యోగులు భర్తీ కాగా, సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలతో తన ఖాతాలో వేసుకుంటున్నాడని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ కోసం ప్రశ్నించే గొంతుకగా బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. 

నల్లగొండపైనే కాంగ్రెస్‌ ఆశలు
ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఒక్క స్థానంలోనే గెలిచే అవకాశముందని  కేటీఆర్‌ అన్నారు. కేవలం నల్లగొండ ఎంపీ స్థానంపైనే కాంగ్రెస్‌ పార్టీ ఆశలు పెట్టుకుందన్నారు. తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ మీడి యాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... ‘పార్లమెంటు ఎన్నికలు ఆశావ హంగా జరిగినట్టు ఈ రోజు మా ఎంపీ అభ్యర్థులతో జరిగిన భేటీలో చెప్పారు. నేను ప్రత్యేకంగా చేయించిన సర్వేలోనూ బీఆర్‌ఎస్‌ కు అనుకూలంగా సైలెంట్‌ ఓటింగ్‌ పడినట్టు తేలింది. కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు సరిగ్గా లేరు. 

సునీతా మహేందర్‌రెడ్డికి మల్కాజిగిరితో ఏమైనా సంబంధం ఉందా. బండి సంజయ్‌ను గెలిపించేందుకు వెలిచాల రాజేందర్‌రావు లాంటి అడ్రస్‌ లేని వ్యక్తికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇచ్చింది. నాగర్‌ కర్నూల్‌లో మా అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమా ర్‌కు బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. నాగర్‌కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, చేవెళ్లలో పక్కాగా గెలుస్తున్నాం. 

పెద్ద పల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో బీజేపీతో బీఆర్‌ఎస్‌కు ప్రధానంగా పోటీ ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు లాభం జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ మళ్లీ గెలుస్తారని మాకు సమాచారం ఉంది’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement