సోషల్‌ మీడియా కార్యకర్తలపై కొనసాగుతున్న కక్ష సాధింపు కేసులు | YSRCP Fight Against CBN Govt Over Social Media Activists Arrest | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

సోషల్‌ మీడియా కార్యకర్తలపై కొనసాగుతున్న కక్ష సాధింపు కేసులు

సోషల్‌ మీడియా కార్యకర్తలపై కొనసాగుతున్న కక్ష సాధింపు కేసులు

  • సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వ కక్ష సాధింపు కేసులు  కొనసాగుతూనే ఉన్నాయి.
  • ఇంటూరి రవి కిరణ్ పై బాపట్ల జిల్లా ఇంకోలు పోలీస్ స్టేషన్‌లో మరో కేసు
  • విశాఖ సెంట్రల్ జైల్ నుంచి బాపట్లకు ఇంటూరి తరలింపు
  • ఇంటూరిపై 14 కేసులు పెట్టిన పోలీసులు
  • విశాఖ సెంట్రల్ జైల్‌లో ఉన్న మరో సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఖాజా బాబాపై రామచంద్రపురం పీఎస్‌లో అక్రమ కేసు..
     
2024-11-17 16:46:01

ఫేక్ ఐడీలతో బోగస్ ప్రచారం టీడీపీకి అలవాటే: మార్గాని భరత్‌

  • వర్రా రవీంద్ర రెడ్డి పేరుమీద ఫేక్ అకౌంట్లతో పోస్టులు పెట్టారు.
  • ఫేక్ ఐడీలతో బోగస్ ప్రచారం చేయడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య.
  • వైఎస్‌ జగన్‌ గారు తన తల్లిని, చెల్లిని కూడా అమ్మా అనే మాటతో సంబోధిస్తారు.
  • అది మహిళలకు ఆయనిచ్చే గౌరవం.
2024-11-17 12:52:34

ప్రశ్నించినందుకు సురేష్‌ రెడ్డి అక్రమ అరెస్ట్‌..

  • పల్నాడు జిల్లా..
  • ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మరో అరెస్ట్‌..
  • కాసు మహేష్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న గురజాల సోషల్ మీడియా కోఆర్డినేటర్ సురేష్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.
  • సురేష్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించిన న్యాయమూర్తి.

 

2024-11-17 11:52:51

హామీలు లేవు.. కేసులతో కాలక్షేపమే: వైఎస్సార్‌సీపీ

  • ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం చేతగాని చంద్రబాబు.
  • ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎత్తులు వేస్తున్నాడు.
  • ప్రశ్నించినవాళ్ల మీద కేసులు పెడుతూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప హామీలు అమలు చేయడం లేదు.
2024-11-17 10:24:22

‘పోలీసులతో కొట్టించి పబ్బం గడుపుకోవాలన్నది చంద్రబాబు ప్లాన్‌’

  • అబద్ధపు హామీలు ఇచ్చినంత సులువుగా అమలు చేయడం సాధ్యం కాదు.
  • అందుకే అడిగే వాళ్ళ నోళ్లు కట్టేసి.. పోలీసులతో కొట్టించి పబ్బం గడుపుకోవాలన్నది చంద్రబాబు ప్లాన్.
  • అందుకే గళం ఎత్తితే చాలు పోలీసులను ఉసిగొలుపుతున్నారు.
2024-11-17 09:24:09

బాబూ.. ఇది ఆర్గనైజ్డ్ నేరం కాదా?: పుష్పశ్రీ వాణి

  • నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు చేసింది ఆర్గనైజ్డ్ నేరం కాదా..?
  • మరి ఆయన్ను అరెస్టు చేయరా..??
  • ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా వాళ్ల మీదనే కేసులు పెడతారా?
  • అమ్మకు వందనం లేదు.. రైతు భరోసా లేదు.. ఆసరా లేదు.. నిరుద్యోగ భృతి లేదు.
  • ఫీజు రీయింబర్స్మెంట్ లేదు..
  • ఇన్ని వర్గాలను మోసం చేసిన మీద కదా కేసు పెట్టాలి..
  • ఆయన చేసింది నమ్మించి మోసం చేయడం కాదా.. అది నేరం కాదా?.
  • ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేసి.. అన్ని వర్గాలను మోసం చేస్తూ ఈ ఐదేళ్లు గ్రాఫిక్స్ తో బతికేద్దామని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు.
  • అందుకే సోషల్ మీడియా వాళ్లను అరెస్టులు చేస్తున్నారు.
  • కేవలం అబద్దాలను పోగేసి గాలి మేడలు కట్టి ప్రజలను నమ్మించడం అలవాటైపోయిన చంద్రబాబు
  • ఇప్పుడు సమాజం నుంచి ఎదురవుతున్న ప్రశ్నలను తట్టుకోలేకపోతున్నారు.
  • అందుకే తప్పుడు కేసులు పెట్టి ఆనందం పొందుతున్నారు.
  • సూపర్ సిక్స్ అన్నారు.. అమలు చేయమంటే జైల్లో పెడుతున్నారు.
  • అంత చేతగానప్పుడు పెద్దపెద్ద హామీలు ఇవ్వడం ఎందుకు చంద్రబాబు.
  • మీ మోసాలు అందరికీ అర్థం అయ్యాయిలే.
  • చంద్రబాబు లాంటి అబద్ధాలు కోరు.. మోసగాడిని దేశంలో ఎక్కడా చూడలేము.
  • మాట తప్పడం ఆయన నైజం.. ప్రశ్నిస్తే తట్టుకోలేకపోవడం ఆయన సహజలక్షణం.
  • అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు ప్రజా కోర్టులో శిక్షకు సిద్ధంగా ఉండాలి.

 

2024-11-17 09:21:40

గతంలో పోస్టులకు ఇప్పుడు అరెస్ట్‌లా?

  • హిందూపురం..
  • గతంలో సోషల్ మీడియా పోస్టులకు నేడు అరెస్ట్‌లు.
  • గతంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడని తాజాగా అరెస్ట్‌.
  • శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వాల్మీకి లోకేష్‌ను అదుపులోకి తీసుకున్న హిందూపురం వన్ టౌన్ పోలీసులు

 

2024-11-17 08:51:41

నోటీసుల పేరుతో పోలీసుల ఓవరాక్షన్‌

  • వైఎస్సార్‌ జిల్లా..
  • కడప పోలీసుల ఓవరాక్షన్
  • పది మందికిపైగా పోలీసులు, అర్థరాత్రి సోషల్ మీడియా యాక్టివిస్ట్ సునీతా రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నం
  • ఓ మహిళ ఇంటికి అలా అర్థరాత్రి వెళ్ళడం ఏంటని స్థానికుల ప్రశ్న
  • పోలీసుల నిర్వాకాన్ని వెలుగులోకి తెచ్చిన సీసీ కెమెరా ఫుటేజ్
     
2024-11-17 08:47:25

అరెస్ట్‌ పేరుతో చిత్రహింసలు..!

  • నవంబరు 8న వర్రా రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
  • కానీ, నవంబరు 11న అదుపులోకి తీసుకున్నట్లు మీడియా ముందు వెల్లడి.
  • ఆ మూడు రోజులు తన భర్తని చిత్రహింసలకి గురిచేసి.. తప్పుడు వాంగ్మూలాలు తీసుకున్నారని రవీంద్రారెడ్డి సతీమణి వర్రా కళ్యాణి ఆవేదన.

 

2024-11-17 08:45:30

కొత్తపల్లి రవీంద్రబాబు అక్రమ అరెస్ట్‌..

  • ఎన్టీఆర్ జిల్లా..
  • కూటమి సర్కార్‌ పాలనలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు.
  • సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన కొత్తపల్లి రవీంద్రబాబు అరెస్ట్‌.
  • ఈరోజు తెల్లవారుజామున స్టేషన్‌కు తరలించిన మైలవరం పోలీసులు
2024-11-17 08:41:25

అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలా: వైఎస్సార్‌సీపీ

  • చంద్రబాబు ఎందుకు నీ 45 ఏళ్ల అనుభ‌వం?.. త‌గ‌లేసుకోవ‌డానికా?
  • రాష్ట్ర అప్పులపై ఆధారాల‌తో స‌హా  మీ బండారాన్ని బ‌య‌ట పెట్టిన వైఎస్‌ జగన్‌.  
  • రాష్ట్ర అప్పులపై ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌గా మీరు ఎలా విష‌ప్ర‌చారం చేశారో ఆధారాల‌తో స‌హా చూపించారు.
  • చంద్ర‌బాబు ఆర్గనైజ్డ్‌ క్రైమ్ ఈ విధంగా ఉంటుంది.

 

2024-11-17 08:39:06
Advertisement
 
Advertisement
 
Advertisement