తాడికొండ: రాజధాని పేరిట పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు బినామీ ఉద్యమం చేయిస్తుండడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు మాదిగాని గురునాథం విమర్శించారు. కేవలం ఒక్క కులానికే కాపు కాస్తూ పేదలు, ఇతర వర్గాలను రోడ్డున పడేసేలా బాబు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. సోమవారం గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇళ్ల స్థలాలు ఇప్పించాలని దీక్షలు చేస్తున్న దళిత మహిళలపై దాడి చేయించి..కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తుండడం దారుణమన్నారు.
టీడీపీ భూస్థాపితం కావడం ఖాయం : ఆప్స్
వెన్నుపోటు రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మూడు పంటలు పండే భూములను సర్వనాశనం చేశారని ఏపీ అభివృద్ధి పోరాట సమితి(ఆప్స్) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాజారెడ్డి విమర్శించారు. పచ్చ మీడియా వక్రీకరణను ప్రజలు నమ్మడం లేదని, టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని తెలిపారు.
మూడు రాజధానులతోనే అభివృద్ధి
నెహ్రూనగర్(గుంటూరు): మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని దళిత ప్రజాపార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను కాంక్షిస్తూ గుంటూరు లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు రాజధాని పేరుతో వేలాది ఎకరాల భూములు లాక్కుని డ్రామాలాడారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment