సాక్షి, కరీంనగర్ : తెలంగాణలో నమోదవుతున్న కరోనా చావులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరి ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 శాతం పడకలు ప్రభుత్వం తీసుకొని పేదలకు, రేషన్ కార్డులేని వారికి వైద్యం అందించాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐసోలేషన్, క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. (ఏం డాక్టర్‌వయ్యా.. దిమాక్ ఉందా?)
ప్రజా ఆరోగ్యం కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా కోరినట్లు విక్రమార్క తెలిపారు. కరోనాపై మూడు నెలల ముందే కాంగ్రెస్ హెచ్చరించినప్పటికీ సీఎం పెడచెవిన పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా పాలన లేదని, పోలీసు రాజ్యం కొనసాగుతోందని దుయ్యబట్టారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి అణగతొక్కుతూ ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు. ఇందుకు హుజురాబాద్‌లో ప్రవీణ్ అనే యువకుడి మృతే నిదర్శమని పేర్కొన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని బుద్ధిలేని సీఎం అప్పులపాలు చేశారని, ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి ప్రజారోగ్యానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వైద్యుల నియామకాన్ని చేపట్టి కావలసిన మందులను అందుబాటులో ఉంచాలని, లేకుంటే కాంగ్రెస్ ప్రజా పోరాటం చేయక తప్పదని హెచ్చరించారు. (భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో భట్టి పర్యటన)
Comments
Please login to add a commentAdd a comment