‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర రేపటి షెడ్యూల్ | Memantha Siddham: Cm Jagan Bus Yatra March 30th Schedule | Sakshi
Sakshi News home page

‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర రేపటి షెడ్యూల్

Published Fri, Mar 29 2024 9:49 PM | Last Updated on Fri, Mar 29 2024 9:58 PM

Memantha Siddham: Cm Jagan Bus Yatra March 30th Schedule - Sakshi

సాక్షి, కర్నూలు జిల్లా:  మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల బ్రహ్మరథం పడుతున్నారు. దారిపొడవునా జై జగన్‌ నినాదాలతో యాత్ర మార్మోగింది. పెంచికలపాడులోని రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి శుక్రవారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమయ్యింది. ఈ యాత్ర పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి సాగింది. అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని  వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

సభ అనంతరం అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం, బెణిగేరి, ఆస్పరి, చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్‌ ఫంక్షన్ హాల్‌కి దగ్గరలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు. నంద్యాల, ప్రొద్దుటూరు సభకు మించి ఎమ్మిగనూరు సభకు ప్రజా ప్రవాహం పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంతగా జనంతో  బహిరంగ సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

 4వ రోజు శనివారం (మార్చి 30) షెడ్యూల్:
ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్‌ ఉదయం 9 గంటలకు పత్తికొండలోని రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరతారు. రాతన  మీదుగా తుగ్గలి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జొన్నగిరి,  గుత్తి మీదుగా  ప్రయాణించి గుత్తి శివారులో భోజనవిరామం తీసుకుంటారు. సాయంత్రం 3 గంటలకు బయలుదేరి  పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి, సంజీవపురం శివారు వరకు బస్ యాత్ర కొనసాగుతుంది. సంజీవపురం శివారులో  రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement