
సాక్షి, తిరుపతి: విద్య వల్లే సమాజంలో మార్పు అని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. బీఆర్ అంబేద్కర్ భావజాలాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి.. సీఎం జగన్ అని అన్నారు మంత్రి మేరుగు నాగార్జున. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.
కాగా, మంత్రి మేరుగు నాగార్జున సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేశ్ యువగళం, పవన్ కల్యాణ్ వారాహిని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ, బీజేపీని ప్రజలు నమ్మరు. ఏపీలో విద్యా వ్యవస్థలో విప్లాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఏకైక వ్యక్తి సీఎం జగన్. రాష్ట్రంలో పిల్లల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలు టీడీపీ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని బీజేపీ నేతలకు సలహా ఇచ్చారు.
ఇది కూడా చదవండి: టీడీపీ ట్రాప్‌లో బీజేపీ.. అమిత్‌షా వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి స్పందన
Comments
Please login to add a commentAdd a comment