సాక్షి, తాడేపల్లి: పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌ల సమావేశంపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చంద్రబాబు కోసమే పనిచేశాడని, ప్యాకేజ్ స్టార్ అని పవన్ మరోసారి నిరూపించుకున్నాడని విమర్శించారు. ఈరోజు పవన్, లోకేష్‌ల సమావేశం తర్వాత మంత్రి అంబటి మాట్లాడుతూ.. ‘సున్నా సున్నా కలిస్తే ఫలితం సున్నా. పవన్ కళ్యాణ్, లోకేష్‌ల సమావేశంతో ఏం లాభం. పవన్ కళ్యాణ్ ఎప్పుడు చంద్రబాబు కోసమే పని చేసాడు.
ప్యాకేజీ స్టార్ అని పవన్ నిరూపించుకున్నారు. చంద్రబాబుకి మనోధైర్యం ఇవ్వడానికి రాజమండ్రి వెళ్లాను అని పవన్ చెప్తున్నాడు. లోకేష్ పల్లకి మోయడం కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు. అసలు టీడీపీ, జనసేన మీటింగ్‌లో ఏదైనా విషయం ఉందా..?, బలహీన పడ్డ టీడీపీని బలోపేతం కోసం కలిశానని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. కానీ ప్రజలు ఈ కలయికని హర్షించరు. చంద్రబాబు కి బెయిల్ రానివ్వడం లేదని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. బెయిల్ ఇవ్వాల్సింది కోర్టులు కదా..పవన్ ఆ విషయం తెలుసుకోవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవడం కొత్తేమి కాదు.
మేము ఎప్పటినుండో వీళ్ళు కలిసే వస్తారని చెప్తూనే ఉన్నాం. మేము చెప్పిందే ఇప్పుడు జరుగుతుంది. ముద్రగడని హింసించినప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు. అందుకే పవన్ కళ్యాణ్ ప్యాకేజి స్టార్ అని చెప్తున్నాం. లోకేష్ అమిత్ షా ని కలవడానికి పదే పదే ప్రాధేయపడ్డాడు. కానీ నిన్నటి వరకు లోకేష్ ఎన్ని అబద్దాలు చెప్పారు. కిషన్‌రెడ్డి ప్రకటనతో లోకేష్ చెప్పినవన్నీ తప్పులని తేలింది. పురంధేశ్వరి తప్పుడు విధానాలు కూడా ఇప్పుడు తేటతెల్లం అయ్యాయి.
టీడీపీ, జనసేనల మేనిఫెస్టో ఎలా ఉంటుందో చూద్దాం. చంద్రబాబు నిన్న ఉత్తరంలో జైలులో లేను.. ప్రజల్లో ఉన్నాను అని అంటున్నాడు. తెలుగు రాష్ట్రానికి తెగులు తెలుగుదేశం పార్టీనే. ఇప్పుడు ఆ తెగులు పవన్ కళ్యాణ్‌కి కూడా పట్టుకుంది. అక్రమంగా 45 రోజులు జైలులో పెట్టడం సాధ్యమా..?, చంద్రబాబు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు. గతంలో ఓటుకు నోట్లు కేసులో చూశాం కదా ఎలా రేవంత్ రెడ్డి తో డబ్బులు పంపాడు. ఏ వ్యవస్థని అయిన మేనేజ్ చేసేది చంద్రబాబు నాయుడే కదా. ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేసే కదా చంద్రబాబు తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు వల్ల అది సాధ్యం కాదు. చంద్రబాబు దొరికిన దొంగ. ఆఖరికి ఆయన ఉన్న ఇల్లు కూడా అక్రమ మార్గంలో పొందినదే. రాజమండ్రి టీడీపీ, జనసేన మీటింగ్‌తో జరిగేదేమి లేదు’ అని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: ఒంటరిగా గెలిచిందే లేదు.. అందుకే పొత్తుల తక్కెడ!
Comments
Please login to add a commentAdd a comment