సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. నిందితులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశామన్నారు. ‘‘అక్కడక్కడ చిన్న సంఘటనలు జరిగితే రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయి.పేరెంట్స్ మనోభావాలను దెబ్బ తీయవద్దు. ఇది విద్యార్థుల భవిష్యత్తు తో కూడిన సమస్య’’ అని మంత్రి హితవు పలికారు.
చదవండి: భార్యకు యూట్యూబ్ చానల్.. రూ.4 కోట్ల ఆదాయం.. ఆ భర్త ఏంచేశాడంటే?
‘‘టెన్త్ పేపర్ల లీకేజి విషయంలో 69 మందిపై చర్యలు తీసుకున్నాం. అందులో 36 మంది ప్రభుత్వ టీచర్లు కూడా ఉన్నారు. దొరికిన వీరంతా పేపర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఫోటోలు తీసుకుని బయటకు పంపారు. ఉయ్యూరులో ఐదుగురు టీచర్లు ఆన్సర్లు తయారు చేస్తుండగా పట్టుకున్నాం. ఈనాడు పత్రిక మా ప్రభుత్వంపై విషం చిమ్ముతోంది. తప్పును ఉపేక్షించేది లేదు. మా ఆకాంక్ష విద్యార్థుల భవిష్యత్తు. ఈనాడు తన రాతల ద్వారా ఈ సమాజానికి ఏం చెప్పాలనుకుంటోంది?. పేపర్ ఇవ్వకముందు ఎక్కడా లీక్ కాలేదు. గతంలో లాగా డబ్బులు ఆశ చూపెట్టి ముందుగా లీకులు చేయటం లాంటిది జరగలేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదని’’ మంత్రి బొత్స అన్నారు.
‘‘6 నుంచి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయి. దాదాపు పది లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశాం. అవసరమైతే రూములలో సీసీ కెమెరాలు పెట్టే ఆలోచన కూడా చేస్తున్నాం. టెన్త్ పేపర్ లీకుల విషయంలో నారాయణ, చైతన్య, కేరళ ఇంగ్లీషు మీడియం స్కూల్ తదితర అక్రమాలకు పాల్పడిన వాటిపై తీసుకుంటాం. అవసరమైతే ఆ స్కూళ్ల లైసెన్స్‌లు రద్దు చేస్తాం. పరీక్షలు అయిన తర్వాత రాజకీయాలు మాట్లాడదాం. లోకేష్ ఆరోపణలు చీప్ గా ఉన్నాయి. ఆరు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అతనికి పట్టదా?’’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment