సీఎంగా మళ్లీ జగన్ గెలిస్తేనే అన్ని వర్గాలకు న్యాయం: మంత్రి బొత్స | Minister Botsa Satyanarayana Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

సీఎంగా మళ్లీ జగన్ గెలిస్తేనే అన్ని వర్గాలకు న్యాయం: మంత్రి బొత్స

Published Thu, Apr 11 2024 2:22 PM | Last Updated on Thu, Apr 11 2024 2:47 PM

Minister Botsa Satyanarayana Fires On Chandrababu - Sakshi

సాక్షి, విజయనగరం జిల్లా: బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్‌ నాయకత్వం అవసరమని, ఆయన గెలిస్తేనే న్యాయం జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో వైస్సార్సీపీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు కష్టపడితే మళ్లీ మన గౌరవం నిలిబెట్టుకుంటామని గుర్తుంచుకోవాలన్నారు. చిన్న చిన్న మనస్పర్థలు ఉన్న వాటిని పక్కన పెట్టి పనిచేయాలని పిలుపునిచ్చారు.

‘‘మనపై వచ్చే వ్యతిరేక వార్తలు, ప్రచారాలును తిప్పికొట్టాలి. ఈ రోజున మీడియా కన్నా..  సోషల్ మీడియా పవర్ ఫుల్‌గా ఉంది. సోషల్ మీడియా ద్వారా మన ప్రచారం పెంచండి. రాష్ట్రంలో పేదరికం ఐదేళ్లలో గణనీయంగా తగ్గింది. వ్యవసాయం కూడా అభివృద్ధి బాటలో ఉంది. అన్ని వ్యవస్థల్లో సమూల మార్పులు చేసి ఇతర రాష్ట్రాలును వెనక్కి నెట్టి ముందు వరసలోకి వచ్చాం. చంద్రబాబు హయాంలో కూటమి దోపిడీ, దౌర్జన్యాల కూటమి. చంద్రబాబుకి చెప్పుకోవడానికి ఏమిలేక బురద జల్లుతున్నారు. ఆయనలాగా జగన్ పేజీలు పేజీలు మేనిఫెస్టో హామీలు ఇవ్వలేరు. ఇచ్చిన మాటను, హామీని నెలబెట్టుకొని ఓటు అడుగుతున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్‌’’ అని మంత్రి బొత్స అన్నారు.

‘చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన హయాంలో ఏ రోజుయిన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మాయ మాటలు చెప్పే చంద్రబాబును ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. మన పార్టీలో అసమ్మతితో ఉన్న నాయకులను పట్టించుకోకండి. వారు వెళ్లిపోయిన పార్టీకి వచ్చిన నష్టం ఏమి లేదు. జగన్ నాయకులను నమ్ముకోలేదు.. ప్రజలను నమ్ముకున్నాడు. ప్రజల్లో ఆయనకి ఉన్న అభిమానం ఎవరు చేరపలేనిది. వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం అవుతారనేది 100 శాతం నిజం’’ అని మంత్రి బొత్స పేర్కొన్నారు.

పురందేశ్వరి ఐఏఎస్, ఐపీఎస్‌లు మీద లెటర్స్ రాస్తున్నారు. హెరిటేజ్ సంస్థ మేనేజర్లును పెట్టి ఎలక్షన్ చేయాలా?. మంచి, చెడు ఏది ఆలోచించకుండా బురద జల్లుతున్నారు. ఇవ్వేమి పట్టించుకోకుండా ఎలక్షన్లలోకి వెళ్లి కష్టపడండి’’ అని నాయకులు, కార్యకర్తలకు మంత్రి బొత్స సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement