
ఫైల్ ఫోటో
విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌లో అడ్రస్‌లేని సీఎంగా చంద్రబాబు అయిదేళ్ల పనిచేయడం దురదృష్టమన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు కుటుంబంతో సహా ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉంటున్నారనే విషయం గుర్తుచేశారు. 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని విభజన చట్టం చెప్పిందని, అంతేగానీ తాము హైదరాబాద్ వెళ్తామని చెప్పలేదని బొత్స పేర్కొన్నారు.
దీనిపై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా వ్యంగ్యంగా మాట్లాడుతుండటం బాధాకరమన్నారు. అమరావతి రాజధాని అని కేంద్రానికి పంపి అప్పుడే ఆమోదింప చేసుకుని ఉండాల్సిందని, చంద్రబాబు అలా చేయలేదన్నారు. సీఆర్‌డీఏ చట్ట ప్రకారం ల్యాండ్ పూలింగ్ హామీలను నెరవేర్చుతామని, దీనికి కట్టుబడి ఉన్నామని బొత్స స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment