సాక్షి, విశాఖపట్నం: సీఎం జగన్‌ను ఎదుర్కోలేకే టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకున్నామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు. చంద్రబాబుకు పొత్తులు కొత్తేమీ కాదని.. కేఏ పాల్‌తో తప్ప అన్ని పార్టీలతోనూ చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
అభివృద్ధిని చూసి ఓటు వేయమని సీఎం జగన్ చెబుతుంటే, మా పొత్తులును చూసి ఓటు వేయమని చంద్రబాబు పవన్ చెప్తున్నారు. ఎన్నికలకు మేము సిద్ధం అంటుంటే, అమిత్ షా ఇంటి ముందు పొత్తుల కోసం మేము సిద్ధమని చంద్రబాబు, పవన్ అంటున్నారు. బీజేపీకి ఓటు వేస్తే జగన్‌కు ఓటు వేసినట్టేనని గతంలో చంద్రబాబు మాట్లాడారు. బీజేపీకి మాకు ఎటువంటి సంబంధం లేదని గతంలోనే చెప్పాం. పొత్తుల పేరుతో చంద్రబాబు ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుంటారు’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు.
ఒక వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీతో పొత్తు పెట్టుకోగల సామర్థ్యం చంద్రబాబుది.. చంద్రబాబు పొత్తులతోనే కూటమి ఓటమి మొదలైంది. పొత్తుల గురించి ఆలోచించాల్సిన సమయం మాకు లేదు. మా పొత్తు ప్రజలతోనే ఉంటుంది’’ మంత్రి అమర్‌నాథ్ అన్నారు.
ఇదీ చదవండి: బాబు కన్నింగ్.. ఏపీ బీజేపీ గగ్గోలు !
Comments
Please login to add a commentAdd a comment