
విశాఖ: ‘చంద్రబాబు రాజధాని అంటే జేబులు నింపుకోవడం కాదు’ అని ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. వికేంద్రీకరణ అంశంపై ఈరోజు(సోమవారం)సుప్రీంకోర్టు వ్యాఖ్యల అనంతరం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు.
‘సుప్రీంకోర్టు తీర్పుతోనైనా చంద్రబాబుకు బుద్ధి రావాలి. సుప్రీం వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరగాలి.అన్ని ప్రాంతాలకు మేలు జరగాలనే మూడు రాజధానులు. అమరావతి కూడా అభివృద్ధి చెందాలని మేం కోరుకుంటున్నాం. రాజధాని అంటే జేబులు నింపుకోవడం కాదు.. గుర్తింపు కార్డులు అడిగితే అమరావతి పాదయాత్ర రైతులు పారిపోయారు’ అని అమర్నాథ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment