సాక్షి, మెదక్/గజ్వేల్: బీజేపీ, కాంగ్రెస్‌లవి ద్వంద్వ విధానాలని.. ఢిల్లీలో ఒక మాట, రాష్ట్రంలో మరో మాట మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మెదక్‌లో ఆదివారం కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు కౌన్సిలర్లు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌లపై నిప్పులు చెరిగా రు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ బిల్లు పెడితే.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణి క్యం ఠాగూర్ టీఆర్‌ఎస్‌ను విమర్శించడంపై ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఢిల్లీలో బీజేపీని విమర్శించిన కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రానికి వచ్చేసరికి టీఆర్‌ఎస్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ, కాం గ్రెస్ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని.. అందుకే ఆ రెండు పార్టీలు కుమ్మక్కై సీఎం కేసీఆర్‌పై తిట్ల దండకం మొదలు పెట్టాయని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బీమా, రైతుబంధు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మివేసినట్లేనని పేర్కొన్నారు. దుబ్బాకలో డిపాజిట్ దక్కించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు ఆపసోపాలు పడుతున్నాయని హరీశ్ విమర్శించారు.
మాటలు ఎక్కువ, చేతలు తక్కువ..
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టడానికి కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని, ఆ రెండు పార్టీలవి మాటలు ఎక్కువ, చేతలు తక్కువని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని డబుల్ బెడ్రూం మోడల్ కాలనీలో నివాసముంటున్న దుబ్బాక నియోజకవర్గానికి చెందిన లక్ష్మాపూర్ గ్రామస్తులతో ఆయన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డిలతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వెంటే ఉంటామని ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గతంలో ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుతగిలిన పార్టీల ను ప్రజలు నమ్మరని అన్నారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు ఇచ్చిన హామీమేరకు ఆర్‌అండ్‌ఆర్ కాలనీల పరిసరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment