సాక్షి, విజయవాడ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. ఈ క్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగానే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన వైఎస్‌ఆర్‌సీపీకి లేదని స్పష్టం చేశారు.
కాగా, మంత్రి పెద్దిరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. చంద్రబాబు రాజకీయంగా అంగవైక్యంతో బాధపడుతున్నారు. చంద్రబాబు వేరే రాజకీయా పార్టీలపై ఆధారపడుతున్నారు. మేం బలంగా ఉన్నాం.. వేరే పార్టీల గురించి మాకు అనవసరం. జనసేన, పవన్ కల్యాణ్ గురించి నేను ఏమీ మాట్లాడదలచుకోలేదు అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: ‘మార్గదర్శి’ నిధుల దారి మళ్లింపు కేసుపై సుప్రీంలో విచారణ
Comments
Please login to add a commentAdd a comment