
సాక్షి, శ్రీకాకుళం: జస్టిస్ చంద్రు గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ మేరకు ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ.. జస్టిస్ చంద్రు తీర్పుల గురించి, ప్రభుత్వ పోరాటం గురించి మాట్లాడారు. చంద్రు మాటలు వాస్తవాలను కళ్లకు కట్టే విధంగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఉండే హక్కులు ఉంటాయి. వాటిని తీర్పుల పేరిట ఇబ్బందులకు గురవుతున్నాయని చంద్రూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన విషయంలో తప్పేముంది. అందులో ఒక్కటైనా తప్పని నిరూపించగలరా..?.
చదవండి: ('ఆ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబును ఏం చేసినా పాపం లేదు')
చంద్రూ ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఆలోచించాలి. చంద్రబాబు మానసికస్థితిపై ప్రజలకు అనుమానం వస్తోంది. ఎవరైనా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే తన పేటీఎం బ్యాచ్‌తో బండ బూతులు తిట్టిస్తున్నారు. మీరు అలా ప్రవర్తిస్తున్నారనే ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మూడు రాజధానులపై ఉత్తరాంధ్రలో పెద్ద ఉద్యమం జరగాల్సి ఉంది. ఉత్తరాంధ్రలో మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి మూడు రాజధానుల కోసం ఉద్యమిస్తారని మంత్రి అప్పలరాజు అన్నారు.
చదవండి: (రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొనే పీఆర్సీ: సజ్జల)
Comments
Please login to add a commentAdd a comment