సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఉద్దేశ్య పూర్వకంగానే ప్రధాని మోదీకి ఆహ్వానం పలకలేదని అంటున్న బీజేపీ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్దేశ్య పూర్వకంగానే ముఖ్యమంత్రి వెళ్ళలేదని, అయితే ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు తాము భయపడాల్సిన పని లేదన్నారు. తెలంగాణకు చేసిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని తాము నిరసన తెలిపామన్నారు. తెలంగాణకు కేంద్రం ఏం ఒరగబెట్టిందో బీజేపీ నేతలకు చెప్పే దమ్ము ఉందా? అని మంత్రి తలసాని ప్రశ్నించారు.
చదవండి: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఘాటు విమర్శలు
‘నెహ్రు జులాజికల్ పార్క్‌లో ఉన్న జంతువుల లాగా బీజేపీ వాళ్ళు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ మీద మోదికి ఎంత కక్ష్య ఉందో ఆయన మాటలతోనే తెలుస్తోంది. ప్రధాని కొత్త డ్రామాకు తెర లేపారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసమే మోదీ కొత్త రాగం అందుకున్నారు. తెలంగాణను విడదీసి కాంగ్రెస్ అన్యాయం చేస్తే.. నువ్వు ఏం న్యాయం చేశావో చెప్పు. మొన్నటి ముచ్చింతల్ ఆధ్యాత్మిక కార్యక్రామాన్ని కూడా రాజకీయంగా వాడుకున్నారు. పిచ్చి కామెంట్స్ ఆపి.. రాష్ట్రం అడిగిన ఒక్క పని కేంద్రం చేయలేదు. ముందుగా దానికి సమాధానం చెప్పాలి
విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ తుంగలో తొక్కారు. ప్రధాని వ్యాఖ్యలకు రాష్ట్ర బీజేపీ నేతలు ఏ మొహం పెట్టుకుని తిరుగుతారు. సింగరేణి జోలికి వస్తే తెలంగాణ ఉద్యమం తరహా మరో ఉద్యమం తప్పదు. డ్రెస్ కోట్లు మార్చుకొనే దానిమీద ఉన్న శ్రద్ధ ప్రధానికి దేశంలో ఉన్న సమస్యల మీద లేదు. ప్రధాని పర్యటనలో నెలకొన్న అంశాలను సాకుగా పెట్టుకొని కుక్కల్లాగా అరుస్తున్నారు. కేంద్రమే తెలంగాణ పనితీరుపై ప్రశంసలు కురిపిస్తూ అవార్డులు , రివార్డులు ఇచ్చింది. యూపీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ గెలుస్తున్నాడు. బీజేపీ ఓడిపోతోంది. దేశ రాజకీయాల్లో భారీ మార్పులు రాబోతున్నాయి’ అని మంత్రి తలసాని పేర్కొన్నారు.
చదవండి: తెలంగాణలో కరోనా మూడోదశ: గుడ్‌న్యూస్ చెప్పిన డీహెచ్ శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment