నన్ను చంపాలని చూశారు: ఎమ్మెల్యే గువ్వల | Mla guvvala balraj slams congress leaders at apollo hospital | Sakshi
Sakshi News home page

నన్ను చంపాలని చూశారు: ఎమ్మెల్యే గువ్వల

Published Sun, Nov 12 2023 3:51 PM | Last Updated on Thu, Nov 23 2023 12:13 PM

Mla guvvala balraj slams congress leaders at apollo hospital  - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: కాంగ్రెస్‌ గూండాలు తనపై దాడి చేశారని, తన  కాన్వాయ్‌ని వెంబడిస్తూ దాడి చేశారని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణ నా అనుచరులను చంపినంత పనిచేశారు. రాయితో నాపై దాడి చేశారు. ఈ మధ్యనే కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి చేశారు నిన్న నామీద దాడిచేశారు. నా అదృష్టం, ప్రజల దీవెనల వల్ల బతికి బయటపడ్డా. వంశీకృష్ణ గతంలో నా ఆఫీసు మీద దాడి చేశాడు. అతనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం, కేసీఆర్‌, కేటీఆర్‌ ఆశయాల కోసం పనిచేస్తా’ అని బాలరాజు చెప్పారు. 

కాగా, అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య శనివారం రాత్రి ఘర్షణ జరిగింది. బీఆర్‌ఎస్‌ నేతలు కారులో డబ్బు తరలిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు వెంబడించారు. ఇరు పార్టీల నేతలు రాళ్లు విసురుకున్నారు. రాళ్ల దాడిలో గువ్వల బాలరాజుకు గాయాలయ్యాయి. 

కేటీఆర్‌, హరీశ్‌రావు పరామర్శ..

దాడి తర్వాత అపోలో ఆస్పతత్రిలో చికిత్స పొందిన ఎమ్మెల్యే బాలరాజును మంతత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు వేర్వేరుగా పరామర్శించారు.  దాడి వివరాలు, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

ఇదీ చదవండి..నా భర్తపై దాడిని ఖండిస్తున్నా: ఎమ్మెల్యే గువ్వల భార్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement