guvvala balaraj
-
నన్ను చంపాలని చూశారు: ఎమ్మెల్యే గువ్వల
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ గూండాలు తనపై దాడి చేశారని, తన కాన్వాయ్‌ని వెంబడిస్తూ దాడి చేశారని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ నా అనుచరులను చంపినంత పనిచేశారు. రాయితో నాపై దాడి చేశారు. ఈ మధ్యనే కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి చేశారు నిన్న నామీద దాడిచేశారు. నా అదృష్టం, ప్రజల దీవెనల వల్ల బతికి బయటపడ్డా. వంశీకృష్ణ గతంలో నా ఆఫీసు మీద దాడి చేశాడు. అతనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం, కేసీఆర్, కేటీఆర్ ఆశయాల కోసం పనిచేస్తా’ అని బాలరాజు చెప్పారు. కాగా, అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య శనివారం రాత్రి ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ నేతలు కారులో డబ్బు తరలిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు వెంబడించారు. ఇరు పార్టీల నేతలు రాళ్లు విసురుకున్నారు. రాళ్ల దాడిలో గువ్వల బాలరాజుకు గాయాలయ్యాయి. కేటీఆర్, హరీశ్‌రావు పరామర్శ.. దాడి తర్వాత అపోలో ఆస్పతత్రిలో చికిత్స పొందిన ఎమ్మెల్యే బాలరాజును మంతత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వేర్వేరుగా పరామర్శించారు. దాడి వివరాలు, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇదీ చదవండి..నా భర్తపై దాడిని ఖండిస్తున్నా: ఎమ్మెల్యే గువ్వల భార్య -
నా భర్తపై దాడిని ఖండిస్తున్నా: ఎమ్మెల్యే గువ్వల భార్య
సాక్షి,హైదరాబాద్ : తన భర్త మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అచ్ఛంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భార్య గువ్వల అమల అన్నారు. దాడి ఘటనపై అపోలో ఆస్పత్రి వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారం చేసుకోనివ్వకుండా కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ తన అనుచరులతో దాడులకు తెగబడుతున్నాడు. ప్రచారం ముగించుకొని వెళ్తుండగా మా వాహనాలను అడ్డగించి కార్ల అద్దాలను ధ్వంసం చేసి రాళ్లతో దాడి చేశారు. నా భర్తకు దవడ, మెడ భాగంలో గాయాలయ్యాయి. డాక్టర్లు ఇప్పటికే స్కానింగ్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. గతంలో వంశీకృష్ణ అనుచరులు నాపై అసభ్యకరంగా మాట్లాడారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ల తీరు మార్చుకోవడం లేదు. మా కార్యకర్తలను బెదిరిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాల్స్ చేస్తున్నారు. నియోజకవర్గానికి వస్తే అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నీచమైన రాజకీయాలు సరికాదు. అచ్చంపేట నియోజకవర్గం ప్రజలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆయన అనుచరులకు బుద్ధి చెప్తారు’ అని గువ్వల భార్య హెచ్చరించారు. కేటీఆర్ పరామర్శ.. దాడి తర్వాత హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గువ్వల బాలరాజును ఆదివారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరామర్శించారు. రాళ్ల దాడిలో గువ్వలకు గాయాలు.. కాగా, అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య శనివారం రాత్రి ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ నేతలు కారులో డబ్బు తరలిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు వెంబడించారు. ఇరు పార్టీల నేతలు రాళ్లు విసురుకున్నారు. రాళ్ల దాడిలో గువ్వల బాలరాజుకు గాయాలయ్యాయి. ఇదీ చదవండి..బీఆర్ఎస్లో చేరిన పాల్వాయి స్రవంతి -
సీబీఐ, ఈడీ అంటే లొంగిపోవడానికి.. మేము సుజనా చౌదరి, సీఎం రమేష్ కాదు
-
ఫామ్ హౌస్‌లో ఏం జరిగింది?.. ఆ ఫోన్లలో అవతల ఎవరు?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రలోభాలకు ప్రయత్నించిన ముగ్గురూ చేసిన ఫోన్ కాల్స్ ఇప్పుడు కీలకంగా మారాయి. ఎవరికి ఫోన్ చేశారు? అనే అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. దాదాపు గంటన్నర పాటు సాగిన వీరి మంతనాలను నిఘా వర్గాలు, పోలీసు అధికారులు ప్రత్యేక కెమెరాల ద్వారా రికార్డు చేశారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర? హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభ పెట్టడానికి రంగంలోకి దిగినట్టుగా చెబుతున్న సింహయాజులు స్వామి, రామచంద్ర భారతి, నంద కుమార్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి, ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించడానికి పోలీసులు భారీ స్కెచ్ వేశారు. రోహిత్ రెడ్డి ద్వారానే ఈ సమావేశం మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో ఉన్న అతడి ఫామ్ హౌస్‌లో జరిగేలా కథ నడిపారు. బుధవారం సాయంత్రం సమావేశం కావాలని వీళ్లు మంగళవారం ఉదయమే నిర్ణయించుకున్నారు. వేచి చూసి దాడి చేశారు..: ఎమ్మెల్యేల ద్వారా విషయం తెలుసుకున్న నిఘా అధికారులు, పోలీసులు మంగళవారం సాయంత్రమే ఫామ్ హౌస్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో సమావేశం జరిగేందుకు ఉద్దేశించిన హాల్‌తో పాటు ఆరుచోట్ల అత్యాధునికమైన రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ సమావేశం జరిగినా ఆద్యంతం రికార్డు అయ్యేలా సిద్ధం చేశారు. బుధవారం ఉదయం నుంచి పోలీసులు, నిఘా వర్గాలు మారు వేషాల్లో ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నా.. సాయంత్రం ఈ సమావేశం మొదలైన వెంటనే దాడి చేయలేదు. దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగేవరకు, వారి మాటలతో పాటు అక్కడ జరిగే ప్రతి వ్యవహారం రికార్డు కావడం కోసం వేచి చూశారు. ఆపై దాడి చేసి ముగ్గురితో పాటు డ్రైవర్ తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఫోన్లు!: సమావేశం జరిగిన హాలులోని ఓ పక్కగా ఉన్న డైనింగ్ టేబుల్ వద్ద ఆ ముగ్గురూ, సోఫాల్లో ఎమ్మెల్యేలు నలుగురూ కూర్చున్నారు. ఈ మీటింగ్ నేపథ్యంలో రామచంద్ర భారతి మూడుసార్లు గుర్తుతెలియని వ్యక్తులకు ఫోన్లు చేసి ఎమ్మెల్యేలతో మాట్లాడించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే అవతలి వ్యక్తి అందుబాటులోకి రాకపోవడంతో వీలు కాలేదు. అలాగే ఆ ముగ్గురూ ఢిల్లీలో ఉన్న ఓ కేంద్ర పెద్దతో మాట్లాడించాలని ప్రయతి్నంచారని, అయితే ఆయన అందుబాటులో లేరని సహాయకుడు చెప్పిన అంశాలు రికార్డు అయినట్లు తెలిసింది. 3 రోజులు..70 మంది పోలీసులు: ఈ ఆపరేషన్ కోసం నిఘా, పోలీసు వర్గాలకు చెందిన దాదాపు 70 మంది 3 రోజులు పని చేశారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 84 సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేశారు. గంటన్నర పాటు సాగిన భేటీ ఈ కెమెరాల్లో రికార్డు అయ్యింది. పీఠాధిపతిగా ప్రకటించుకున్న సింహయాజులు: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల పర్వంలో కీలకంగా వ్యవహరించిన సింహయాజులు స్వామి తిరుపతి వాసి. అన్నమయ్య జిల్లా చిన్న మండ్యం మండలంలో శ్రీమంత్రరాజ పీఠం ఏర్పాటు చేసుకొని, తనను తాను పీఠాధిపతిగా ప్రకటించుకున్నారు. అది లక్ష్మీ నరసింహ స్వామికి చెందిన పీఠంగా చెబుతూ పలుకుబడి పెంచుకున్నాడు. ఇతడికి తిరుపతిలో సొంత ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బు తెచ్చింది నందూయేనా..?: రామచంద్ర భారతి ఢిల్లీ ఫరీదాబాద్‌లోని ఓ ఆలయ పూజారి కాగా.. కర్ణాటకకు చెందిన నందకుమార్ నగరానికి వలసవచ్చి చైతన్యపురి ప్రాంతంలో నివసిస్తున్నాడు. గతంలో బంజారాహిల్స్ ప్రాంతంలో సదరన్ స్పైస్ పేరుతో ఓ రెస్టారెంట్ నడిపాడు. ఫిల్మీ జంక్షన్ అనే రెస్టారెంట్ నిర్వహణ సమయంలో దాని స్థల యజమాని అయిన సినీ ప్రముఖుడితో విభేదాలు తలెత్తాయి. ఆపై అవినాష్ అనే వ్యక్తితో కలిసి మాణిక్‌చంద్ పాన్ మసాలా వ్యాపారం చేశాడు. తర్వాత మాణిక్ చంద్ బ్రాండ్‌ను తన ఆ«దీనంలోకి తీసుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణతో పాటు ఏపీలోనూ సౌత్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. వీటితో పాటు నగరంలోని అనేక పబ్బులు, రెస్టారెంట్లు, బార్లలో భాగస్వామ్యం ఉంది. పలువురు ప్రముఖులు ఇతడి వద్ద పెట్టుబడులు పెట్టారని, కొందరు ప్రజాప్రతినిధులు, పోలీసులతో ఇతడికి స్నేహం ఉందని, హవాలా ఆపరేటర్ అని కూడా తెలిసింది. బుధవారం నందు పుట్టిన రోజు కావడంతో ఈ ఫామ్ హౌస్‌లో పార్టీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. హవాలా ఆపరేటర్ కావడంతో డబ్బు తీసుకువచ్చింది నందూయేనా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా నిందితులు ముగ్గుర్నీ పోలీసులు ఫామ్‌హౌస్ నుంచి తరలించారు. -
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర?
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించేలా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. మునుగోడు ఉప ఎన్నికను ప్రభావితం చేసేలా ఓ జాతీయ పార్టీ అండదండలతో వ్యూహాత్మక బేరసారాలు జరిగినట్టు ఆరోపణలు రావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ టీఆర్ఎస్ ఆరోపించడం.. ఆ నలుగురు హార్డ్‌కోర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తామేం చేసుకుంటామంటూ బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొట్టిపారేయడం చర్చనీయాంశంగా మారాయి. అజీజ్ నగర్ ఫామ్‌హౌజ్ వేదికగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్), పైలట్ రోహిత్‌రెడ్డి (తాండూరు), రేగ కాంతారావు (పినపాక)లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం రాత్రి ప్రకటించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే భారీ ఎత్తున డబ్బులిస్తామని.. పదవులు, కాంట్రాక్టులు అప్పగిస్తామని ఆ ముగ్గురు ఎర వేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ ప్రలోభాలకు వేదిక అయిన రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం అజీజ్‌నగర్ పరిధిలో ఉన్న పీవీఆర్ ఫామ్‌హౌజ్‌పై దాడి చేసి.. ఫరీదాబాద్‌కు చెందిన రాంచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజులు, కేంద్ర మంత్రికి సన్నిహితుడని చెప్తున్న నందకుమార్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఈ ప్రలోభాలకు సంబంధించి నలుగురు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే తాము దాడి చేశామన్నారు. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు నలుగురు ఎమ్మెల్యేలు ఫామ్‌హౌజ్‌కు చేరుకుని.. ముగ్గురు వ్యక్తులతో దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపినట్టు సమాచారం. తర్వాత సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) దాడులు జరిగాయి. ఈ సందర్భంగా భారీగా నగదు, సెల్ఫోన్లు, వాహనాలను స్వాదీనం చేసుకున్నట్టు ప్రచారం జరిగినా.. పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.వంద కోట్లతోపాటు పదవులు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభాలకు గురిచేసినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేల్లో గువ్వల బాలరాజు మినహా మిగతా ముగ్గురు కాంగ్రెస్ తరఫున గెలిచి తర్వాత టీఆర్ఎస్లో చేరినవారే. ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతో..: స్టీఫెన్ రవీంద్ర దాడి అనంతరం ఫామ్‌హౌజ్ వద్ద సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ‘‘తమను కొందరు ప్రలోభపెడుతున్నారని ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు దాడులు చేశాం. ఫరీదాబాద్ పీఠాధిపతి ఈ మొత్తం వ్యవహారంలో కీలక మంతనాలు సాగించారు. డబ్బు, పదవులు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభపెట్టినట్టు ఎమ్మెల్యేలు చెప్పారు. ఈ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎలాంటి ప్రలోభాలకు ప్రయతి్నంచారు, ఇతర అంశాలు ఏమిటన్నది దర్యాప్తు చేస్తాం. డబ్బు ఇచ్చారా? ఇస్తే ఎంత ఇచ్చారు? ఎక్కడి నుంచి వచి్చంది? ఎవరు తీసుకువచ్చారనే వివరాలు సేకరిస్తాం..’’ అని తెలిపారు. ఆ ముగ్గురూ ఎవరు? ఢిల్లీకి సమీపంలోని ఫరీదాబాద్‌లో ఓ దేవాలయంలో ఉండే రాంచంద్రభారతి అలియాస్ సతీశ్‌శర్మ, తిరుపతిలో ఓ పీఠానికి అధిపతిగా చెప్పుకొనే సింహయాజులు, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో దక్కన్ ప్రైడ్, అంబర్‌పేటలో సెలబ్రేషన్స్ పేరిట హోటళ్లను నిర్వహిస్తున్న నందకుమార్.. ఈ ముగ్గురూ ఎమ్మెల్యేల ప్రలోభం కేసులో నిందితులుగా ఉన్నారు. వారు కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో నందకుమార్‌కు చెందిన హోటళ్లు, ఫామ్‌హౌజ్‌లలో ఉంటున్నట్టు సమాచారం. నందకుమార్ ఓ కేంద్ర మంత్రికి సన్నిహితుడని.. ఈ ముగ్గురూ కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారని టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. మూడు రోజులుగా స్కెచ్ వేసి.. పార్టీ ఫిరాయించాలంటూ సంప్రదించిన ముగ్గురు వ్యక్తులను పట్టించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారని.. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రెడహ్యాండెడ్గా పట్టుకునేందుకు పక్కా ప్లాన్ వేశారని రాజకీయ, పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆ వివరాల మేరకు.. ప్రలోభాల అంశంపై నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారమిచ్చారు. తాము పార్టీ మారితే ఒక్కొక్కరికి రూ.100 కోట్లు, కాంట్రాక్టులు, కేంద్రం ఆధీనంలోని పదవులు ఇస్తామంటూ ఎర వేశారని వివరించారు. అయితే నేరుగా ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుంటే అసలు విషయం బయటపడదని భావించిన పోలీసులు.. బేరసారాలు సాగిస్తూ, అడ్వాన్సులు ఇచ్చే సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం నిఘావర్గాలతోపాటు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల సూచన మేరకు.. సదరు ముగ్గురితో ఎమ్మెల్యేలు సంప్రదింపులు కొనసాగించారు. అడ్వాన్స్ ఇచ్చేందుకు ఆ ముగ్గురు వ్యక్తులు సిద్ధమవడంతో బుధవారం అజీజ్‌నగర్‌లోని పైలట్ రోహిత్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌజ్‌కు రావాలని ఎమ్మెల్యేలు సూచించారు. ఈ వ్యవహారం మొత్తాన్ని చిత్రీకరించేందుకు పోలీసులు రహస్య కెమెరాలు, ఇతర నిఘా ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం నుంచే ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో కాపు కాశారు. కూలీలు, చిన్న వ్యాపారులు, స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా మారువేషాలు వేసుకుని నిఘా పెట్టారు. నలుగురు ఎమ్మెల్యేలు సాయంత్రం 5 గంటల సమయంలో, కాసేపటి తర్వాత ముగ్గురు వ్యక్తులు ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. సమావేశం మొదలైందని, డబ్బుతో కూడిన రెండు సంచులు లోపలికి వచ్చాయని ఎమ్మెల్యేల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే దాడి చేసిన అధికారులు సింహయాజులు, రాంచంద్రభారతి, నందకుమార్లతోపాటు తిరుపతి అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రూ.15 కోట్లు స్వాదీనం? పోలీసులు తమదాడి సందర్భంగా ఓ కారును, రెండు బ్యాగుల్లో రూ.15 కోట్ల నగదు, సెల్ఫోన్లు, ఇతర పత్రాలను స్వాదీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. సింహయాజులు, రాంచంద్రభారతి, నందకుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారితో వచ్చిన తిరుపతి అనే వ్యక్తి తాను కారు డ్రైవర్‌నని చెప్పడంతో వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. పోలీసులు స్వా«దీనం చేసుకున్న కారు గంధవరం దిలీప్‌కుమార్ పేరిట ఉందని.. ఆయన ఎవరు? ఆ ముగ్గురితో సంబంధంలు ఏమిటన్నది ఆరా తీస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. పరిచయాలే పెట్టుబడిగా వ్యాపారాలతో..! అంబర్‌పేట: నందకుమార్ కుటుంబం కర్ణాటక నుంచి వచ్చి అంబర్‌పేట డీడీ కాలనీలో స్థిరపడ్డారని.. ఆయన తండ్రి శంకరప్ప హైదరాబాద్ నగర పీస్ కమిటీ సభ్యులని స్థానికులు చెబుతున్నారు. ఆయనకు పోలీసుశాఖలో ఉన్న పరిచయాలను కుమారుడు నందకుమార్ వినియోగించుకుని పలు వ్యాపారాల్లో అడుగుపెట్టారని అంటున్నారు. ప్రధానంగా హోటల్ రంగంలో ఉన్న నందకుమార్‌పై పలు ఆరోపణలూ ఉన్నాయని పేర్కొంటున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంబర్‌పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నందకుమార్‌కు పరిచయమని.. తన హోటళ్ల ప్రారంభోత్సవాలకు కిషన్‌రెడ్డిని ఆహ్వానించారని చెబుతున్నారు. నందకుమార్ స్థానికంగా పెద్దగా కనిపించరని.. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణల అంశం అంబర్‌పేటలో చర్చనీయాంశంగా మారిందని పేర్కొంటున్నారు. ఎవరా ముగ్గురు? ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో ఓ దేవాలయంలో పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీశ్‌శర్మ.. తిరుపతిలో ఓ పీఠానికి అధిపతిగా చెప్పే సింహయాజులు.. హైదరాబాద్‌లో హోటల్స్ వ్యాపారం చేసే నందకుమార్ ఎలా ఆపరేషన్? ఎమ్మెల్యేల సమాచారం మేరకు పక్కాగా ప్లాన్ వేసిన పోలీసులు. కూలీలు, చిన్న వ్యాపారులు, స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ వేషాల్లో నిఘా. అంతా ఫామ్‌హౌజ్‌లోకి చేరుకున్నాక, డబ్బు సంచులు వచ్చాయని ఎమ్మెల్యేలు సమాచారమిచ్చాక దాడి. రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు. ఏం ఇస్తామన్నారు? పార్టీ మారితే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు, కాంట్రాక్టులు, కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని పదవులు ఇస్తామంటూ ప్రలోభపెట్టారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. దాడి సందర్భంగా పోలీసులు రూ.15 కోట్లు పట్టుకున్నట్టు ప్రచారం జరిగింది. దీనిని అధికారికంగా ధ్రువీకరించలేదు. -
‘పేదల సంక్షేమమే టీఆర్ఎస్ కర్తవ్యం’
సాక్షి, బల్మూర్: కాంగ్రెస్, టీడీపీ పాలనలో వెనకబాటుకు గురైన తెలంగాణ పేద ప్రజల సంక్షేమమే కర్తవ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టిందని మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గ్వుల బాల్‌రాజ్ సతిమణి అమల అన్నారు. శుక్రవారం కొండనాగులలో ఆమె పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తన భర్త గువ్వల బాల్‌రాజ్‌ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం గంగపుత్ర సంఘానికి చెందిన మహిళలు అమల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమితి సభ్యురాలు అరుణమ్మ, పీఏసీఎస్ చైర్మన్ చంద్రమోహన్, మాజీ సర్పంచ్ సలెమ్మ, గ్రామ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్‌రావు తదితరులు పాల్గొన్నారు. గువ్వలను మెజార్టీతో గెలిపించాలి అచ్చంపేట రూరల్: పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును అధిక మెజార్టీతో గెలిపించాలని కౌన్సిలర్లు, పలువురు టీఆర్ఎస్ నాయకులు కోరారు. శుక్రవారం పట్టణంలోని ఆయా కాలనీల్లో టీఆర్ఎస్ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కౌన్సిలర్లు నిర్మలబాలరాజు, శివ, మనోహర్‌ప్రసాద్, శ్రీను, నాయకులు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం లింగాల: మండలంలోని ఆయా గ్రామాల్లో పర్యటించిన టీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారాలు నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుకు మద్దతుగా ఆ పార్టీకి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తిర్పతయ్య, మాజీ ఎంపీపీ జగపతిరావు, నాయకులు తిర్పతయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బాకారం, కోమటికుంట, శాయిన్‌పేట, దత్తారంలో ప్యటించి కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధిని చూసి ఓటేయ్యండి ఉప్పునుంతల: మండల కేంద్రంలో శుక్రవారం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నాలున్నర ఏళ్లలో సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి కారుగుర్తుకు ఓటు వేసి గువ్వల బాల్రాజును మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గోపాల్‌రెడ్డి, వెంకటయ్య, జంగయ్య, ఎల్లయ్యయాదవ్, బక్కయ్య, సీహెచ్ తిర్పతయ్య, గణేష్, బాలస్వామి, చిన్న జంగయ్య పాల్గొన్నారు. -
సంపత్‌ను చేర్చుకోవాల్సిన అవసరం లేదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌ను చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని టీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజు అన్నారు. మంత్రి హరీశ్‌రావుపై సంపత్ వ్యాఖ్యలను ఖండించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఆర్డీఎస్‌పై సంపత్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆయన టీఆర్ఎస్లో చేరుతున్నారని లీకులు ఇవ్వాల్సిన అవసరం హరీశ్‌కు లేదని చెప్పారు. ఉమ్మడి ఏపీలో ఆర్డీఎస్కు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తుమ్మిళ్ల లిఫ్ట్ పథకం శంకుస్థాపన నడిగడ్డ ప్రజల కళ్ళలో కొత్త కాంతులు నింపిందన్నారు. కేసీఆర్ పాదయాత్ర వల్లే తుమ్మిళ్ల లిఫ్టు రూపుదిద్దుకుందన్నారు. ఇకనైనా రేవంత్, సంపత్‌లు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. -
రేవంత్‌ను సస్పెండ్ చేయాలి
సాక్షి, హైదరాబాద్: మంత్రి లక్ష్మారెడ్డిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. కాంగ్రెస్‌కు నైతిక విలువలు ఉంటే రేవంత్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ బ్రోకర్ దందాలు చేసి డబ్బులు సంపాదించారని ఆరోపించారు. మాదిగలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని, వర్గీకరణపై త్వరలోనే ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళతామన్నారు. ఎన్నికల సమయంలో వర్గీకరణ హామీ ఇచ్చి కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీని రేవంత్ ఎందుకు ప్రశ్నించటం లేదని నిలదీశారు. స్పీకర్‌కు రేవంత్ రాజీనామా సమర్పిస్తే, సీఎం కేసీఆర్ బలం ఏంటో చూపిస్తామన్నారు. మంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సబబు కాదని, రేవంత్ మాటలపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ స్పందించాలని డిమాండ్ చేశారు. రేవంత్ నియంత్రణ లేకుండా మాట్లాడుతున్నారని, చివరకు సీఎం కేసీఆర్‌ను కూడా వ్యక్తిగతంగా దూషిస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్‌ను గెలిపించిన ప్రజలు సైతం సిగ్గుపడేలా ఆయన వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. -
బీసీ, ఎస్సీ, ఎస్టీలంటే కాంగ్రెస్‌కు చులకన!
సాక్షి, హైదరాబాద్: బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, 2017–18 రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు రూ. 5వేల 70 కోట్లను కేటా యించామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలంటే కాంగ్రెస్ నేతలకు చులకన భావన ఉందని విమర్శించారు. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, అంజయ్య యాదవ్ విలేకరులతో మాట్లాడారు. బీసీలను గతంలో కేవలం ఓటు బ్యాంకులుగానే పార్టీలు పరిగణించాయని, ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా కేసీఆర్ బీసీల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. అచ్చంపేటలో కాంగ్రెస్ నిర్వహించింది ప్రజాగర్జన సభ కాదని, సీఎం అభ్యర్థుల అధికార యావ సభ అని పేర్కొన్నారు. -
'టీడీపీది ప్లాప్ షో'
హైదరాబాద్ : రాజకీయాల్లో అవినీతిని ప్రవేశపెట్టింది ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజ్ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై వారు నిప్పులు చెరిగారు. ప్యాకేజీల ద్వారా చంద్రబాబు పార్టీని కాపాడుకుంటున్నారని విమర్శించారు. వరంగల్‌లో చంద్రబాబు ఆధ్వర్యంలో గురువారం టీడీపీ నిర్వహించిన షో ప్లాప్ అయిందని ఎద్దేవా చేశారు.