సాక్షి, అమరావతి : మాజీ టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బ్యాంకుల నుంచి లూటీ చేస్తే.. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఎందుకు నోరు మెదపలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దోచుకుని తినడంలో చంద్రబాబు నెంబర్ వన్ అని విమర్శించారు. టీడీపీ నేతలు.. మాల్యా, దావూద్‌లను మించిపోయారని మండిపడ్డారు. రాయపాటి సాంబశివరావు చేసిన అవినీతిలో బాబు వాటా ఎంత?.. తెలుగుదేశం పార్టీ వాటా ఎంతో చెప్పాలి?.. పోలవరం కాంట్రాక్టు ధారాదత్తం చేసింది చంద్రబాబు కాదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment