
సాక్షి, హైదరాబాద్: అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారించాలని, లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ...రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై గంటన్నర మాట్లాడిన ప్రధాని మోదీ, ఒక్కసారి కూడా అదానీ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదో సమాధానం చెప్పాలన్నారు.
రూ. పది లక్షల కోట్ల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మోదీ మనకు అవసరమా అని నిలదీశారు. హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన 10 రోజుల్లోనే అదానీ ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 2వ స్థానం నుంచి 22వ స్థానానికి పడిపోయారని కవిత పేర్కొన్నారు. అదానీ సంస్థ అనేక ప్రభుత్వరంగ సంస్థల నుంచి అప్పులు తీసుకోవడంతో పాటు, ఎల్‌ఐసీ అదానీ గ్రూప్‌లో రూ.80 వేల కోట్లు పెట్టుబడి పెట్టిందన్నారు. చిరుద్యోగులు, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎల్‌ఐసీ షేర్లు కొని, అదానీ సంస్థ కారణంగా తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: బీజేపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో కనీసం ఒక గదైనా ఇవ్వండి: ఈటల