సాక్షి, హైదరాబాద్: అధికారం దూరమవుతుందనే నిరాశ, నిస్పృహలతో కాంగ్రెస్ నోటికొచ్చిన వాగ్దా నాలు చేస్తోందని.. తొమ్మిదేళ్ల పాలనలో చెప్పు కొ నేందుకు చేసినదేమీ లేక ఓట్ల కోసం బీజేపీ భా వోద్వేగాలను రెచ్చగొడుతోందని మంత్రి కేటీ రామారావు ఆరోపించారు. పేదలు, రైతులను క డుపులో పెట్టుకుని చూసుకుంటున్న సీఎం కేసీఆర్.. తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో అగ్ర స్థానంలో నిలిపారని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఏ వైపు నిలబడతారో తేల్చు కోవా ల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్నసత్యనారాయణ బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘‘కేంద్రంలో అధి కారంలో ఉన్న బీజేపీ దేశానికి చేసిందేమిటో చెప్పు కునే పరిస్థితి లేక తిమ్మినిబమ్మి చేసి అధికారంలోకి రావాల నుకుంటోంది.
హైదరాబాద్ సంస్థానం విలీనమైన సందర్భం, కమ్యూనిస్టుల సాయుధ పోరాటం, త్యాగాలను గుర్తు చేసుకుంటూ సీఎం కేసీఆర్ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు. ఇది నచ్చని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత వైషమ్యాలు రెచ్చ గొట్టి. పాత గాయాలను రేపి చలి కాచుకోవాలని చూస్తోంది’’ అని కేటీఆర్ ఆరోపించారు.
రాష్ట్రంపై తీవ్ర వివక్ష
తెలంగాణ ఏర్పాటైననాటి నుంచే మోదీ నేతృత్వంలోని ఫాసిస్టు ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపు తోందని కేటీఆర్ ఆరోపించారు. పార్లమెంటు వేదికగా ఇచ్చిన విభజన హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. పేదల జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తామని మోదీ మాట ఇచ్చి తప్పారని.. మరోవైపు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుబంధు పేరిట 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు వేశారని చెప్పారు. కేంద్రం కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతూ, ప్రభుత్వ సంస్థలను అదానీకి కట్టబెడుతోందని ఆరోపించారు.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అంటూ డ్రామాలు చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పౌరుషముంటే మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకుడు గూడూరు నారా యణరెడ్డి పెట్టుబడితో పాత గాయాలను మళ్లీ రేపేలా రజాకార్ సినిమా తీసి, ప్రజల్లో చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మోదీకి ఉత్కృష్ట పదవి ఇస్తే.. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, రజాకార్ ఫైల్స్ అంటూ నికృష్ట పనులు చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్‌వి ఆపద మొక్కులు
రాష్ట్రంలో 55 ఏళ్లు అధికారంలో ఉండీ ఏమీ చేయలేని కాంగ్రెస్.. ఇప్పుడు అధికారం కోసం ఆపద మొక్కులు మొక్కుతోందని కేటీఆర్ విమ ర్శించారు. ‘‘కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమ లుకానీ ఆరు గ్యారంటీలు ఇక్కడ అమలు చేస్తారట. డబ్బు సంచులతో కెమెరాలకు చిక్కిన వారికి నాయకత్వం అప్పగిస్తే ఇలాంటి దిక్కు మాలిన ఆలోచనలే వస్తాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు, తాగునీరు, సాగునీరు, ఎరువులు, విత్తనాల కోసం మళ్లీ కష్టాలు తప్పవు.
రైతుబంధు, దళితబంధుకు మంగళం పాడుతారు. కర్ణాటకలో హామీల అమలుకు నిధులు లేవని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్తున్నారు. కాంగ్రెస్ నేతల వద్ద కుంభకోణాలతో సంపాదించిన సొమ్ము చాలానే ఉంది. వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకుని బీఆర్‌ఎస్‌కు ఓటు వేయండి..’’ అని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్, ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, ఎమ్మెల్యే హరిప్రియ, ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొన్నారు.
రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భం
మహిళా బిల్లుపై మంత్రి కేటీఆర్ ట్వీట్
‘‘రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భాలు కొన్ని వస్తూ ఉంటాయి. దేశ ప్ర యోజనాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని అంశాల పై ఐక్యంగా నిలవాల్సి ఉంటుంది. ఈ రోజు మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ పరి గణనలోకి తీసుకోవడం పట్ల భారతీయుడిగా గర్విస్తున్నా’’ అని మంత్రి కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) లో వ్యాఖ్యానించారు.
‘‘మైలు రాయి వంటి ఈ చట్టానికి మద్దతు పలికిన కేంద్ర ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ బిల్లు వాస్తవ రూపం దాల్చేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ నాయకులు ఎన్నో ప్రయత్నాలు చేసి నందుకు గర్విస్తున్నా. ఇంకా చెప్పాలంటే స్థానిక సంస్థలైన జిల్లా, మండల పరిషత్‌లు, మున్సి పాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ఎన్నో ఏళ్ల క్రితం నుంచే తెలంగాణలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి’’ అని కేటీఆర్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment