జనసేన అధినేత పవన్ తలచింది ఒకటైతే జరిగింది వేరొకటి. చంద్రబాబు డైరెక్షన్ లో రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రధానిని కలిసిన పవన్ కళ్యాణ్ కు అక్కడ చేదు అనుభవాలు మిగిలాయని తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది సార్ అంటూ పవన్ ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడిలా ఫిర్యాదు చేయడంతోనే ప్రధాని నవ్వేసి ఏపీలో ఏం జరుగుతుందో మాకు తెలుసు అని నర్మగర్భంగా అనడంతోనే పవన్‌కు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లైందని సమాచారం. టీడీపీ-జనసేనల విగ్రహ విధ్వంస రాజకీయాల నుంచి ఇప్పటంలో హై డ్రామాల గురించి పవన్ ప్రస్తావించగానే ఐ నో ఎవ్రీ థింగ్ అని ముక్తసరిగా అనేసరికి పవన్ కళ్యాణ్ ఉత్సాహం కాస్తా ఐస్ క్యూబ్ లా గడ్డకట్టుకుపోయిందని భోగట్టా.
దత్తపుత్రుడితో రాయబారం
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ ప్రధానితో కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీని కూడా కలుపుకు పోదామని ప్రధాని. మోదీ వద్ద ప్రతిపాదన పెట్టాలన్నది చంద్రబాబు సూచన. ఆ టీడీపీ ప్రస్తావన తేగానే ప్రధాని మొహం చిట్లించేశారట. ఇంకేంటి విశేషాలు అని టాపిక్ మార్చారట.
రాసుకోండి ఫిర్యాదుల చిట్టా..!
మొదటి ప్లాన్ బెడిసి కొట్టేసరికి పవన్ లోలోన అసహనానికి గురౌతూ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా పాలిస్తోందని, శాంతిభద్రతలు లేవు. ప్రతిపక్షాలను అన్యాయంగా హింస పెట్టేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేదు. అభివృద్ధి లేదు రాసిచ్చిన పాఠం అప్పజెప్పినట్లు పవన్ ఏకరవు పెట్టేసరికి.. ‘ఏం జరుగుతోందో మాకు తెలుసు’ అని ప్రధాని వ్యాఖ్యానించారట.
మెచ్చుకుంది కేంద్రమే
పలు రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. వాటికి సంబందించి కేంద్ర ప్రభుత్య మంత్రిత్వ శాఖలే పదే పదే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశంసించాయి. ఏపీ దూసుకుపోతోందన్న అంశంపై క్లారిటీ ఉండడంతోనే ప్రధాని నరేంద్రమోదీ... పవన్ ఫిర్యాదుల చిట్టా ఆరంభించగానే తెలుసు తెలుసు. అని అన్నారట.
రాజకీయం కోసం దేవుడితో ఆటలా?
జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో దేవతా విగ్రహాలను ధ్వంసం చేయిస్తున్నారంటూ చంద్రబాబు సృష్టించిన విషనాటకం తెలిసిందే. దానికి అప్పట్లో జనసేన కూడా వత్తాసు పలికింది. పోలీసుల దర్యాప్తులోనూ విగ్రహాలు విధ్వంస ఘటనల్లో నిందితులంతా టీడీపీ, జనసేన కార్యకర్తలేనని తేలింది. అయితే అప్పుడెప్పుడో ఏపీలో జరిగిన ఘటనల గురించి మోదీకి తెలీదనుకున్నారో ఏమో కానీ పవన్ కళ్యాణ్ విగ్రహాలకు కూడా రక్షణ లేకుండా చేస్తున్నారు సార్ అని చాడీలు చెప్పారు. దానికి కూడా మోదీ చిన్నగా నవ్వేసి అక్కడేం జరిగిందో మాకు తెలుసన్నట్లు చూశారట.
ఇప్పటంపై విప్పేసుకున్న పవనాలు
మోదీ తాను చెప్పేది ఏదీ నమ్మడం లేదని తేలడంతో ఉక్రోషం పడిపోయిన పవన్ కళ్యాణ్.. తాజాగా ఇప్పటం గ్రామంలో ఆడిన డ్రామాని తెరపైకి తెచ్చి దుర్మార్గంగా ఇళ్లను కూల్చేశారు సార్ అని ఫిర్యాదు చేశారట. దానికి మోదీ ఇక్కడ కూడా ఏం జరుగుతోందో తెలుసని, ఎవరెవరు కలిసి ఏం చేస్తున్నారో నాకు తెలుసు అని కాస్త సీరియస్ గానే అన్నారట. ఐ నో ఇట్ ఆల్సో అని టాపిక్‌ని అక్కడితో తెగ్గొట్టేసరికి పవన్ కళ్యాణ్ నోట మాట లేకుండా పోయిందని సమాచారం.
ఇదేం చీకటి బేరం.?
పవన్ ఒక్కరితోనే భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ... ఊరికే టీడీపీతో అంటకాగడం అంత మంచిది కాదన్న అర్ధం వచ్చేలా క్లాస్ పీకారని తెలిసింది. తాను అనుకున్నది ఒక్కటి కూడా వర్కవుట్ కాకపోయేసరికి పవన్ కళ్యాణ్ తీవ్ర నిరాశకు గురయ్యారని తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్.. ఎలాంటి ఉత్సాహం లేకుండా మీడియాతో మాట్లాడారు. ఇక్కడేం జరుగుతోందో ఆయనకు చెప్పాను. ఏపీలో ఏం జరుగుతోందో నాకు తెలుసునని ఆయన అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సార్లు కలుద్దాం అని ప్రధాని అన్నారు అని చెప్పేసి పవన్ వెళ్లిపోయారు.
ఇదీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ గేమ్ ప్లాన్
టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తేలేదని బీజేపీ నేతలు పదే పదే స్పష్టం చేస్తుండడంతో దింపుడు కళ్లెం ఆశగా చంద్రబాబు నాయుడు బీజేపీలో తాను చేర్చిన టీడీపీ ఎంపీలను పావులుగా చేసుకున్నారు. అయితే అవి వర్కవుట్ కాకపోవడంతో చివరి ప్రయత్నంగా పవన్ కళ్యాణ్‌ను మోదీ దగ్గరకు పంపి టీడీపీని కలుపుకుపోయేలా ప్రయత్నించమన్నారట.
అది ఘోరంగా బెడిసికొట్టేసింది. దీంతో 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు తీవ్ర ప్రస్టేషన్ కు గురైనట్లు తెలుస్తోంది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని అంశాలోన్నూ పారదర్శకంగా ఉండడమే కాకుండా దాపరికం లేకుండా ప్రతీ దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తుంది. ఈ విషయంపై అవగాహన లేకనే బాబు అండ్ వపన్ చీకట్లో రాయి విసిరి దెబ్బతిన్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment