సాక్షి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో పొలిటికల్ లీడర్ల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటరిచ్చారు. కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం అనే పదం వాడే హక్కులేదన్నారు. మీరా డబ్బుల కట్టల గురించి మాట్లాడేది అంటూ కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు.
కాగా, మాజీ ఎంపీ పొంగులేటీ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘పాలేరు సభలో సీఎం కేసీఆర్ అనేక అవాకులు, చవాకులు పేలారు. నా పేరు ప్రస్తావించకుండా నన్ను దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. ప్రజాస్వామ్యం, నోట్ల కట్టల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడటం విడ్డురంగా ఉంది. మీ పక్కన కూర్చున్నోళ్లు ఏ పార్టీ నుండి గెలిచారు.. ఎంత ప్యాకేజీ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలు నవ్వు కునేలా చేసింది ఎవరు?. ప్రజాస్వామ్యం అనే పదం వాడే హక్కు మీకు ఉందా?. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర, జాతీయ రాజకీయలలో డబ్బు మదంతో అహాంకారంతో మాట్లాడేది ఎవరు?. కాంట్రాక్ట్‌లు చేసి, పైరవీలు చేసి నేను డబ్బు సంపాదించానని మాట్లాడారు. మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. తడి బట్టలతో వస్తాను.. ఏ గుడికి ఎప్పుడు వస్తారో రండి నేను కూడా వస్తాను.
కేసీఆర్ నీ ఆస్తుల సంగతేంటి?
హుజురాబాద్‌లో ఉప ఎన్నికల ఓటమి భయంతో దళితబంధు మొదలుపెట్టారు. దళితబంధు తెచ్చినా ఓట్లు పడలేదు. సత్తుపల్లి, పాలేరు సభలో దళితబంధు పథకం అమలు చేస్తారా?. రాష్ట్రంలో ఎక్కడా దళితులు లేరా?. అక్రమంగా సంపాదించిన డబ్బు, నోట్ల కట్టలతో ఎన్నికలకు వస్తున్నారు. కేసీఆర్.. మీరు అన్ని వేల కోట్ల డబ్బు ఎలా సంపాదించారు. ధనిక రాష్ట్రాన్ని దోచుకుని దేశంలో రాజకీయాలు చేస్తున్నారు. మేడిగడ్డ అసలు రూపం బయటపడింది. కాళేశ్వరం బీఆర్‌ఎస్‌కు ఏటీఎం లాంటిది. మేడిగడ్డతో మీ అసలు రూపం బయటపడింది.
మీ పార్టీలోకి వచ్చిన తరువాత నేను ఎలాంటి పదవులు అనభవించలేదు. ఆ రోజు నీ కోడుకు, అల్లుడు, నీ తొత్తులు వచ్చి వందల సార్లు అడిగితేనే మీ పార్టీలోకి వచ్చాను. నిన్న సభలో తుమ్మల పేరు చెప్పారు.. పొంగులేటి పేరును ఉచ్చరించి ఉంటే అదే సభలో మీకు తెలిసేది. నవంబర్ 30న జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్‌కు ప్రజలు ఓటు వేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుంది.
ఇది కూడా చదవండి: రేవంత్‌కు కొత్త టెన్షన్.. 19 స్థానాల్లో ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment