
ఢిల్లీ: మొదటి విడత 'భారత్ జోడో యాత్ర'కు అశేష ఆధరణ లభించడంతో కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ మరోసారి యాత్రకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 నుంచి ఈ మేరకు యాత్ర ప్రారంభం కానుంది.
లద్దాఖ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మరోసారి దేశం మొత్తం యాత్ర చేయడానికి పూనుకున్నారు. కాంగ్రెస్‌ను ప్రజల వద్దకు తీసుకుపోవడానికి, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి మరోసారి నడుం బిగించారు.
మొదటిసారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర కొనసాగించారు రాహుల్. రెండోసారి భారత్ జోడో యాత్రలో గుజరాత్ నుంచి మేఘాలయా వరకు పర్యటించనున్నారని సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment