
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నా, పరిస్థితి మెరుగ్గానే ఉందని కేంద్రం అనడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 67 వేల కేసులు నమోదు కావడంపై ఆయన స్పందిస్తూ.. కరోనా వ్యాప్తి గ్రాఫ్ నిలకడ కావడానికి బదులు భయపెడుతోంది (ఫ్రైటెనింగ్ నాట్ ఫ్లాటెనింగ్)అని వ్యాఖ్యానించారు. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా నిలకడగా ఉందంటూ కేంద్రం చెబుతుండటంపై ట్విట్టర్‌లో ఆయన..‘ప్రధాని చెబుతున్న విధంగా ఇది నిలకడగా ఉన్న పరిస్థితే అయితే, దిగజారుతున్న పరిస్థితి అని ఎప్పుడనొచ్చు?’అంటూ ఎద్దేవా చేశారు. (తప్పులను క్షమించి ముందుకు సాగుదాం..)
Comments
Please login to add a commentAdd a comment