
ముంబై: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లోకి ఎమ్మెల్యేల వలసల పర్వం కొనసాగుతుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యానించారు. యూపీలో మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరతారన్నారు. యూపీ మంత్రి మౌర్య ఎస్పీలోకి వస్తున్నారనే వార్తల నేపథ్యంలో పవార్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎస్పీతో కలసి బరిలోకి దిగుతామని పవార్ ప్రకటించారు. ‘80 శాతానికి, 20 శాతానికి మధ్య యుద్ధం’ అంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలను పవార్ తప్పుబట్టారు.
యూపీ రాష్ట్రంలోని హిందూ, ముస్లిం జనాభా నిష్పత్తిని పోల్చి చూపుతూ యోగి ఇలా మతవిద్వేషం రెచ్చగొట్టే రీతిలో మాట్లాడారని వార్తలొచ్చిన నేపథ్యంలో పవార్ స్పందించారు. గోవాలో భావ సారుప్యత ఉన్న పార్టీలతో కలసి బరిలోకి దిగుతామని,కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లతో చర్చలు కొనసాగుతున్నట్లు పవార్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment