ఉదయ్‌పూర్: మైనార్టీలను బీజేపీ క్రూరంగా అణిచివేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఉదయ్‌పూర్(రాజస్థాన్) వేదికగా కాంగ్రెస్ చింతన్ శిబిర్ ప్రారంభోపన్యాసంతో ఆమె ప్రారంభించారు.
దేశ ప్రజల్ని బీజేపీ భయాందోళనకు గురి చేస్తోంది. గాంధీజీ హంతకులను ఆరాధిస్తున్నారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ప్రతిపక్షాలను కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. మైనార్టీలను బీజేపీ క్రూరంగా అణిచివేస్తోంది. మినిమం గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ అని చెప్పారు. దాని అర్థం దేశాన్ని నిట్టనిలువునా చీల్చడమేనా? అని ఆమె ప్రశ్నించారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దాని అనుబంధ సంస్థల విధానాల ఫలితంగా దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను చర్చించుకోవడానికి 'నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్' ఒక అవకాశం కల్పిస్తుందని పార్టీ నేతలను ఉద్దేశించి సోనియా గాంధీ అన్నారు.
నిరంతరం భయపెట్టడం, అభద్రతతో దేశ ప్రజలను బతికేలా చేయడం, మన సమాజంలో అంతర్భాగమైన , మన గణతంత్ర సమాన పౌరులైన మైనార్టీలను బలిపశువులను లక్ష్యంగా చేసుకుని క్రూరంగా హింసించడం చేస్తోందంటూ బీజేపీపై సోనియా చింతన్ శిబిర్ వేదికగా మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment