
సీఎం రమేష్ లాంగ్ జర్నీ
మొత్తానికి తెలుగుదేశం... జనసేన.. బీజేపీ మధ్య పొత్తుకుదిరింది.. ఇప్పుడు సీట్ల పంపిణీ జరగాలి... ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నది తేలాలి.. ఎవరు తేల్చాలి.. ఇంకెవరు.. చంద్రబాబే తేల్చాలి... జనసేనకు ఏమేం ఇవ్వాలి.. ఎక్కడెక్కడ ఇవ్వాలన్నది ఆయనే తెలుస్తారు.. ఈక్రమంలో అనకాపల్లి ఎంపీ సీటు కూడా బీజేపీకి ఇస్తున్నారని అంటున్నారు. అంటే అక్కడ మొన్నటివరకు నాగబాబు పోటీ చేస్తారని అన్నారు.. కొన్నాళ్ళు అక్కడ ఇల్లు అద్దెకుతీసుకుని సైతం ఆ ప్రాంతంలో పర్యటించారు కానీ గెలుపుమీద నమ్మకం లేక రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేసారు.
దీంతో అక్కడ పోటీ చేసేందుకు బీజేపీ తరఫున సీఎం రమేష్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో రాజ్యసభ సభ్యుడు అయిన రమేష్.. 2019 లో టీడీపీ ఓడిపోగానే చంద్రబాబు సలహామేరకు బీజేపీలో చేరారు.. ఇప్పుడు అయన ఏకంగా అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కడప వాసి అయిన రమేష్ ఏకంగా రాష్ట్రానికి ఈ చివర ఉన్న అనకాపల్లి వచ్చి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతోబాటు
ఏలూరు - పురందేశ్వరి
అనకాపల్లి - సీఎం రమేష్
రాజమండ్రి - సుజనాచౌదరి
హిందూపురం - వి.సత్యకుమార్
రాజంపేట - కిరణ్ కుమార్ రెడ్డి
అరకు - కొత్తపల్లి గీత సైతం బీజేపీ నుంచి ఎంపీ టిక్కెట్స్ ఆశిస్తున్నారు
ఇదిలా ఉండగా బీజేపీ రాజ్యసభసభ్యుడు జివిఎల్ నరసింహారావు కొన్నాళ్లుగా విశాఖలో మకాం వేసి ఉన్నారు.. అయన కూడా విశాఖ లోక్ సభ టిక్కెట్ ఆశిస్తున్నారు. అలా ఇస్తే మొత్తం విశాఖ... అనకాపల్లి.. అల్లూరి జిల్లాల్లోని మూడు ఎంపీ టికెట్స్ కూడా బీజేపీకి ఇచ్చినట్లు అవుతుంది.. మరి తెలుగుదేశం నుంచి గతంలో ఓడిపోయినా గీతం చైర్మన్ , బాలకృష్ణ అల్లుడు శ్రీ భారత్ కూడా విశాఖ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు కదా...మరి ఆయన్ను ఎలా బుజ్జగిస్తారు. అది చూడాలి... ప్రస్తుతానికి మూడు ఎంపీలదగ్గర మొదలైన జనసేన టీడీపీ పొత్తు రెండు స్థానాలకు దిగింది.. ఇప్పుడేమో ఒకదానిలో పవన్ పోటీ చేస్తే ఇంకొక్క ఎంపీ మాత్రమే మిగిలింది.. అది ఎవరికీ ఇస్తారో చూడాలి.. పవన్ కళ్యాణ్ పరిస్థితి పంచపాండవులు మంచం కోళ్లలా ముగ్గురు అన్నట్లుగా రోజురోజుకూ దిగజారిపోతూ పాతాళానికి చేరింది.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment