Live: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌.. Click & Refresh | TDP Chandrababu Naidu In Rajahmundry Jail, Skill Development Case Live Updates And Latest News - Sakshi
Sakshi News home page

Live: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌.. Click & Refresh

Published Sat, Sep 16 2023 7:46 AM | Last Updated on Sat, Sep 16 2023 9:37 PM

TDP Chandrababu In Rajahmundry Jail Live Updates - Sakshi

Updates..

9:21PM, సెప్టెంబర్‌ 16, 2023
వచ్చే ఎన్నికల్లో క్రియాశీలకంగా జనసేన: పవన్ కల్యాణ్ 
జనసేన అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజునుంచి ఆంధ్రప్రదేశ్ దశదిశ మారుతుంది
మన వాళ్లు ఎవరూ పగటి కలలు కనొద్దు
ఆ తర్వాత రాజు ఎవరు, మంత్రి ఎవరు చర్చిద్దాం

టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్
పార్టీల పొత్తు సమయంలో చిన్నచిన్న మాటలు వస్తాయి... పట్టించుకోవద్దు
బాలకృష్ణ, లోకేష్ మధ్య నేను ఉన్నా... ముగ్గురం సమానమే
2009 నుంచి అనుకుంటున్న స్థానం 2024లో సాధిద్దాం
తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుంది
ఎన్ని స్థానాలో త్వరలో చెబుతాం

05:00 PM, సెప్టెంబర్‌ 16, 2023
ఢిల్లీ: నేషనల్‌ మీడియాతో లోకేష్‌ ఇంటర్వ్యూలు
చంద్రబాబు కేసుకు సంబంధించి మాట్లాడిన ముఖ్యాంశాలు

లోకేష్‌ : ఎలాంటి తప్పు చేయకున్నా చంద్రబాబును లోపల పెట్టారు
నేషనల్‌ మీడియా : మరి కోర్టులో మీరు వెంటనే బెయిల్‌ పిటిషన్‌ ఎందుకు దాఖలు చేయలేదు?
లోకేష్‌ : అసలు చంద్రబాబుకు రిమాండ్‌ విధించడం తప్పు, ఆయనపై 17A సెక్షన్‌ పెట్టారు. అంటే చంద్రబాబును జైల్లో పెట్టాలంటే గవర్నర్‌ అనుమతి తప్పనిసరి.

నేషనల్‌ మీడియా : మేం తప్పు చేయలేదు, బెయిల్‌ ఇవ్వాలని అడగొచ్చు కదా
లోకేష్‌ : అసలు రిమాండే తప్పయినప్పుడు బెయిల్‌ అన్న ప్రశ్నే లేదు

నేషనల్‌ మీడియా : చాలా చోట్ల చంద్రబాబు సంతకాలు పెట్టారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి, కావాల్సినన్ని సాక్ష్యాలున్నాయి
లోకేష్‌ : సంతకాలు కాదు ముఖ్యం, చంద్రబాబు ఖాతాలోకి డబ్బులు వచ్చాయా? ఆరు రాష్ట్రాల్లో ఇదే ప్రాజెక్టు అమలయింది. అధికారుల పేర్లు ఎందుకు FIRలో లేవు?

నేషనల్‌ మీడియా : అసలు స్కాం జరగలేదని అంటున్నారా? లేక స్కాం జరిగింది కానీ చంద్రబాబు పాత్ర లేదంటున్నారా?
లోకేష్‌ : ఈ కేసును రెండేళ్ల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ED కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తోంది. అన్ని ఖాతాలు యాక్టివ్‌గానే ఉన్నాయి. వేగంగా ఫైళ్లు క్లియర్‌ చేస్తే నేరమంటారా?

నేషనల్‌ మీడియా : వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు చూడవచ్చు?
లోకేష్‌ : తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. 2024 ఎన్నికలను కలిసి ఎదుర్కోవాలని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పొత్తు ఉంటుంది.

నేషనల్‌ మీడియా : మీరు ఎన్డీఏలో భాగస్వామ్యా?
లోకేష్‌ : మాతో పొత్తు పెట్టుకోవాలా లేదా అన్నది తేల్చుకోవాల్సింది బీజేపీనే. కానీ టిడిపి, జనసేన కలిసి ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నది చంద్రబాబు నిర్ణయిస్తారు. అధికార పక్షం వైఎస్సార్‌సిపిని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా మేం కలిసి ముందుకెళ్తాం.

04:30 PM, సెప్టెంబర్‌ 16, 2023
లీవ్‌పైనా రచ్చ చేస్తారా?: పోసాని కృష్ణమురళి
► రాజమండ్రి జైలర్‌పై ఎల్లోమీడియా తప్పుడు కథనాలు
► తన భార్య అనారోగ్యం వల్లే రాహుల్ లీవ్ పెట్టారు
► అందుకే వేరే అధికారికి ఆ బాధ్యతలు అప్పగించారు
► ఓ మహిళ చనిపోతే రామోజీ పిచ్చిరాతలు రాశారు
► ఎల్లో మీడియా ఎంత ఏడ్చినా ప్రజలు వైఎస్ జగన్ వెంటే ఉంటారు
► ఎన్టీఆర్‌పై చంద్రబాబు చెప్పులతో దాడి చేయించారు
► ఎన్టీఆర్ పదవిని చంద్రబాబు అక్రమంగా లాక్కున్నారు
► ఈ విషయాలు నారా భువనేశ్వరికి గుర్తులేవా?

04:00 PM, సెప్టెంబర్‌ 16, 2023
బాబుకు జైల్లో చప్పట్లే చప్పట్లు
► చంద్రబాబు జైలు జీవితంపై టీవీ5తో మాట్లాడిన కుటుంబ సభ్యులు
► చంద్రబాబు రోజూ ఉదయం స్నేహా బ్లాక్‌ బయట మార్నింగ్‌ వాక్‌ చేస్తున్నారు..
► మార్నింగ్‌ వాక్‌లో జైల్లో ఉన్న ఇతర ఖైదీలను చంద్రబాబు కలుస్తున్నారు
► చంద్రబాబును చూడగానే జైల్లో ఉన్న ఖైదీలు చప్పట్లు కొడుతున్నారు
► చంద్రబాబుకు మార్నింగ్‌ వాక్‌లో చప్పట్లతో స్వాగతం పలుకుతున్నారు
► లోపలి పరిస్థితిని కళ్లకు కట్టినట్టు బాబు కుటుంబ సభ్యులు వెల్లడించారన్న టీవీ5

03:00 PM, సెప్టెంబర్‌ 16, 2023
బాబు అరెస్ట్‌ను ఖండించండి ప్లీజ్ : గంటా
► చంద్రబాబు అరెస్టయినా పెద్దగా స్పందన రాకపోవడంపై మల్లగుల్లాలు
► చంద్రబాబుకు మద్ధతుపై మాట్లాడిన గంటా శ్రీనివాసరావు
► చంద్రబాబు మిత్రుడు రజనీకాంత్ తమిళనాడు నుంచి సంఘీభావం ప్రకటించారు
► చంద్రబాబును అరెస్ట్‌ చేస్తే టాలీవుడ్‌ వాళ్లు మాట్లాడరా?
► జూనియర్‌ ఎన్టీఆర్ స్పందించకపోవడం ఆయన వ్యక్తిగతం
► చంద్రబాబుకు ఏం జరిగినా అందరూ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు : గంటా

2:40 PM, సెప్టెంబర్‌ 16, 2023
కింకర్తవ్యం ? : లోకేష్‌ @ ఢిల్లీ
►మరికొద్దిసేపట్లో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం
►లోకేష్‌ నేతృత్వంలో ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో మీటింగ్
►ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటులో ఏం చేయాలి?
►చంద్రబాబు అరెస్ట్‌ మీద పార్లమెంటు సభలో మాట్లాడే అవకాశముందా?
►రెండు రోజులుగా ఢిల్లీలో ఉంటున్న నారా లోకేష్‌కు అపాయింట్‌మెంట్లేవి?
►అరెస్ట్‌పై జాతీయస్థాయిలో మద్దతు ఎందుకు రావడం లేదు?
►మరింత మంది సుప్రీంకోర్టు న్యాయవాదులను కలవాలని నిర్ణయం

12:00 PM, సెప్టెంబర్‌ 16, 2023
కొలికిపూడి శ్రీనివాస్‌పై సీరియస్‌
► బాబు ఏజెంట్‌ కొలికిపూడి శ్రీనివాస్‌పై లాయర్ల సీరియస్‌
► ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బార్‌ అసొసియేషన్‌ అధికారిక ప్రకటన
► అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై కొలికిపూడి ప్రేలాపనలు
► కొలికిపూడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హైకోర్టు బార్‌ అసొసియేషన్‌
► కొలికిపూడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డిజిపికి బార్‌ అసొసియేషన్‌ విజ్ఞప్తి
► కొలికిపూడి వ్యాఖ్యలు ప్రసారం చేసిన ఛానళ్లపైనా ఫిర్యాదు

11:00 AM, సెప్టెంబర్‌ 16, 2023
ఈడీ కొత్త ఇన్‌ఛార్జ్‌గా రాహుల్ నవీన్

► ఢిల్లీ : ప్రస్తుతం ఈడీ స్పెషల్ డైరెక్టర్‌గా రాహుల్
► పూర్తిస్థాయి డైరెక్టర్ నియామకం వరకు ఇన్‌ఛార్జ్‌గా రాహుల్
► నిన్నటితో ముగిసిన సంజీవ్ కుమార్ మిశ్రా పదవీ కాలం
► ఈడీ, సీబీఐ ఉమ్మడి కొత్త బాస్‌గా సంజీవ్‌ను నియమించే దిశగా కసరత్తు
► కొత్తగా చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పదవీ సృష్టించనున్న కేంద్రం
► అక్రమ నగదు లావాదేవీలపై ఇప్పటికే చంద్రబాబుకు ఈడీ, ఐటీ నోటీసులు

10:30 AM, సెప్టెంబర్‌ 16, 2023
చంద్రబాబు, ఇండియా కూటమి ఒక్కటే: ఎంపీ విజయసాయిరెడ్డి

►చంద్రబాబు ఇండియా కూటమి సభ్యుడని తేలిపోయింది. 
►ఇండియా కూటమి, చంద్రబాబు ఒకే ఆలోచనతో ఉన్నారు. 
►కూటమిలోని సభ్యులు లోకేశ్‌కు ఫోన్ చేసి సానుభూతి తెలుపుతున్నారు. 
►అధికారంలోకి రావాలి, రాష్ట్రాన్ని లూఠీ చేయాలన్నదే వారి వ్యూహం. 
►చంద్రబాబుకు ఒంటరిగా ఎన్నికలలో పోటీ చేసే ధైర్యం లేదు. 

9:00 AM, సెప్టెంబర్‌ 16, 2023
ఆరో రోజు చంద్రబాబు జైలు జీవితం
►చంద్రబాబును కలిసేందుకు భువనేశ్వరి పెట్టుకున్న ములాఖత్ తిరస్కరణ. 
►చంద్రబాబుకు జైల్లో పదిమంది నిపుణులైన వైద్య బృందంతో మెడికల్ టీం ఏర్పాటు. 
►అత్యవసర మందులతో సహా అన్ని వేళల సిద్ధంగా ఉండేలా అంబులెన్స్. 

8:30 AM, సెప్టెంబర్‌ 16, 2023
చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్‌కు మెమో..
►చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌కి మెమో జారీ. 
►అనుమతి లేకుండా విదేశాలకు పారిపోయిన శ్రీనివాస్
►స్కిల్ కుంభకోణం కేసులో సీఐడీ నోటీసులు ఇవ్వగానే అమెరికా పరారీ.
►వారం రోజుల్లో వచ్చి సంజాయిషీ ఇవ్వాలని ప్రణాళిక శాఖ మెమో జారీ. 
►స్కిల్‌ కుంభకోణం కేసులో కీలక వ్యక్తిగా సీఐడీ అనుమానం

8:15 AM, సెప్టెంబర్‌ 16, 2023
జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వైద్య బృందం
►మొత్తం 10 మందితో వైద్య బృందం ఏర్పాటు చేసిన వైద్యశాఖ. 
►ఐదుగురు వైద్యులు, ముగ్గురు సిబ్బంది, ఇద్దరు డ్రైవర్లతో బృందం ఏర్పాటు?
►రెండు యూనిట్ల ‘O’ పాజిటివ్ రక్తం నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశం?
►అత్యవసర మందులు నిత్యం అందుబాటులో ఉంచాలని వైద్యశాఖ ఆదేశం.

లోకేశ్‌కు పెద్ద సవాల్‌..
►మరో రెండు రోజులూ ఢిల్లీలోనే ఉండనున్న నారా లోకేష్
►ఇవ్వాళ అంతగా సక్సెస్‌ కాని అపాయింట్‌మెంట్లు
►చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు విశ్వ ప్రయత్నాలు
►పలువురు పార్టీల నేతలను కలవాలని ప్రయత్నాలు
►అపాయింట్‌మెంట్ల విషయంలో కలిసిరాని పరిచయాలు
►మొత్తం టిడిపి నేతలను, మద్ధతుదారులను ఉపయోగిస్తున్న లోకేష్‌
►నేడు సుప్రీంకోర్టు న్యాయవాదులతో సమావేశమయ్యే ఛాన్స్
►జైలు నుంచి తండ్రిని ఎలాగైనా బయటపడేయాలని చూస్తున్న లోకేష్‌కు ఇప్పుడు అది సవాల్‌.

బీజేపీ నుంచి స్పందన కరువు..
►నిన్నటి నుంచి బీజేపీ నేతల అపాయింట్‌మెంట్ల కోసం ప్రయత్నం
►బీజేపీ నుంచి రాని స్పందన, బీజేపీలో ఉన్న టీడీపీ నేతలతో లాబీయింగ్‌
►చంద్రబాబు కేసులపై పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చలు
►నిన్నంతా రఘురామ కృష్ణరాజుతో సుదీర్ఘ మంతనాలు
►నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్న లోకేష్.

నేడు జనసేన విస్తృతస్థాయి సమావేశం
► రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో ఏం మాట్లాడారు?
►జైలు బ్రీఫింగ్‌ను జనసేన కార్యవర్గానికి వివరించనున్న పవన్‌ కళ్యాణ్‌
►చంద్రబాబు సూచనలు, పొత్తు అంశాలపై సుదీర్ఘ ప్రజంటేషన్‌కు రెడీ
►పొత్తు వల్ల ఎక్కడెక్కడ రాజీ పడాలో వివరించనున్న పవన్‌ కళ్యాణ్‌
►మీరనుకున్నట్టు అందరికీ టికెట్లు ఇవ్వలేనని చెప్పనున్న పవన్‌
►పొత్తులో టీడీపీ ఎన్ని టికెట్లు ఇస్తే.. అక్కడ మాత్రమే జనసేన పోటీ

►ఏయే స్థానాలన్నది ఉమ్మడి కార్యాచరణలో నిర్ణయించుకోనున్న పార్టీలు
►30 స్థానాలకు జనసేన పరిమితం అని రాజకీయవర్గాల్లో ప్రచారం
►ఇప్పటివరకు ఆశలు పెట్టుకుని నియోజకవర్గాల్లో తిరిగిన కొందరు
►తాజా పొత్తు నిర్ణయంతో ఖర్చు పెట్టుకున్న వారికి తీవ్ర నిరాశ
►రేపు మధ్యాహ్నం మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశం
►టీడీపీతో కలిసి వెళ్లాల్సిందే, రాజీ పడదామని చెప్పనున్న పవన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement