సాక్షి, అల్లూరి: ఏపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త కష్టాలు మొదలవుతున్నాయి. కూటమిలో సీట్ల పంపిణీ కారణంగా టీడీపీలో సీట్లు దక్కని నేతలు రెబల్స్‌గా మారారు. ఈ నేపథ్యంలో వారంతా టీడీపీ ఓటమిని కోరుకుంటున్నాట్టు బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో, కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులకు టెన్షన్ స్టార్ట్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా, టీడీపీపై గిరిజన నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. చంద్రబాబు తీరుపై గిరిజన టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. పార్టీని నమ్ముకుంటే తమను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ దక్కని గిడ్ఢి ఈశ్వరి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఓడిస్తామన్నారు.
మరోవైపు.. చంద్రబాబు చేసిన మోసం ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నారు టీడీపీ నేత అబ్రహం. చంద్రబాబు నమ్మకద్రోహానికి పాల్పడ్డారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు మోసానికి కుటుంబంతో సహా చనిపోవాలనుకున్నామని దన్ను దొర చెప్పుకొచ్చారు. టీడీపీ పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తాను చేతులు కాల్చుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు లేదన్నారు మాజీ మంత్రి కుమారి కాంతమ్మ. ఇక, పార్టీ సభ్యత్వం లేని వారికి కూడా చంద్రబాబు సీట్లు ఇచ్చారని ఎంవీవీ ప్రసాద్ ఫైరయ్యారు. చంద్రబాబు, లోకేష్ నిర్ణయాలతో ఏజెన్సీలో పార్టీ తుడిచి పెట్టుకుపోయిందని గిరిజన నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment