Breadcrumb
తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
Published Fri, Nov 10 2023 7:06 AM | Last Updated on Thu, Nov 23 2023 11:39 AM
Live Updates
తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
బీజేపీ నేత లక్ష్మణ్ కామెంట్స్
- కాంగ్రెస్ బీసీ ఓట్ల కోసం అనేక పాట్లు పడుతోంది
- కాంగ్రెస్ డిక్లరేషన్ లో ఏమాత్రం పస లేదు
- కాంగ్రెస్ డిక్లరేషన్ కొత్త సీసాలో పాత సారా పోసినట్టుంది
- కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీని సీఎం చేస్తామని ఎందుకు అనట్లేదు ?
- కాంగ్రెస్‌లో సమర్థవంతమైన బీసీ నాయకులను కులం పేరు మీద పక్కన పెట్టారు
కోదాడ రోడ్ షోలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి కామెంట్స్
- కోదాడలో కాంగ్రెస్ సునామీ కనిపిస్తోంది.
- తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి.
- కర్ణాటక లో కాంగ్రెస్ ను గెలిపించి రాహుల్ కి బహుమతి ఇచ్చారు.
- తెలంగాణలో గెలిపించి సోనియాకు గిఫ్ట్ ఇవ్వాలి.
- నెహ్రూ, గాంధీ కుటుంబాలు దేశానికి సర్వం ధార పోశారు.
- వారికి సొంత ఇళ్లు కూడా లేదు
హైదరాబాద్‌కు జనరల్ అబ్జర్వర్లుగా 8 మంది ఐఏఎస్‌లు
- హైదరాబాద్ జిల్లాకు సాధారణ ఎన్నికల పరిశీలకులుగా 8 మంది ఐఏఎస్ అధికారులు
- ఇవ్వాల్టి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఫీల్డ్ లో ఉండనున్న అధికారులు
- ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ప్రచారం, ఎంసీసీ వయలేషన్స్ను పరిశీలించనున్న అధికారులు
హుజురాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు కామెంట్స్
- హుజురాబాద్ అభివృద్ధి చెందాలంటే కౌశిక్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వండి
- సర్వేలన్నీ హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డికి మొదటి స్థానం ఇస్తున్నాయి
- కేసీఆర్ కారు గుర్తుకు ఓటు వేయండి.. కౌశిక్ రెడ్డి ప్రజా జీవితంలో ఆల్ రౌండర్ గా పనిచేస్తాడు
- ముఖ్యమంత్రికి కౌశిక్ రెడ్డి అంటే ఇష్టం, అభివృద్ధి కోసం సహాయం అందిస్తారు
- మోసపోతే గోసపడతాం
ముసుగు తొలగించిన టీడీపీ
- కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారంలోకి దిగిన టీడీపీ
- కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి తరపున ప్రచారంలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు
- కాంగ్రెస్ జెండాలతో కలగలిసిన టీడీపీ జెండాలు
- నామినేషన్ల పర్వం ముగియగానే కాంగ్రెస్ ప్రచారానికి బహిరంగ మద్దతిచ్చిన టీడీపీ
ఖమ్మం రూరల్‌లో పొంగులేటి ప్రచారం
- ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కోదాడ రోడ్ షోలో డీకే శివకుమార్ కామెంట్స్
- ప్రియమైన అన్నా తమ్ముళ్లకు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన శివకుమార్
- తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది
- కోదాడలో పద్మావతి 25 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తుంది.
- నాగార్జున సాగర్ పరిధిలో ఉన్న రైతులను కలవడం సంతోషంగా ఉంది.
- అరవై ఏళ్ల క్రితం నిర్మించిన సాగర్ పటిష్టంగా ఉంది కానీ మూడేళ్ల క్రితం నిర్మించిన కాళేశ్వరం కూలిపోతోంది.
- పదేళ్లపాటు కేసీఆర్ సెక్రటేరియట్‌కు రాలేదు.
- శాశ్వతంగా కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పంపిద్దాం.
- ఇన్నేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఒక్క మాటను నిలబెట్టుకోలేదు.
- డిసెంబరు 9న సోనియా పుట్టిన రోజు గిఫ్ట్‌గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరుద్దాం.
- తుక్కుగూడలో ప్రకటించిన విధంగా రైతులకు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తాం.
- భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేలు ఇస్తాం.
- వరి పండించే రైతులకు క్వింటాల్‌కి ఐదు వందలు బోనస్ ఇస్తాం
కోదాడ రోడ్ షోలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి కామెంట్స్
- టీడీపీ తమ్ముళ్లకు స్వాగతం
- కోదాడలో కాంగ్రెస్‌కు యాభై వేల మెజార్టీ ఖాయం
గులాబీ కండువా కప్పుకున్న సంభాని, మానవతారాయ్
- బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్
- పీసీసీ అధ్యక్షునికి అత్యంత సన్నిహితుడు, విద్యార్థినేతగా పేరున్న కోటూరి మానవతారాయ్
- వీరికి గులాబీ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్
- టీపీసీసి ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి కృష్ణ, సీనియర్ రాజకీయ నేత వూకె అబ్బయ్య దంపతులు, రామచంద్రు నాయక్ బీఆర్ఎస్లో చేరారు
కోదాడలో డీకే శివకుమార్ ప్రచారం
- కోదాడకు చేరుకున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
- స్వాగతం పలికిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి
- రంగా సర్కిల్ వరకు సాగే రోడ్ షో లో పాల్గొననున్న శివకుమార్
- డీకే వెంట ప్రచారంలో పాల్గొననున్న మాజీ మంత్రి రఘువీరారెడ్డి
కాంగ్రెస్ సీఎం అభ్యర్థి పై సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
- ఎవరికి వారే సీఎం క్యాండేట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని ఫైర్
- సీఎం అభ్యర్థిగా ప్రచారాలు మానుకోవాలని నేతలకు చురకలు
- సీఎంను సోనియా, రాహుల్ గాంధీ నిర్ణయిస్తారన్న వీహెచ్
భారీగా నామినేషన్లు
- తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 900 నామినేషన్లు ఫైల్
- నిన్నటి వరకు దాఖలైన నామినేషన్లు 2,478
- మొత్తం నామినేషన్లు 3వేల 300
- అత్యధికంగా గజ్వేల్ నుంచి 110 నామినేషన్లు
- నిన్న ఒక్కరోజే గజ్వేల్ లో 43 నామినేషన్లు- కామారెడ్డి లో 80 నామినేషన్లు
నామినేషన్ వేసిన నవ్య
- స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా జానకిపురం సర్పంచి కుర్చపెల్లి నవ్య నామినేషన్
- స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై గతంలో వేధింపుల ఆరోపణలు చేసిన నవ్య
సంగారెడ్డిలో కిషన్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
- సంగారెడ్డి పట్టణ కేంద్రంలో కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ దిష్టిబొమ్మలు దహనం చేసిన రాజేశ్వర్ రావు దేశ్ పాండే అభిమానులు
- సంగారెడ్డి టికెట్ రాజేశ్వర్‌రావుకు ఇచ్చి చివరి నిమిషంలో బీఫామ్ వేరొకరికి ఇచ్చిన పార్టీ
వర్ధన్నపేట ఎన్నికల ప్రచారంలో అపశృతి
- నల్లబెల్లి గ్రామ పంచాయతీ కూడలిలో ఒక్కసారిగా కుప్పకూలిన గణేష్ మండపం
- బీఆర్ఎస్ తరపున ప్రచారంలో పాల్గొన్న 10 మంది మహిళలకు తీవ్ర గాయాలు
- గాయాలైన వారికి గ్రామంలోనే ప్రథమ చికిత్స
- క్షతగాత్రులకు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పరామర్శ
వేములవాడలో చెన్నమనేని వికాస్ రావు ప్రెస్‌మీట్
- బీజేపీ నాకు పోటీ చేసేందుకు బీఫామ్ ఇచ్చింది
- బీజేపీ కార్యకర్తలు శాంతియుతంగా పోరాటం చేసి టికెట్ మార్పు చేయించారు
- బీజేపీ కార్యకర్తల రుణం తీర్చుకుంటాను
- పేరులో ముందుంది, అభివృద్ధిలో మాత్రం వేములవాడ వెనుక ఉంది
- రాజన్న గుడిని కేటీఆర్ దత్తత తీసుకోలేడు
- నా కోసం కొట్లాడింది బీసీ, ఎస్సీ బిడ్డలే వారికి అండగా ఉంటాను
- తుల ఉమ నాకు అక్క లాంటిది
- వేములవాడలో కాంగ్రెస్‌తోనే మాకు పోటీ
కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్‌పై కేటీఆర్ ఫైర్
- కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ బీజేపీ కుట్రలా కనిపిస్తోంది
- మైనారిటీలను బీసీల్లో ఎలా కలుపుతారు
- మైనారిటీలు మత పప్రాతిపదికన గుర్తిస్తారు
- మైనారిటీలను బీసీలలో కలిపితే వారి హక్కులు పోతాయి
- కాంగ్రెస్ వెంటనే తన మైనార్టీ డిక్లరేషన్‌ను ఉపసంహరించుకోవాలి
మోసపోతే గోసపడతాం: మంత్రి హరీష్ రావు
►ఎవరు ఎన్ని గిమ్మిక్కులు చేసినా మూడోసారి బీఆర్ఎస్దే అధికారం.
►అధికారంలోకి వస్తే రూ. 5 వేలు పెన్షన్ ఇస్తాం
►మాట ఇవ్వకపోయినా రైతు బంధు పథకాన్ని కేసీఆర్ తెచ్చారు.
►సౌభాగ్యలక్ష్మి పేరుతో మహిళలకు రూ. 3వేలు.
►ఇసారి గెలిస్తే సన్నబియ్యం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.
►రాష్ట్రంలో కోటి కుటుంబాలకు ఆరోగ్య బీమా
కేసీఆర్ ఫాంహౌజ్‌లో రెస్ట్ తీసుకోవాల్సిందే: డీకే
►కోదాడ, హుజూర్‌నగర్‌లో డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారం
►కాసేపట్లో రోడ్డుమార్గాన కోదాడకు డీకే
►కేసీఆర్ ఫాంహౌజ్‌లో రెస్ట్ తీసుకోవాల్సిందే: డీకే
►నా పేరుతో నకిలీ లెటర్ సృష్టించారు.
►కర్ణాటకలో ఫేక్ లెటర్‌పై ఫిర్యాదు చేశాం.
►తెలంగాణకు మేం డబ్బులు పంపిస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారు.
►మేం డబ్బులు పంపిస్తే బీఆర్ఎస్ నిద్ర పోతుందా?
►మూడు అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేస్తా.
►తెలంగాణ మొత్తం మార్పు కోసం చూస్తోంది.
►సోనియాకు కృతజ్ఙత చెప్పాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు.
బీసీ డిక్లరేషన్ ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్
►జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు పెంచుతాం: మహేష్ కుమార్ గౌడ్
►స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 23 నుంచి 42 శాతానికి పెంచుతాం.
►అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం.
►ప్రతి జిల్లాలో బీసీ భవన్ ఏర్పాటు చేస్తాం.
►ప్రతి మండలానికి ఓ బీసీ గురుకులం ఏర్పాటు.
►బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తాం.
►బీసీ-డీలో ఉన్న ముదిరాజ్ కులస్తులను బీసీ-ఏలో చేరుస్తాం.
►బీసీ కార్పోరేషన్ ద్వారా ఒక్కొక్కరికి రూ. 10 లక్షల లోన్.
►జనగామ జిల్లాను సర్వాయిపాపన్న జిల్లాగా మారుస్తాం.
►ఐదేళ్లలో అభివృద్ధికి లక్ష కోట్ల ఖర్చు
►రాష్ట్రంలో మూడుచోట్ల మెగా పవర్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం.
►నేతకార్మికులకు 50 ఏళ్లు దాటితే పెన్షన్.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది
►కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
►రేవంత్ రెడ్డి రెండు నియోజకవర్గాల్లో కేసీఆర్‌ను ఓడిస్తారు.
►తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన సిద్ధరామయ్య
►తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారు.
►అవినీతి డబ్బుతో అధికారంలోకి రావాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.
►ఈనెల 30వ తేదీ కోసం ప్రజలు ఎదురుస్తున్నారు.
►తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.
►తెలంగాణలో బీజేపీ పనైపోయింది. నాలుగైదు సీట్లు గెలిస్తే ఎక్కువ
ఐదు చోట్ల అభ్యర్థులను మార్చిన బీజేపీ
►చాంద్రాయణగుట్ట, వనపర్తి, వేముల వాడ, సంగా రెడ్డి, అలంపూర్
చాంద్రాయణగుట్ట అభ్యర్థి సత్యనారాయణ అనారోగ్యంతో తప్పుకోవడంతో మహేందర్‌కు ఛాన్స్
►వనపర్తి అశ్వథామ రెడ్డి తప్పుకోవడంతో అనుఘ్నా రెడ్డికి ఛాన్స్
►అలాంపూర్ అభ్యర్థిగా మేరీయమ్మను మార్చి రాజగోపాల్‌కు అవకాశం.
►వేములవాడ అభ్యర్థి తుల ఉమాకు చివరి క్షణంలో బీ-ఫామ్ ఇవ్వని బీజేపీ
►వేములవాడలో వికాస్ రావుకు దక్కిన అవకాశం
►సంగారెడ్డి అసెంబ్లీకి మొదట రాజేశ్వర్ రావు పేరు..తర్వాత బీ- ఫామ్ పులిమామిడి రాజుకు ఇచ్చిన బీజేపీ
పటాన్చెరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
►కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల నేతల హోరాహోరీ నినాదాలు.
► కాంగ్రెస్ నుంచి కాట శ్రీనివాస్ గౌడ్, బీఎస్పీ నుంచి నీలం మధు ముదిరాజ్, నామినేషన్
►భారీ ర్యాలీతో నామినేషన్ కేంద్రానికి చేరిన వేలాది మంది కార్యకర్తలు.
►మీసం తిప్పి తొడగొట్టిన బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్.
►పోలీసులు ఇరు వర్గాలను ఎంత సముదాయించిన వినిపించుకోకుండా హోరాహోరీ నినాదాలు.
ప్రారంభమైన కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభ
- కామారెడ్డిలో ప్రారంభమైన కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభ
- హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో ఉద్రిక్తత
- కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ నామినేషన్ సందర్భంగా రగడ
- ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధి దాటి చొచ్చుకు వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తల విఫలయత్నం .
- పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట, కార్యకర్తలనుఅడ్డుకునే ప్రయత్నంలో స్వల్ప లాఠీఛార్జ్ చేసిన పోలీసులు
ఏఐఎఫ్బీ నుంచి జలగం వెంకట్రావు నామినేషన్
- ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ నుంచి పోటీచేస్తున్నా
- కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు నామినేషన్ వేశాను
- రానున్న రోజుల్లో వింత వింత ప్రచారాలు జరగబోతున్నాయి
- ఎవరెవరు ఏ పనులు చేశారో ప్రజలు గమనించాలి
- మారుమూల ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాల ప్రజలందరికీ నేను చేసిన అభివృద్ధి ఏంటో తెలుసు
హన్మకొండలో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ ప్రెస్ మీట్
- కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి పార్టీలు
- కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పు 5 లక్షల కోట్లకు చేరింది
- బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత ఫెయిల్యూర్ ఇంజనీర్ వర్క్
- కేసీఆర్ ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల అవినీతి చేశాడు
- తెలంగాణ అవినీతి ఢిల్లీకి చేరింది
- కేసీఆర్ కూతురు కచ్చితంగా జైలుకు వెళుతుంది
- ఇప్పటికే మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారు.
- కాంగ్రెస్ పాలనలో అవినీతి తప్ప ఏమి ఉండదు
- కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
ముగిసిన నామినేషన్ల స్వీకరణ గడువు
- తెలంగాణలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
- ఈ నెల 3వ తేదీ నుంచి మొదలైన నామినేషన్ల స్వీకరణ
- నిన్నటి వరకు మొత్తం 2474 నామినేషన్లు దాఖలు కాగా ఇవాళ చివరి తేదీ కావడంతో మరో వెయ్యికి పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయని అంచనా
- నామినేషన్ల గడువు ముగిసే సమయానికి బీఫామ్ ఇవ్వని అభ్యర్థులు ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులే
కన్నీరు పెట్టుకున్న తుల ఉమ
- వేములవాడ బీజేపీ బీఫామ్ హైడ్రామాతో తుల ఉమ కన్నీటి పర్యంతమయ్యారు
- పార్టీలో బీసీలకు, మహిళలకు ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు
- ఐదో జాబితాలో వేములవాడకు తుల ఉమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన బీజేపీ చివరి నిమిషంలో బీఫామ్‌ను చెన్నమనేని విద్యాసాగర్‌రావుకు ఇచ్చింది
చిల్లర నాణేలతో డిపాజిట్ చెల్లింపు
- కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి చిల్లర నాణేలతో డిపాజిట్ చెల్లించారు.
ధర్మపురి అర్వింద్ నామినేషన్
- కోరుట్ల బీజేపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్
- కొత్త బస్టాండ్ నుంచి నందీ చౌక్ వరకు భారీ ర్యాలీ పాల్గొన్న అరవింద్
బీజేపీ అభ్యర్థుల మార్పు
- వేములవాడ అసెంబ్లీ బీజేపీ టికెట్ దక్కించుకున్న మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు కొడుకు వికాస్ రావు
- ఈ సెగ్మెంట్లో తుల ఉమ పేరు ఇప్పటికే ప్రకటించిన బీజేపీ చివరి క్షణంలో బీ ఫామ్ వికాస్ రావుకు ఇచ్చింది
- సంగారెడ్డి బీఫామ్ పులిమామిడి రాజుకు ఇచ్చిన బీజేపీ
- ఐదో జాబితాలో సంగారెడ్డి అసెంబ్లీ బీజేపీ టికెట్ దేశ్ పాండే రాజేశ్వర్‌రావుకు ప్రకటించిన బీజేపీ
కోరుట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్
- కోరుట్లలో భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావ
మంత్రి సబిత నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ
- మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబిత నామినేషన్ ర్యాలీ
- కర్మాన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భారీ కాన్వాయ్‌తో బయలుదేరిన మంత్రి
- మహేశ్వరం ఆర్వో ఆఫీస్‌లో నామినేషన్ దాఖలు చేయనున్న మంత్రి
కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి నామినేషన్ ర్యాలీ ప్రారంభం
- కామారెడ్డిలో షబ్బీర్ అలీ నివాసం నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ ర్యాలీ ప్రారంభం
- ఆర్వో కార్యాలయం వరకు సాగనున్న ర్యాలీ
- నామినేషన్ అనంతరం బీసీ డిక్లరేషన్ సభకు చేరుకోనున్న రేవంత్ రెడ్డి
- సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న కర్ణాటక సీఎం సిద్దారామయ్య
దేవరకొండ బీజేపీ అభ్యర్థి నామినేషన్
- నల్లగొండ జిల్లా దేవరకొండ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన లాలూ నాయక్
- భారీ ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు
ఎవరెన్ని చేసినా మళ్లీ వచ్చేది కేసీఆరే: మంత్రి హరీష్
- మెదక్ జిల్లా :
- నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు
- హరీష్‌రావు కామెంట్స్
- ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మన కేసీఆర్, సంక్షేమ ఫలాలను నిలబెట్టారు.
- 11 సార్లు కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే ఏమీ చేయలేదు
- బీజేపీకి ఒకటే సీటు వచ్చింది.. ఈసారి డిపాజిట్లు కూడా రావు
- బీజేపీ డక్ అవుట్, కాంగ్రెస్ రనౌట్, కేసీఆర్ సెంచరీ
- కొడంగల్‌లో ఓడిపోతే రేవంత్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నాడు.
- కాంగ్రెస్ గెలవకపోతే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గడ్డం తీసుకోను అన్నాడు
- రైతుబంధును వేయకుండా ఈసీకి ఫిర్యాదు చేసి కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసింది.
- రైతుబంధును వేయకుండా ఈసీకి ఫిర్యాదు చేసి కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసింది.
- రేవంత్‌రెడ్డి రైతులను బిచ్చగాళ్లంటున్నడు
- కటికి చీకటి కాంగ్రెస్ పాలన కావాలా? 24 గంటలు కరెంట్ ఇస్తున్న కేసీఆర్ పాలన కావాలా?
- ఇంటింటికీ మంచినీళ్లు, పింఛన్లు, తండాలను గ్రామ పంచాయితీలు, రోడ్లను వేసిన కేసీఆర్ చేతిలో తెలంగాణ భద్రంగా ఉంటుంది
- బీజేపీలకు ఎందుకు ఓటెయ్యాలి? సిలిండర్ల ధరలు పెంచినందుకా? మోటార్ల కాడ మీటర్లు పెట్టి రైతుల చేతిలో బిల్లు పెట్టమన్నందుకా?
- 28 లక్షల మోటర్లు ఉన్న రైతులు కెసిఆర్ ను కాదని ఇతర పార్టీలకు ఓటు వేయరు.
- బీఆర్ఎస్ గెలిస్తే పింఛన్లు 5 వేలకు పెంచి, సన్న బియ్యం ఇస్తాం.
- బీఆర్ఎస్ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి, సునీతమ్మ గెలిస్తే నర్సాపూర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారు.
- కాంగ్రెస్ నుండి పోటీ చేసే అభ్యర్థి ఇప్పటివరకు సర్పంచి కూడా కాలేదు,
- రాష్ట్రంలో గెలిచే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఇతర పార్టీలు గెలిస్తే అభివృద్ధి జరగదు.
- ఎవరెన్ని చేసినా మళ్లీ వచ్చేది కేసీఆరే.
బీజేపీ నేత రాజేశ్వర్ రావు దేశ్ పాండే నిరసన
- సంగారెడ్డి:
- రిటర్నింగ్ కార్యాలయం ముందు బీజేపీ నేత రాజేశ్వర్ రావు దేశ్ పాండే నిరసన
- టికెట్ ఇచ్చినా బీ ఫామ్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన దేశ్ పాండే
- బీ ఫామ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు
బీజేపీ అభ్యర్థుల మార్పు...
- వికాస్‌రావుకు వేములవాడ అభ్యర్థిగా బీ ఫామ్ ఇచ్చిన బీజేపీ
- తుల ఉమ పేరు ఇప్పటికే ప్రకటించిన బీజేపీ
- చివరిక్షణంలో వేములవాడ బీ-ఫామ్ వికాస్‌రావు అందజేసిన బీజేపీ
- ఐదో జాబితాలో సంగారెడ్డి అసెంబ్లీ బీజేపీ టికెట్ దేశ్‌పాండే రాజేశ్వర్‌రావుకు ఇచ్చిన బీజేపీ
- ఆఖరి నిమిషంలో సంగారెడ్డిలో పులిమామిడి రాజుకు బీ-ఫామ్
బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు కర్ణాటక సీఎం
- బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కర్ణాటక సీఎం సిద్దరామయ్య...
- కామారెడ్డి లో నిర్వహించే టీ కాంగ్రెస్ సభకు హాజరై బీసీ డిక్లరేషన్ విడుదల చేయనున్న సిద్దరామయ్య..
తెలంగాణలో జనసేన పార్టీకి గుర్తును కేటాయించని ఈసీ
- తెలంగాణలో జనసేన పార్టీకి గుర్తును కేటాయించని ఈసీ
- జనసేన పార్టీ వాడుకునే గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్‌గా గుర్తించిన ఈసీఐ
- జనసేన తెలంగాణ గుర్తింపు పార్టీ కాకపోవడంతో గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయని ఎన్నికల సంఘం
- బీజేపీతో పొత్తులో భాగంగా 8 స్థానాల్లో పోటీచేస్తున్న జనసేన
- 8 మందికి కూడా జనసేన గుర్తు గ్లాస్ కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా తేల్చనున్న ఎన్నికల సంఘం
బీఎస్పీలో చేరిన నీలం మధు
- బీఎస్పీలో చేరిన పటాన్చెరు యువ నాయకుడు నీలం మధు
- కాంగ్రెస్‌లో టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీలో చేరిన నీలం మధు
హెలికాప్టర్లో సిర్పూర్ కాగజ్ నగర్‌కు బండి సంజయ్
- హెలికాప్టర్లో కరీంనగర్ నుండి సిర్పూర్ కాగజ్ నగర్ బయలుదేరిన బండి సంజయ్ కుమార్.
- 12.45 గంటలకు సిర్పూర్ చేరుకోనున్న బండి సంజయ్ కుమార్.
నామినేషన్ దాఖలు చేసిన బిఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి
ములుగు జిల్లా:
- ములుగు జిల్లా కేంద్రంలో గట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ దాఖలు చేసిన జడ్పీ చైర్ పర్సన్ బిఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి
- ములుగు గట్టమ్మ దేవాలయం నుండి గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.
- ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో ములుగు బస్టాండ్ వరకు ర్యాలీ
పోటా పోటీగా నామినేషన్లు
కరీంనగర్ జిల్లా:
- కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పురమళ్ల శ్రీనివాస్ నామినేషన్..
- భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు కార్యక్రమం.
- చొప్పదండి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బొడిగె శోభ
మహిళలే ఈసారి కేసీఆర్‌ని ఓడించాలి: రాజగోపాల్‌రెడ్డి
‘సాక్షి’ తో రాజగోపాల్‌రెడ్డి..
- పార్టీలకు అతీతంగా తనకు మద్దతునివ్వాలి
- నా పదవి త్యాగం వల్ల మునుగోడుకి రూ. 600 కోట్లకు పైగా నిధుల మంజూరు
- బీఆర్ఎస్ పాలనలో మునుగోడు అభివృద్దికి ఆమడదూరంలోనే ఉంది
- మహిళలే ఈసారి కేసీఆర్‌ని ఓడించాలి
- భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్న
టికెట్ ఇచ్చారు కాబట్టే నామినేషన్ వేశా: తుల ఉమ
రాజన్న సిరిసిల్ల జిల్లా:
- వేములవాడ అసెంబ్లీ నియోజక వర్గానికి బీజేపీ పార్టీ తరుపున తన నామినేషన్ వేసిన తుల ఉమ
- టికెట్ ఆశించి భంగపడ్డ డా. వికాస్ రావు తరుపున నామినేషన్ దాఖలు చేసిన అయన వర్గీయులు
తుల ఉమ కామెంట్స్
- బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టే నామినేషన్ దాఖలు చేసిన
- బీజేపీ అంటే ధర్మం, సిద్దాంతం ప్రకారం ఉంటారు, కానీ కొంత మంది వ్యక్తుల పూజ చేస్తున్నారు
- కొంత మంది కావాలనే నడిపిస్తున్నారు
- మహిళలను రాజకీయ ల్లో ఎదగనివ్వరా..? బీసీలు ఎమ్మెల్యేలుగా పోటి చేయకూడదా..?
- కొంత మంది దొరల వద్ద మోచేతి నీళ్ళు తాగి అనవసర ఆరోపణలు చేస్తున్నారు
- బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి వస్తారు
బీజేపీ నేతలు పోటాపోటీ నామినేషన్లు
- వేములవాడలో బీజేపీ నేతలు పోటాపోటీ నామినేషన్లు
- బీజేపీ జాబితాలో ఇప్పటికే అభ్యర్థిగా తుల ఉమ పేరు
- నామినేషన్ వేసిన తుల ఉమ
- మరోవైపు తన నామినేషన్‌ను తన అనుచరులతో వేయించిన చెన్నమనేని వికాస్ రావు
- సాయంత్రం 3 గంటల్లోపు ఎవరు బీఫామ్ దాఖలు చేస్తే వారే బీజేపీ అభ్యర్థి
- ఈ నేపథ్యంలో వేములవాడ రాజకీయాల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠ
నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయల్దేరిన రాజగోపాల్‌రెడ్డి
నల్లగొండ జిల్లా:
- మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు ర్యాలీగా బయలుదేరిన కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
షబ్బీర్ అలీ ఇంటికి రేవంత్
కామారెడ్డి జిల్లా:
- హెలికాఫ్టర్ లో కామారెడ్డి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
- ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, ఇతర నేతలు
- షబ్బీర్ అలీ ఇంటికి వెళ్ళిన నేతలు
హరీశ్ రావు కాన్వాయ్ తనిఖీ
- ఎన్నికల విధుల్లో భాగంగా సిద్దిపేట జిల్లా బేగంపేట్ రహదారిపై మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ తనిఖీ చేసిన పోలీసులు.
కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు ప్రచారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
- మహాముత్తారం మండలం చింతకానిలో మంథని ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు ప్రచారం..
- చెన్నకేశవ స్వామి ఆలయంలో పూజలు చేసిన శ్రీధర్ బాబు.
111 స్థానాల్లో బీజేపీ పోటీ
హైదరాబాద్:
- 111 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ
- అత్యధికంగా బిసిలకు 36 స్థానాలు కేటాయింపు
- ఎస్సీ-21
- ఎస్టీ-10
- బ్రాహ్మిణ్-3
- వైశ్యా-1
- బీసీ-36
- రెడ్డి-29
- నార్త్ ఇండియన్-1
- వెలమ-7
- కమ్మ-3
- పొత్తులో భాగంగా జనసేనకు 8 స్థానాలు
అసంపూర్ణంగా అఫిడవిట్ దాఖలు చేస్తున్న పలువురు అభ్యర్థులు
- వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సరిగా నింపని ప్రముఖుల నామినేషన్ పత్రాలు
- నోటీసు జారీ చేసిన తూర్పు ఎన్నికల రిటర్నింగ్ అధికారి
- నామినేషన్ పత్రాలు కూడా కరెక్ట్‌గా నింపని వైనం
- అసంపూర్ణంగా అఫిడవిట్, కేసుల వివరాలు అన్ని రాసి, చివరికి డిక్లరేషన్‌లో కేసులు "నిల్" అని రాసిన మరో అభ్యర్థి
- అజాగ్రత్త వల్ల ప్రముఖ పార్టీకి చెందిన నాయకుడి నామినేషన్ రిజెక్ట్ అయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
- 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, తూర్పు నుండి 8మంది అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణకు గురయ్యారు
- ఈ సారి కూడా తిరస్కరణ సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని నామినేషన్ పత్రాలను పరిశీలిస్తే తెలుస్తోంది
- అఫిడవిట్ అసంపూర్తిగా ఉండటంతో తూర్పు బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు, బిఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రాజనాల శ్రీహరి లకు నోటీస్ జారీ చేసిన తూర్పు ఎన్నికల అధికారి
- సమాచారం ఇవ్వలేని దగ్గర "నాట్ అప్లికేబుల్" అని నింపాల్సిన అఫిడవిట్ లో ఖాళీగా వదిలేసిన ప్రముఖ జాతీయ పార్టీ అభ్యర్థి
- ఇక ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు అయితే ఆగం ఆగం ఉన్నట్లు సమాచారం
- ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర ఏమి రాయకుండా ఖాళీగా వదిలేసిన మరో అభ్యర్థిని
- చాలా వరకు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది
- చివరిరోజు కావున జాగ్రత్తగా నింపి, తిరస్కరణకు గురి కాకుండా నామినేషన్ దాఖలు చేయడం మంచిదని అభ్యర్థులు భావిస్తున్నారు
బీజేపీ ఐదో లిస్టులో గందర గోళం.. పేర్లు మార్పు
- బెల్లంపల్లి శ్రీదేవి స్థానంలో హెమ్మాజిని అభ్యర్థిగా ప్రకటిస్తూ ఐదో లిస్ట్ విడుదల చేసిన బీజేపీ
- తిరిగి బెల్లంపల్లి స్థానం శ్రీదేవికే అంటూ పత్రిక ప్రకటన విడుదల చేసిన బీజేపీ అధిష్టానం
- ఆలంపూర్ మేరియమ్మ పేరును ఖరారు చేస్తూ.. ఐదో జాబితా విడుదల
- ఆలంపూర్ స్థానం మరియమ్మకు బదులుగా రాజగోపాల్ పేరు ఖరారు చేస్తూ పత్రిక ప్రకటనలో పేర్కొన్న బీజేపీ
- చివరి నిమిషంలో అభ్యర్థుల మార్పు ప్రకటనతో కేడర్‌లో గందరగోళం
పువ్వాడ అజయ్‌కుమార్ నామినేషన్ దాఖలు
- ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నామినేషన్ దాఖలు చేశారు.
- ఖమ్మం రిటర్నింగ్ ఆఫీసర్‌కు నామినేషన్ పత్రాలు అందించిన పువ్వాడ.
బీఆర్ఎస్పై పొన్నం ఫైర్
- సిద్దిపేట: బీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫైర్
- గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులకు బేడీలు వేయించి కొట్టించిన ఎమ్మెల్యే సతీష్‌కు ఓట్లు అడిగే హక్కు లేదు.
- హుస్నాబాద్‌లో అభివృద్ధి రంగంపై ధ్యాస లేదు.
- సెంటిమెంట్కేమో హుస్నాబాద్, అభివృద్ధికేమో సిద్ధిపేట, గజ్వేల్
- పదేళ్లలో స్థానికుడిగా ఓటు హక్కు నమోదు చేసుకోసి ఎమ్మెల్యే స్థానికుడు ఎలా అవుతాడు.
- సిరిసిల్ల, వేములవాడలో పరిణామాలను చూస్తే రాష్ట్రమంతా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని అర్థమైపోతుంది.
- ఈ ఎన్నికలు సమర్థుడికి, అసమర్థుడికి మధ్య పోటీ.
నేటితో నామినేషన్లకు తెర
నల్లగొండ జిల్లా:
- నల్లగొండ జిల్లాలో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన కీలక నేతలు
- నామినేషన్‌కి చివరి రోజు కావడంతో ఇవాళ(శుక్రవారం) భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం
- ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 259 నామినేషన్లు నమోదు
- మిర్యాలగూడలో అత్యధికంగా 32 నామినేషన్లు
- మునుగోడు: 30
- సూర్యాపేట: 26
- కోదాడ: 25
- నల్లగొండ: 24
- తుంగతుర్తి: 21
- నాగార్జున సాగర్: 20
- నకిరేకల్: 20
- ఆలేరు:17
- హుజూర్నగర్: 16
- భువనగిరి: 16
- దేవరకొండ: 12
బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తుది జాబితా ఇదే..
బీజేపీ తెలంగాణ చివరి జాబితాలో అభ్యర్థులు వీరే..
- మల్కాజ్గిరి - రామచంద్రరావు
- శేరిలింగంపల్లి - రవికుమార్ యాదవ్
- పెద్దపల్లి - దుగ్యాల ప్రదీప్
- బెల్లంపల్లి - ఎమాజీ
- సంగారెడ్డి - దేశ్‌పాండే రాజేశ్వరరావు
- మేడ్చల్ - సుదర్శన్ రెడ్డి
- చాంద్రాయణ గుట్ట- మహేందర్
- కంటోన్మెంట్ - గణేష్ నారాయణ్
- దేవరకద్ర - కొండా ప్రశాంత్ రెడ్డి
- వనపర్తి - అనుఘ్నారెడ్డి
- అలంపూర్ - మేరమ్మ
- నర్సంపేట - కే. పుల్లారావు
- మధిర - విజయరాజు
- నాంపల్లి-రాహుల్ చంద్ర
టికెట్ రాకపోవడంపై పటేల్ రమేష్ రెడ్డి అసంతృప్తి
సూర్యాపేట జిల్లా
- టికెట్ రాకపోవడంపై పటేల్ రమేష్ రెడ్డి ఆగ్రహం
- సూర్యాపేట టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్న
- టికెట్ దామోదర్ రెడ్డికి కేటాయించడం ఒక కుట్ర
- ప్రజలు నిర్ణయానికి వ్యతిరేకంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని జగదీశ్ రెడ్డి ని గెలిపియడం కోసం ఇదంతా చేశారు
- బీఆర్ఎస్ తో ఒప్పందం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని చంపే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తాం
- కార్యకర్తల తో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ని సూర్యాపేటలో బతికించే లా ఒక నిర్ణయం తీసుకుంటాం
- ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు కూడా అర్థం కావట్లేదు
- భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా
- పీసీసీ అధ్యక్షుడు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు
- ఐదేళ్లుగా నియోజకవర్గంలో పని చేసుకుంటూ వెళుతున్నా
నేడు సూర్యాపేట జిల్లాలో డీకే శివకుమార్ పర్యటన
సూర్యాపేట జిల్లా:
- సాయంత్రం కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పర్యటన
- సాయంత్రం 4 గంటలకు కోదాడలో రోడ్ షో
- 6:30 నిమిషాలకు హుజూర్నగర్ లో రోడ్ షో
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: భట్టి విక్రమార్క
- మధిరరలో మార్నింగ్ వాకర్స్‌తో ఎన్నికల ప్రచారంలో భట్టి విక్రమార్క.
- వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.
- మధిర సమగ్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా.
- మీ ఓటు అనే ఆయుధంతో రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా చేస్తా.
- మధిర రూపురేఖలు మార్చి రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తయారు చేద్దాం.
- కేసీఆర్ అవినీతి పాలన అంతమొందించాలంటే మేధావులు ఆలోచించాలి.
- మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తే డిక్టేటర్ పాలన వచ్చినట్లే.
- ప్రజాపాలన రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిందే.
నేడు కోమటిరెడ్డి నామినేషన్
- మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- చండూరు మండలం అంగడిపేట శివాలయంలో ఉదయం పది గంటలకు ప్రత్యేక పూజలు
- ఉదయం 11 గంటలకు చండూరు మండలం బంగారు గడ్డ నుంచి ర్యాలీ
- అనంతరం, నామినేషన్ వేయనున్న కోమటిరెడ్డి
నేడు తెలంగాణకు సీఎం సిద్ద రామయ్య
- నేడు తెలంగాణలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎన్నికల ప్రచారం
- కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న టీకాంగ్రెస్
- బీసీ డిక్లరేషన్ సభకు హాజరుకానున్న సిద్ధరామయ్య
నేడు ప్రముఖుల నామినేషన్స్.. వేములవాడలో ఇలా..
- కోరుట్ల బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న ఎంపీ అర్వింద్
- నామినేషన్ కార్యక్రమానికి ఈటల రాజేందర్ హాజరు.
- వేములవాడ బీజేపీ అభ్యర్థిగా తుల ఉమ.
- నేడు నామినేషన్ వేయనున్న తుల ఉమ
- మరోవైపు, నామినేషన్ వేసేందుకు సిద్ధమైన డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు
- చెన్నమనేనికి టికెట్ ఇవ్వని బీజేపీ
- వికాస్ రావు నామినేషన్‌కు రెడీ కావడంతో ఉత్కంఠగా వేములవాడ పాలిటిక్స్
- హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో పాడి కౌశిక్‌రెడ్డి
- నేను నామినేషన్ వేయనున్న కౌశిక్ రెడ్డి
- జమ్మికుంటలో ప్రజా ఆశ్వీరాద సభ
- బీఆర్ఎస్ సభకు మంత్రి హరీష్ రావు హాజరు.
కాంగ్రెస్ తుది జాబితా.. దయాకర్‌కు షాక్
- సూర్యాపేట-దామోదర రెడ్డి
- తుంగతుర్తి-శామ్యూల్
- మిర్యాలగూడ-బత్తుల లక్ష్మారెడ్డి
- చార్మినార్-ముజీబిల్ షరీఫ్
- పటాన్చెరు-కాటా శ్రీనివాస్ గౌడ్
- సీపీఎంతో కాంగ్రెస్ పార్టీ చర్చలు విఫలం
- చివరి రోజు వరకు మిర్యాలగూడ టికెట్‌ను సీపీఎం కోసం ఆపిన కాంగ్రెస్ పార్టీ
- సీపీఎం పొత్తు లేకపోవడంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్థానాలపై ప్రభావం పడే అవకాశం
- అద్దంకి దయాకర్‌కు హ్యాండిచ్చిన కాంగ్రెస్
- రేవంత్ అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డికి దక్కని సూర్యపేట టికెట్
- పంతం నెగ్గించుకున్న దామోదర రాజనర్సింహ
- తన అనుచరుడు కాటా శ్రీనివాస్ గౌడ్‌కు పటాన్చెరు టికెట్ మార్పించిన దామోదర
నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ
- అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది.
- 119 శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం రికార్డు సంఖ్యలో 1,129 నామినేషన్లు దాఖలు
- నిన్నటి వరకు మొత్తం నామినేషన్లు 2,474 దాఖలు
- గురువారం నాటికి దాఖలైన మొత్తం నామినేషన్ల వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
- ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన..
- ఈ నెల 15 వరకు ఉపసంహరణ గడువు
Related News By Category
-
కార్యకర్తలే పార్టీకి పునాది రాళ్లు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు పునాది రాళ్లు, మూల స్తంభాలు కార్యకర్తలేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గులాబీ జెండాకు వెన్నెముకలా ఉంటూ అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు...
-
ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కవితకు టీపీసీసీ చీఫ్ సవాల్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే ధర్నా చేయాలంటూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. బీసీలకు న్యాయంగా అందాల్సిన...
-
రెండు రోజుల్లో సర్కార్ అవినీతి స్కాం బయటపెడతా: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రూ.వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని.. 2 రోజుల్లో ప్రభుత్వ అవినీతి కుంభకోణాన్ని బయటపడపెడతానంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ...
-
మొదటిసారి గెలవడం ఓకే.. రెండోసారి గెలవడమే గొప్ప
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం తొలిరోజు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పొలిటికల్ క్లాస్ తీసుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్...
-
నేను మారాను.. మీరూ మారండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని.. వర్గాలను దూరం పెట్టి కార్యకర్తలకు సమయం ఇవ్వండంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన నివ...
Related News By Tags
-
తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
-
తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
-
కాంగ్రెస్‌కే పూర్తి మెజారిటీ.. ఇండియా టుడే సర్వే
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను సాధిస్తుందని ఇండియా టుడే– యాక్సిస్ మైఇండియా ఎగ్జిట్‌పోల్ సర్వే పేర్కొంది. మొత్తం 119 అసెంబ్లీ ని...
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
Telangana Assembly Elections Today Minute To Minute Update.. ఎల్లుండి(డిసెంబర్ 3, ఆదివారం) తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు తెలంగాణ : లెక్కింపు కేంద్రాల ...
-
తెలంగాణలో ముగిసిన పోలింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. కానీ, పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారుల...
Comments
Please login to add a commentAdd a comment