తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌ | Telangana Assembly Elections Today Updates On 26 November | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌

Published Sun, Nov 26 2023 7:11 AM | Last Updated on Sun, Nov 26 2023 9:23 PM

Telangana Assembly Elections Today Updates On 26 November - Sakshi

Telangana Assembly Elections Today Minute To Minute Update..

జుక్కల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సౌదా గర్ గంగారాం సస్పెన్షన్ 

  • కామారెడ్డి జిల్లా, జుక్కల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సౌదా గర్ గంగారాం సస్పెన్షన్ 
  • పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని గంగారాంను కాంగ్రెస్ పార్టీ నుండి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసిన క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నా రెడ్డి
  • రెబెల్ గా నామినేషన్ వేసి ఉపసంహరించుకున్న గంగారాం
  • ఇవ్వాళ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చిన గంగారాం

కేజీ టు పీజీ స్కూల్లో పలకతో రండి పట్టాతో వెళ్ళండి: కేటీఆర్

  • రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చేరుకున్న మంత్రి కేటీఆర్.
  • రోడ్ షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
  • భారీగా హాజరైన మండల ప్రజలు
  • 30 తేదీన బటన్ నోక్కేటప్పుడు ఒకటే ఆలోచన చేయండి 24 గంటల కరంటు కావాలా... 3 గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా 
  • రేపు లేదా ఎల్లుండి రైతు బందు డబ్బులు పడుతాయి, టింగు టింగు మని మేసేజులు వస్తాయి చూడండి
  • మండలంలో ని అన్ని గ్రామాల స్కూల్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతాం, పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ వెళ్లకుండా చేస్తాను.
  • ఇక్కడ ఉన్న కేజీ టు పీజీ స్కూల్లో చేరి పలకతో రండి పట్టాతో వెళ్ళండి

దుబ్బాక ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్‌

  • ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి రాలేదు
  • ఎన్నికలు వచ్చాయని ఆగమాగం కావొద్దు
  • గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని గమనించండి
  • ఓటు వేసే ముందు ఆలోచించి వేయండి
  • ప్రజలకు ఒకే ఒక్క ఆయుధం ఓటు
  • వేసే ఓటులో తేడా వస్తే ఐదేళ్లు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది
  • ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్లు చూపించేవారు వస్తారు.. వారి మాటలు నమ్మకండి
  • మీరు వేసే ఓటు ఐదేళ్ల తలరాతను మారుస్తుంది
  • ఆలోచించి ఓటు వేస్తే దేశం ముందుకు సాగుతుంది
  • ఓటు వేసే ముందు అభ్యర్థి వెనుక పార్టీ చరిత్రను గమనించండి
  • ఎన్నికలు వచ్చాయంటే అబద్ధాలు చెబుతుంటారు
  • ఎంతో పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం
  • మళ్లీ ఆగమైతే రాష్ట్రం వెనక్కిపోతుంది
  • పదేళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం
  • రైతుబంధును తీసుకొచ్చిందే బీఆర్‌ఎస్‌
  • రైతులకు ఇవాళ 24 గంటలు నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్నాం
  • కాంగ్రెస్‌ నేతలు రైతుబంధు దుబారా అంటున్నారు
  • రైతుబంధు రూ. 16వేలు చేస్తాం
  • రైతు బీమాతో అన్నదాతలను ఆదుకున్నాం
  • 50 ఏళ్లు మనల్ని ఇబ్బందిపెట్టిన కాంగ్రెస్‌ మళ్లీ అవసరమా?
  • రైతుబంధు ఉండాలా? వద్దా?
  • రైతుల భూములు బాధలు నాకు తెలుసు
  • రైతుల భూముల కష్టాలు తీర్చేందుకు ధరణి తెచ్చాం
  • రైతు పండించిన పంటను ప్రభుత్వమే కొంటోంది
  • ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే
  • కాంగ్రెస్‌ నేతలు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు
  • ధరణి తీసేస్తామనే వారినే బంగాళాఖాతంలో వేయండి
  • ధరణి ఉండాలా? వద్దా?
     

భువనగిరి ఎన్నికల ప్రచార సభలో కేంద్రమంత్రి అమిత్ షా

  • ఆచార్య వినోబాభావే భూధానోద్యమం ప్రారంభిస్తే కేసీఆర్ మాత్రం భూమి కబ్జా చేసే ఉద్యమాన్ని ప్రారంభించారు‌
  • వేల‌కోట్ల భూములను దోచుకున్నారు
  • బీజేపీ అధికారంలోకి రాగానే  అవినీతి బీఆర్ఎస్ గ్యారేజీకి పంపిస్తాం
  • బీఆర్ఎస్‌కు వీఆర్‌ఎస్‌ ఇచ్చే రోజు వస్తుంది
  • కేసీఆర్ జూటా మాటలు చెప్తున్నాడు
  • కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా మార్చాలని మోదీని కేసీఆర్ఎప్పుడు కలవలేదు
  • కేసీఆర్ ను గద్దె దించేందుకు మీరంతా సిద్ధం కావాలి
  • కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్‌కు ఓటేసినట్లే
  • 2018 లో కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎమ్మెల్యేలు అంతా బీఆర్ఎస్ లో చేరారు
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య  డీల్ కుదిరింది
  • కేసీఆర్ సీఎం, రాహుల్ పీఎం కావాలని వారి ప్లాన్
  • బీజేపీ గెలిచిన తర్వాత బీసీని సీఎం చేస్తాం
  • ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం 

నిర్మల్‌ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ

  • తన కుటుంబం గురించే కేసీఆర్‌ ఆలోచిస్తున్నారు
  • హామీలను నెరవేర్చకుండా కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారు
  • పేద ప్రజలను పట్టించుకోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని సాగనంపండి
  • కేంద్ర ఇచ్చిన సంక్షే పథకాలను కేసీఆర్‌ అడ్డుకుంటున్నారు
  • బీజేపీ ప్రభుత్వం అంటే పేదలకు గ్యారెంటీ ప్రభుత్వం
  • నా ఇల్లు కట్టకోవడానికి నేను ప్రధాని కాలేదు
  • పేద ప్రజలకు ఇళ్లు కట్టడం కోసమే ప్రధాని అయ్యా
  • తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఇళ్లు కట్టిస్తాం.. ఇది మోదీ గ్యారెంటీ
  • పదేళ్లుగా తెలంగాణకు బీఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదు
  • కాంగ్రెస్‌ ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు ఓటేసినట్లే
  • బీజేపీ అధికారంలోకి వస్తేనే ధరలు తగ్గుతాయి
  • ప్రజలను కలవని సీఎం.. సచివాలయానికి రాని సీఎం మనకు అవసరమా?

ములుగులో అమిత్‌ షా కామెంట్స్‌ 

  • కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ ఆ నేతలు బీఆర్‌ఎస్‌లోకి వెళతారు
  •  పోడు భూముల సమస్య పరిష్కరించలేక బీఆర్‌ఎస్ వివాదం రేపుతోంది
  • గిరిజనులను కేసీఆర్ నిర్లక్ష‍్యం చేశారు
  •  గిరిజనులను మోసం చేయడం కాంగ్రెస్ లక్షణం 
  • కేసీఆర్‌ను గద్దె దించాలంటే బీజేపీకి ఓటేయండి
  • తెలంగాణలో  మోదీ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశారు
  • అత్యధిక గిరిజన ఎంపీలు బీజేపీకి చెందినవారే ఉన్నారు

సోనియా వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది: దిగ్విజయ్ సింగ్

హైదరాబాద్:

  • హైదరాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఎంతగానో కృషి చేసింది
  • ఔటర్ రింగ్ రోడ్డుకి రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ
  • సోనియా వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది
  • తెలంగాణ ప్రజలకు సోనియా ఇచ్చిన వాగ్దానాలు తప్పకుండా అమలుచేస్తాం
  • రైతుబంధు సామాన్య రైతులకు కాకుండా భూస్వాములకు ఉపయోగపడుతోంది
  • టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్‌.. 
  • రాముడు అందరికీ దేవుడే. కొందరు రాముడితో కూడా రాజకీయాలు చేస్తున్నారు
  • కాంగ్రెస్ మత రాజకీయాలు చేయదు
  • మతాన్ని వాడుకొని రాజకీయాలు చేసే వాళ్ళకి మేం వ్యతిరేకం

జగిత్యాల ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్‌

  • తెలంగాణ తెచ్చింది ఎవరు? 24 గంటల కరెంటు ఇచ్చింది ఎవరు?
  • ఇందిరమ్మ రాజ్యంలోనే లక్షల మందిని జైలులో పెట్టారు
  • ఎవరికి కావాలి మీ ఇందిరమ్మ రాజ్యం
  • ప్రజాస్వామ్య పరిణితిపై మీరంతా ఆలోచించాలి
  • గత కాంగ్రెస్‌ పాలనకు బీఆర్‌ఎస్‌ పాలనకు తేడా గమనించండి
  • రైతుబంధు ఇచ్చి దుబారా చేస్తున్నారని ఉత్తమ్‌ చెబుతున్నారు
  • రైతుబంధు ఉండాలా? వద్దా?
  • రైతుబంధు రూ. 16వేలు చేస్తాం
  • రైతుబంధు గురించి ఎవరైనా ఆలోచించారా?
  • రైతుబంధు తెచ్చింది బీఆర్‌ఎస్సే

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే:  రాజాసింగ్‌

నిజామాబాద్:

  • బీజేపీ గెలువద్ధనే కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ పోటీకి దిగారు
  • కేసీఆర్ పెద్ద మోసగాడుబీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్
  • ముఖ్యమంత్రి సహా మంత్రులు ఎమ్మెల్యేలంతా అవినీతి పరులే
  • మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ బీజేపీ
  • కేసీఆర్ మోసగాడు... కేటీఆర్ పెద్దమోసగాడు
  • అసెంబ్లీ సాక్షిగా అనేక అబద్దాలు చెప్పారు
  • బంగారు తెలంగాణ అంటూ అప్పుల తెలంగాణగా మార్చారు
  • ప్రభుత్వం నడిపే కారు స్టీరింగ్ మజ్లీస్ చేతిలో ఉంది
  • కేసీఆర్, కేటీఆర్‌లు ఎంఐఎం కాళ్ళు పట్టుకునే అవసరం ఏముంది?
  • ఓవైసి లు నడిపే దక్కన్ కాలేజీ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలు
  • హైదరాబాద్‌ ఓల్డ్ సిటీ మినీ పాకిస్తాన్‌గా మారింది
  • ఓవైసి బ్రదర్స్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు
  • బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఒవైసి బ్రదర్స్ని పాకిస్తాన్ తరిమిస్తాం

తూప్రాన్‌ ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగం

  • కాంగ్రెస్‌, కేసీఆర్‌ ఒక్కటే.. ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి
  • బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుంది
  • ప్రజలను కలవని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా?
  • అబద్ధపు హామీలు ఇచ్చి కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారు
  • సచివాలయానికి వెళ్లని సీఎం అవసరమా?
  • ఈటలకు భయపడి కేసీఆర్‌ మరోచోటుకు వెళ్లారు
  • దుబ్బాక, హుజురాబాద్‌లో ట్రైలర్‌ చూశారు.. ఇక సినిమా చూపిస్తారు
  • కేసీఆర్‌ ఇచ్చిన హామీలను ఏవీ నెరవేర్చలేదు
  • తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు
  • తెలంగాణకు ఇలాంటి సీఎం అవసరం లేదు
  • బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని బీజేపీ సీఎం చేస్తుంది

 సంగారెడ్డి ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌

  • కేసీఆర్‌జీ నువ్వు కాళేశ్వరంలో ఎంత దోపిడీ చేశావో చెప్పు.
  • ఢిల్లీలో మోదీకి బీఆర్‌ఎస్‌, తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు మోదీ పరస్పర మద్దతుంది
  • అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం
  • కాంగ్రెస్‌ను ఓడించడానికే బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి
  • కాంగ్రెస్‌ను ఓడగొట్టేందుకే బలం లేకపోయినా ఎంఐఎం పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది
  • బీజేపీ, బీఆర్‌ఎస్‌ దొరల ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి అని రాహుల్‌ మండిపడ్డారు
  • కాంగ్రెస్‌ వచ్చాక ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
  • నేను ప్రజా సమస్యలపై పోరాడితే కేసులు పెట్టారు. కేసీఆర్‌ అవినీతికి పాల్పడితే మోదీ మద్దతిస్తున్నారు
  • కేసీఆర్‌ ఎంత అవినీత చేసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోంది
  • నా ఇల్లును లాగేసుకున్నా భారత దేశమే నా ఇల్లు అనుకున్నా
  • కేసీఆర్‌ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు

బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌కు మద్దతుగా ఎమ్మెల్సీ కవిత ఎన్నికల ప్రచారం

  • రాహుల్ గాంధీ వచ్చి బిర్యాని, పాన్ తిని వెళ్ళిపోతారు
  • గాంధీలు చుట్టపు చూపుగా ఇలా వచ్చిపోతుంటారు
  • అండగా నిలిచిన ప్రతిసారి తెలంగాణను నిండా ముంచిన గాంధీ కుటుంబం
  • తెలంగాణకు తీరని మోసం చేసిన గాంధీ కుటుంబం
  • వందలాది మంది యువతను కాంగ్రెస్ పార్టీ బలితీసుకుంది
  • ప్రత్యేక తెలంగాణ ఆలస్యం కావడంతో అనేక మంది ఆత్మబలిదానాలు
  • ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ చిచ్చు పెట్టే ప్రయత్నం
  • నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా లేదా కన్నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా ?
  • రైతు బంధు కావాలా లేదా రాబంధు కావాలా ?
  • కాంగ్రెస్ మూడు గంటల కరెంటు కావాలా... బీఆర్ఎస్ 24 గంటల కరెంటు కావాలా ?
  • కాంగ్రెస్ పాలనలో చూసిన దారుణమైన పరిస్థితులు కావాలా ?
  • దారుణ పరిస్థితి మళ్లీ రావద్దంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్‌ను గెలిపించాలి

ప్రభుత్వం మనమే ఏర్పాటు చేస్తున్నాం: భట్టి విక్రమార్క

ఖమ్మం జిల్లా:

  • వేంసూరు మండలం మర్లపాడు సెంటర్‌లో కాంగెస్ పార్టీ మీటింగ్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్
  • సత్తుపల్లి శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట
  • డాక్టర్ రాగమయి దయానంద్లు ప్రజా సేవ చేసిన నాయకులు
  • కొందమంది పారిశ్రామిక వెత్తలు సంచులతో డబ్బులు వెదజల్లి బిఆరెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తుంది.
  • గతంలో కాంగ్రెస్,తెలుగుదేశం పాలనలో మాత్రమే అభివృద్ధి జరిగింది
  • గత పది సంవత్సరాల నుండి బిఆర్‌ఎస్ హయాంలో ఒక్క అభివృద్ధి జరగలేదు.
  • పందిక్కొక్కులాగ దొపిడి చేసి తెలంగాణ సంపదను దోచుకున్నారు.
  • కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులందరూ భారీ మెజారిటీతో గెలుపోందనున్నారు..
  • ప్రభుత్వం మనమే ఏర్పాటు చేస్తున్నాం.
  • గత ఐదు సంవత్సరాలు గా రుణామాఫి చేయ్యని ప్రభుత్వం కేసిఆర్ ప్రభుత్వం కేసిఆర్ కి బుద్ది ఉందా..
  • ప్రతి రైతుకు ఎకారానికి 15000 ఇస్తాం....బోనాస్గా 500
  • రైతుకూలీలకు 1200౦ ఇస్తాం,ఇల్లు నిర్మానానికి ఐదు లక్షలు ఇస్తాం,పీజ్ రియాంబర్ మెంట్స్ విద్యార్ధులకు ఇస్తాం.నిరుద్యోగం లేకుండా చేస్తాం..200 యూనిట్లు ఉచితంగా ఇస్తాం.

ఇది కాంగ్రెస్‌ ప్రభంజనం: పొంగులేటి

ఖమ్మం జిల్లా:

  • వేంసూరు మండలం మర్లపాడు సెంటర్‌లో కాంగెస్ పార్టీ మీటింగ్‌లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్
  • సత్తుపల్లి నియోజకవర్గంలో ఎలాంటి డౌట్ లేదు మూడు రంగుల జెండా రెపరెపలాడుతుంది
  • రాగమయి గెలుపులో అందరం భాగస్వాములం కావాలి
  • కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజల వద్దకు తీసుకువెళ్ళండి
  • ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు
  • మీ అందరి దీవేనలతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తున్నాం
  • ఈ ప్రభంజనం ముందు బడా బాబులు తుడుసుకుపెట్టుకొని పోతారు

బీఆర్‌ఎస్‌పై యూపీ సీఎం యోగి ఫైర్‌

మహబూబ్ నగర్:

  • అందరికి నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన యోగి
  • నేను జితేందర్‌రెడ్డి పార్లమెంటు లో కలిసి పనిచేశాం
  • అమరవీరుల ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ ను మాఫియా మయం చేసింది
  • మిగులు రాష్ట్రాన్నికేసీఆర్ సర్కారు అప్పులమయం చేసింది
  • మహబూబ్ నగర్‌ను పాలమూరుగా మార్చటం కోసమే వచ్చాను
  • యూపీలో మాఫియాను బుల్డోజర్‌తో అణిచివేశాం
  • ఎంఐఎం , బీఆర్ఎస్, కాంగ్రెస్ కామన్ ఫ్రెండ్స్
  • 26/11 ముంబైలో ఉగ్రదాడి జరిగింది 
  • కాని ఇది నయా భారత్
  • దేశంలోకి చొరబడితే ఏం జరుగుతుందో ఉగ్రవాదులకు తెలుసు
  • సర్జికల్ స్ట్రైక్‌తో ఉగ్రవాదులకు బుద్ధి చెప్పింది మోదీ సర్కార్‌
  • కేంద్రంలో యూపీలో డబుల్ ఇంజన్ సర్కార్తో ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతున్నాం
  • యూపీలో 55 లక్షల మందికి ఇళ్ళు కట్టించాం
  • 6 ఏళ్ళలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం

భారత్‌ జోడో యాత్రతో కాంగ్రెస్‌లో జోష్‌..

  • నిజామాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో జైరాం రమేష్‌
  • జైరాం రమేష్‌ కామెంట్స్‌..
  • భారత్ జోడో యాత్ర తరువాత కాంగ్రెస్‌ జోష్ పెరిగింది
  • అదే జోష్‌తో కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించింది
  • తెలంగాణలోనూ విజయం సాధిస్తాం
  • ఆశించినంతగా అభివృద్ది తెలంగాణలో జరగలేదు
  • బీఆర్‌ఎస్‌ కేవలం హైదరాబాద్‌పైనే దృష్టి పెట్టింది. 
  • ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు వస్తాయని అనుకుంటే అదీ జరగలేదు
  • ఉద్యోగ అవకాశాలు లేక యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు
  • ప్రజా పాలన కొనసాగడం లేదు.. కుటుంబ పాలన కొనసాగుతుంది
  • తెలంగాణ ఇచ్చింది.. ప్రజల అభివృద్ధి కోసం కానీ కేసీఆర్ ప్యామిలీ కోసం కాదు
  • కేవలం కేసీఆర్‌ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందింది
  • బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం మూడు ఒక్కటే. 
  • బీఆర్‌ఎస్‌ బీజేపీకి బీ టీమ్‌, ఎంఐఎం సీ టీమ్‌. 
  • కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు కచ్చితంగా నేరవేర్చుతాం
  • తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి. 
  • కాంగ్రెస్‌ను గెలిపించండి.. ప్రజా తెలంగాణను తిరిగి నిర్మిస్తాం
  • ప్రజల ఆశలను నేరవేర్చుతాం
  • తెలంగాణలో కారు టైర్ పంక్చర్ కాబోతుంది. 

సీఈవోకు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

  • తెలంగాణ సీఈవో వికాస్ రాజ్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ లీగల్ సెల్
  • కొడంగల్ ఘటనలో కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌

కాంగ్రెస్‌ పాలనలో మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారు.. ఖానాపూర్‌ సభలో సీఎం కేసీఆర్‌

  • మంచి ఎమ్మెల్యే గెలిస్తే మంచి ప్రభుత్వం వస్తుంది
  • రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం
  • ఖానాపూర్‌ ఏ ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రం ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది
  • పార్టీల చరిత్ర చూసి ప్రజలు ఓటేయాలి
  • పదిహనేళ్లు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం
  • ఈ సారి గెలిచాక పెన్షన్‌ రూ.5వేల వరుకు పెంచుతాం
  • ఆడ బిడ్డలకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్‌ అందిస్తున్నాం
  • అన్ని వర్గాలకు సంక్షేమ పథకాల అందించాం
  • గిరిజనులు, ఆదివాసీల కోసం వేర్వేరుగా భవనాలు నిర్మించాం
  • అన్ని వర్గాల ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నాం
  • ఈ సారి గెలిచాక రేషన్‌కార్డు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తాం
  • దేశంలో రైతు బంధు పదాన్ని పుట్టించిందే బీఆర్‌ఎస్‌
  • కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం

         ఆంథోల్‌లో రాహుల్‌ కామెంట్స్‌..

  • కాంగ్రెస్‌ వచ్చాక ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 
  • బీజేపీ, బీఆర్‌ఎస్‌ దొరల ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. 
  • ఎంఐఎం కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుంది. 
  • కాంగ్రెస్‌ను ఓడిచేందుకు బలం లేకపోయినా ఎంఐఎం పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది. 
  • కేసీఆర్‌ ఎంత అవినీతి చేసినా కేంద్రంలోకి బీజేపీ చూస్తూ ఊరుకుంటోంది. నేను ప్రజా సమస్యలపై పోరాడితే నాపై కేసులు పెట్టారు. 
  • నా ఇల్లును లాగేసుకున్నా భారతదేశమే నా ఇల్లు అనుకున్నా.
  • కేసీఆర్‌ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.
  • ధరణితో 20 లక్షల ఎకరాల భూములు లాక్కున్నారు.
  • కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలుచేస్తాం. 
  • ప్రజల స్వప్నాన్ని కేసీఆర్‌, మంత్రులు నాశనం చేశారు. 
  • కేసీఆర్‌ అవినీతికి పాల్పడితే మోదీ మద్దతుగా నిలుస్తున్నారు. 
  • కేసీఆర్‌ ఎంత అవినీతి చేసినా కేంద్రంలోని బీజేపీ చూస్తూ ఊరుకుంటుంది. 
  • లోక్‌సభలో మోదీకి బీఆర్‌ఎస్‌, తెలంగాణలో కేసీఆర్‌కు మోదీ మద్దతిస్తారు. 

ప్రచారంలో మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి.. డ్యాన్స్‌తో జోష్‌

  • బొడుప్పల్‌లో మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఎన్నికల ప్రచారం
  • మహిళా గర్జనలో మహిళలతో డ్యాన్స్ చేసిన ప్రీతి రెడ్డి
  • మహిళా గర్జనలో పెద్ద ఎత్తున హాజరైన మహిళలు
  • మహిళలతో కలిసి బోనమెత్తిన ప్రీతి రెడ్డి..
  • ప్రచారంలో పాటలకు డ్యాన్స్‌ చేసిన ప్రీతి రెడ్డి.
  • ఆమె డ్యాన్స్‌లో స్టేప్పులు కలిపిన మహిళా కార్యకర్తలు
  • ప్రీతి రెడ్డి కామెంట్స్‌..
  • బోడుప్పల్‌లో అభివృద్ధి కావాలంటే కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్‌ఎస్‌ను గెలిపించండి. 
  • కాంగ్రెస్‌ నేతలు ఎన్ని కథలు చెప్పిన నమ్మకండి. 
  • మల్లారెడ్డి వల్లే అభివృద్ధి జరుగుతుంది. 
  • బోడుప్పల్‌ బిడ్డగా మీ ముందుకు వచ్చాను. నన్ను ఆశీర్వదించండి. 
  • ఓ మహిళగా మీ సమస్యలు నాకు తెలుసు. 
  • మహిళల కోసం కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టింది. 
  • కారు గుర్తుకు ఓటు వేసి మల్లారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి. 

ఈసీ నోటీసులకు బదులిస్తాను: కేటీఆర్‌

  • రైతుబంధు కొత్త స్కీమ్‌ కాదు.. ఇప్పటికే కొనసాగుతున్న స్కీమ్‌
  • రేవంత్‌ మూడు గంటలు, డీకే శివకుమార్‌ ఐదు గంటలు కరెంట్‌ అంటున్నారు. 
  • మేము 24 గంటల కరెంట్‌ ఇస్తామంటున్నాం. 
  • కర్ణాటక వాళ్లు ఇక్కడ ప్రచారం చేయడం ఏంటి? 
  • కాంగ్రెస్‌ను నమ్ముతాం అంటే అది వారి అవగాహనకు వదిలేస్తాం.
  • గోషామహల్‌లో కూడా బీజేపీని ఓడిస్తాం. 
  • నాకు ఈసీ నోటు ఇచ్చారు. 
  • ఈసీ నోటీసులకు బదులు ఇస్తాను. 

మక్తల్‌ బీజేపీ సభలో అమిత్‌ షా కామెంట్స్‌..

  • పదేళ్లుగా తెలంగాణను బీఆర్‌ఎస్‌ నాశనం చేసింది. 
  • ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదు. 
  • నిరుద్యోగులకు రూ.3వేలు భృతి ఇస్తానని కేసీఆర్‌ ఇవ్వలేదు. 
  • మక్తల్‌లో వంద పడకల ఆసుపత్రి ఎందుకు నిర్మించలేదు. 

కేసీఆర్‌ సర్కార్‌ అంటే లీకేజీ ప్రభుత్వం: బల్మూరి వెంకట్‌

  • బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై కాంగ్రెస్‌ నేత బల్మూరి వెంకట్‌ సీరియస్‌
  • బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎన్ని అయితే పరీక్షలు నిర్వహించారో అన్నిట్లో లీకేజీలే.
  • నిరుద్యోగులను మోసం కేసీఆర్‌ మోసం చేశారు. 
  • కానిస్టేబుల్ ఉద్యోగంతో పాటు అన్ని ఉద్యోగాలలో పేపర్ పత్రాలు లీకేజ్ చేసిన ఘనత కేసీఆర్‌ సర్కార్‌దే. 
  • ఈ సందర్భంగా ప్రభుత్వం, కేసీఆర్‌ 420 అనే ప్రశ్నాపత్రాన్ని వెంకట్‌ లీక్‌ చేశారు. 
  • ఈ పత్రాలను ఓయూ లైబ్రరీతో పాటుగా చిక్కడపల్లి లైబ్రరీలో ఇచ్చారు. 

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు కొత్త పేరు పెట్టిన జేపీ నడ్డా..

  • బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ అవినీతి పార్టీలే. 
  • బీఆర్‌ఎస్‌ అంటే భ్రష్టాచార్‌ రాక్షస సమితి. 
  • కాంగ్రెస్‌ అంటే కమీషన్‌, క్రిమినలైజేషన్‌, కరప్షన్‌. 
  • దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు మోదీకి ఓటు వేయండి. 
  • తెలంగాణలో బీజేపీని గెలిపించండి. 

దమ్మున్న నాయకుడు కేసీఆర్‌.. మీడియాతో మంత్రి కేటీఆర్‌

  • చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తి గొప్ప వ్యక్తి కేసీఆర్‌
  • ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్‌ తెలంగాణ తీసుకొచ్చారు
  • నవంబర్‌ 29న బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఎక్కడవారు అక్కడ దీక్షా దీవస్‌ను పాటించాలి
  • తెలంగాణకు స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామరక్ష
  • తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తాం
  • ధర్మపురి అరవింద్‌, బండి సంజయ్‌, రాజాసింగ్‌ను గెలిపించేందుకు కాంగ్రెస్‌ డమ్మీలను పెట్టింది
  • రాజాసింగ్‌, బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌ను ఓడిస్తాం
  • రైతు బంధు ఆపేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు
  • రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు
  • కర్ణాటక కాంగ్రెస్‌ నాయకులను తెలంగాణ ప్రజలు పట్టించుకోరు
     

తెలంగాణలో కాంగ్రెస్‌ గెలవదు: మాజీ ఎంపీ వినోద్‌

  • కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో బోయినపల్లి వినోద్ కుమార్ ప్రెస్ మీట్..
  • తెలంగాణలో 90 సీట్లు గెలిచి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.
  • కరీంనగర్ జిల్లాలో అన్నీ సీట్లు గెలుస్తాం.
  • కరీంనగర్‌లో ట్రయాంగిల్ లేదు బీఆర్ఎస్ ఒక్కటే వస్తుంది.
  • కాంగ్రెస్ గెలవడం అనేది తెలంగాణలో జరగదు.
  • కాంగ్రెస్ గెలుస్తదని వెళ్తున్నారు కానీ మళ్లీ వెనకకు వస్తారు.
  • బీజేపీ పార్టీ మత విద్వేషాలు పెంచుతుంది.
  • తెలంగాణలో గెలిచే సత్తా మా పార్టీకి ఉంది.
  • లేనిది ఉన్నట్టు చూపించే పార్టీ కాంగ్రెస్‌. 
  • ప్రజలకు విజ్ఞప్తి చేస్తు​న్నాను. గాలి మాటలు నమ్మి మోసపోవద్దు
  • కాంగ్రెస్‌కు ఓటు వేసి ఆగం కావద్దు.
  • హుజూరాబాద్‌లో ట్రయాంగిల్‌ ఫైట్‌ ఉంది. 
  • మైనార్టీలను కాంగ్రెస్‌ మోసం చేస్తోంది. 

స్థానిక ప్రజాప్రతినిధులకు రేవంత్‌ లేఖ

  • తెలంగాణ రాష్ట్ర స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
  • పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధుల దుస్థితిపై లేఖలో 
  • జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాకు స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత తెలుసు. 
  • ఏ ప్రభుత్వ పాలనకైనా మీరే పునాదులు. 
  • పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో మీ అవస్థలు.. మీకు జరిగిన అవమానాలు నాకు తెలుసు. 
  • ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కేసీఆర్ పురుగులకంటే హీనంగా చూశారు. 
  • నిర్ణయాధికారం లేక, నిధులు రాక మీరు పడిన బాధలు గుర్తున్నాయి. 
  • సర్కారు నిధులు రాకున్నా భార్య మెడలో బంగారం అమ్మి అభివృద్ధి చేసిన వాళ్లు ఉన్నారు. 
  • ఊరి కోసం అప్పుచేసి వడ్డీలు కట్టలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. 
  • మరికొందరు ఉపాధి హామీ కూలీలుగా, వాచ్ మెన్‌లుగా చేస్తున్నారు.
  • బీఆర్‌ఎస్ పాలనలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో ఉన్నాయి. 
  • ఈ నేపథ్యంలో నవంబర్ 30న ఎన్నికలు జరగబోతున్నాయి. 
  • ఈ ఎన్నికల్లో మీ పాత్ర అత్యంత కీలకం. 
  • పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టండి. 
  • మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇదొక అవకాశం. 
  • రేపటి నాడు మీ కష్టాలు తీర్చి, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. 
  • స్థానిక సంస్థలకు పూర్వవైభవాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. 
  • బీఆర్‌ఎస్‌, కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదాం. 
  • ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు మీ వంతు పాత్ర పోషించండి. 
  • మీ పల్లె రుణం తీర్చుకునే అవకాశం కాంగ్రెస్ ఇస్తుంది. 
  • పార్టీలకు, జెండాలకు, ఎజెండాలకు అతీతంగా.. 
  • వార్డు సభ్యుడు నుంచి సర్పంచ్ వరకు.. 
  • కౌన్సిలర్ నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు.. 
  • కార్పొరేటర్ నుంచి మేయర్ల వరకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
     

మంత్రి హరీశ్‌ కీలక వ్యాఖ్యలు.. Live Show

  • తెలంగాణలో రాహుల్‌ గాంధీ గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు.
  • కాంగ్రెస్‌ గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 
  • కర్ణాటక మాదిరిగా తెలంగాణ ఆగం అవకూడదు.
  • కేసీఆర్‌ అంటే ఒక నమ్మకం. 
  • కరెంట్‌ కావాలో కాంగ్రెస్‌ కావాలో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలి. 

తెలంగాణపై బీజేపీ అగ్రనేతల ఫోకస్‌..

  • ఈరోజు పది సభల్లో పాల్గొననున్న అగ్రనేతలు
  • ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా, సీఎం యోగి ఆదిత్యనాథ్‌. 
  • రాష్ట్ర కార్యాలయం నుంచే బీఎల్‌ సంతోష్‌ పర్యవేక్షణ.
  • ఈరోజు మధ్యాహ్నం జేపీ నడ్డా, బీఎల్‌ సంతోష్‌ భేటీ.
  • ఎస్సీ వర్గీకరణ, బీసీ సీఎం ఫార్ములా వర్క్‌ అవుట్‌ అవుతుందని కమలనాథుల ఆశలు. 

రైతుబంధు, బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు

  • రైతుబంధుపై సీఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌
  • రైతు బంధుపై ఈసీ ఇచ్చిన ఆదేశాలను బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో వాడకుండా ఆంక్షలు విధించాలని ఫిర్యాదు.
  • రైతుబంధు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నట్లు బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్న కాంగ్రెస్
  • ఈసీ ఆదేశాలను బీఆర్‌ఎస్‌ దుర్వినియోగం చేస్తుందన్న కాంగ్రెస్
     

నేడు మధిరలో భట్టి బైక్‌ ర్యాలీ..

  • ఖమ్మంలో భట్టి విక్కమార్క ఎన్నికల ప్రచారం
  • నేడు మధిర నియోజకవర్గంలో భట్టి బైక్‌ ర్యాలీ
  • బైక్‌ ర్యాలీలో పాల్గొననున్న పొంగులేటి, తుమ్మల నాగేశ్వర రావు
  • మధ్యాహ్నం 12 గంటలకు ఎర్రుపాలెం క్రాస్‌రోడ్‌ నుంచి బోనకల్లు మండలం సీతానగరం వరకు బైక్‌ ర్యాలీ
  • భారీ సంఖ్యలో బైక్‌ ర్యాలీకి ప్లాన్‌ చేసిన కాంగ్రెస్‌ నేతలు
     

తెలంగాణలో అసెంబ్లీ అభ్యర్థులు విద్యార్హత వివరాలు ఇవే..

  • పదో తరగతి పాసైన అభ్యర్థుల సంఖ్య 441, 
  • ఇంటర్‌ పాసైన వారి సంఖ్య 330,
  • చదువుకోనివారి సంఖ్య 89,
  • చదువుకున్న వారి సంఖ్య 26
  • ఐదో తరగతి పాసైన వారి సంఖ్య 91, 
  • ఎనిమిదో తరగతి పాసైన వారి సంఖ్య 117,
  • డిగ్రీ ఆపై చదివిన వారి సంఖ్య 1143,
  • డిప్లమా చదివిన వారి సంఖ్య 53,
  • డాక్టరేట్‌ ఉన్న వారి సంఖ్య 32.

కామారెడ్డిలో పోస్టర్ల కలకలం 

  • టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌పై సెటైరికల్‌ కామెంట్స్‌
  • కొడంగల్‌లో చెల్లని రూపాయి కామారెడ్డికి అవసరమా అంటూ పోస్టర్లు
  • కామారెడ్డి ప్రధాన కూడళ్లలో వెలిసిన పోస్టర్లు 
  • పోస్టర్లు అతికించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు, పోలీసులకు కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు

నేడు తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్య నేతల పర్యటనలు ఇలా..

  • ఆంథోల్, సంగారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్న రాహుల్ గాంధీ
  • నారాయణపేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్, కామారెడ్డి, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్న రేవంత్ రెడ్డి.
  • వరంగల్ వెస్ట్, కరీంనగర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్న ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్ బఘేల్.
  • మక్తల్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై హత్యాయత్నం కేసు నమోదు

  • నారాయణపేట రాజకీయాల్లో కలకలం
  • కోస్గిలో కొడంగల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు 
  • కాంగ్రెస్‌ కార్యకర్త కూర నరేష్‌పై కర్రలతో దాడి చేసిన బీఆర్‌ఎస్‌ నేతలు
  • 307తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • మొత్తం ఎనిమిది మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు, ఏ1గా పట్నం నరేందర్‌ రెడ్డి. 

నేడు కేటీఆర్‌ ప్రచారం షెడ్యూల్‌ ఇలా..

  • నేడు చొప్పదండి, సిరిసిల్ల నియోజకవర్గాల్లో కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం
  • ఉదయం చొప్పదండిలో ఎన్నికల ప్రచారం
  • సాయంత్రం సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటలో రోడ్‌ షో
     

నేడు తెలంగాణలో సీఎం సిద్ధరామయ్య పర్యటన

  • ఎన్నికల సందర్బంగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య తెలంగాణ పర్యటన
  • నేడు మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్‌
  • హెలికాప్టర్‌లో బేగంపేట నుంచి మక్తల్‌కు సిద్ధరామయ్య
  • మధ్యాహ్నం మూడు గంటలకు మక్తల్‌లో ప్రచార సభ..
  • సాయంత్రం 5.30 గంటలకు ముషీరాబాద్‌లో ప్రచార సభ పాల్గొననున్న కర్టాటక సీఎం.
     

నేడు మహబూబ్‌నగర్‌కు సీఎం యోగి ఆదిత్యనాథ్‌

  • యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నేడు మహబూబ్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం
  • బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం యోగి

నేడు నిర్మల్‌లో మోదీ, కేసీఆర్‌ పర్యటన

  • నేడు నిర్మల్‌ జిల్లాలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం
  • నిర్మల్  జిల్లా కేందంలో  ఎన్నికల ప్రచార సభలో‌  పాల్లొననున్న ప్రధాని మోదీ
  • ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌
  • ప్రధాని మోదీ సభ నేపథ్యలో పోలీసుల భారీ భద్రత. 
  • నేడు నాలుగు చోట్ల బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలు..
  • ఖానాపూర్‌, జగిత్యాల, వేములవాడ, దుబ్బాకలో కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం
     

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పూర్తి అప్‌డేట్స్‌..
సర్వేల పూర్తి సమాచారం..
ఇప్పుడు మీ కోసం..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement