సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు వ్యవహారంలో అవినీతి, అక్రమాలు జరిగాయని.. ఇందులో రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతల ప్రమేయం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సీఎంకు దమ్ముంటే.. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ కోరాలని సవాల్ విసిరారు. పెంచిన కరెంట్, ఆర్టీసీ చార్జీలతో ప్రజలపై మోయం లేని భారం పడుతున్న అంశాన్ని దారి మళ్లించేందుకు సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని ధ్వజమెత్తారు.
శనివారం రాత్రి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘వడ్లను కొనుగోలు చేయలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నడు. ప్రజలు తరిమికొడతారనే భయంతో తన తప్పును కేంద్రంపై నెట్టి బీజేపీని బదనాం చేయాలని చూస్తున్నడు. సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే కుట్రలో భాగంగానే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండి అన్నట్లుగా అబద్దాలు ప్రచారం చేస్తున్నరు’అని బండి పేర్కొన్నారు. ‘కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని పంచాయతీలతో కలెక్టర్లు బలవంతంగా తీర్మానం చేయిస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment