సాక్షి, హైదరాబాద్: చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ సర్కార్ ఆ పనిచేయకపోతే టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చావు డప్పే మిగులుతుందని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ధాన్యం కొనుగోలు కోసం కేంద్రంతో టీఆర్‌ఎస్ మాత్రమే పోరాడుతుందని రైతాంగాన్ని మభ్యపెట్టేందుకే సీఎం కేసీఆర్ మంత్రుల బృం దాన్ని ఢిల్లీకి పంపారని మంగళవారం ఓ ప్రకటనలో ఆరోపించారు.
కేంద్రమంత్రులు అందుబాటు లో ఉండరని తెలిసి, పార్లమెంటు సమావేశాలు జర గని శని, ఆది వారాల్లో మంత్రులు, ఎంపీ బృందం ఎవరిని కలుద్దామని వెళ్లిం దని ఆయన ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై కేం ద్రంతో పోరాటం చేస్తున్నట్లు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎం దుకు నాటకాలాడుతుందో చెప్పాలని నిలదీశారు. ఊరూరా ప్రధాని మోదీ చావుడప్పు మోగిస్తే రైతుల సమస్య పరిష్కారమవుతుందా అని ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంటు సమావేశాలకు హాజరై రాష్ట్ర రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కేంద్రాన్ని నిలదీయా లని డిమాండ్ చేశారు. కిలో ధాన్యం కొనలేని, కొనిపించలేని నేతలు తెలంగాణకు అవసరమా అని భట్టి ప్రశ్నించారు. కిలో ధాన్యం కొనలేని, కొనిపిం చలేని నేతలు తెలంగాణకు అవసరమా అని భట్టి ప్రశ్నించారు. నదీజలాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పుడు రైతులను వరి సాగు చేయవద్దని ప్రకటించడం ప్రభుత్వానికి సరికాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment