
ఖమ్మం జిల్లా కాకరవాయి శివారులో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/మోతె: రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు ప్రశ్నించే సత్తా లేదని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర సోమవారం ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. అంతకుముందు యాత్ర సూర్యాపేట జిల్లా మోతె మండలం కూడలి గ్రామంతో పాటు తండాలో నూ కొనసాగింది.
గడపగడపకు వెళ్లి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో ఆమె ప్రజలనుద్దేశించి మాట్లా్లడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌కు అమ్ముడు పోయారన్నారు. బీజేపీ కూడా ఏం తక్కువ కాదని.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు. వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకురావడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. ఈ యాత్రలో పార్టీ రాష్ట్ర నాయకులు వాడుక రాజగోపాల్, గట్టు రామచందర్‌రావు, పిట్టం రాంరెడ్డి, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment