సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. సీఎం కేసీఆర్.. బీఆర్‌ఎస్ పార్టీతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఖమ్మం భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు.
దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్ అనిపించేలా.. జాతీయ రాజకీయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ఖమ్మం బహిరంగ సభను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ మేరకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాల నేతలనూ రప్పించేందుకు మరోవైపు కసరత్తు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నుంచి ఖమ్మం స్థానిక నేతల వరకు ఈ పనిలోనే బిజీబిజీగా గడుపుతున్నారు.
ఈ సందర్భంగా ఆదివారం సభ ఏర్పాటకు సంబంధించి అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా క్యాంపు కార్యాలయంలో గులాబీ నేతలు సమావేశమయ్యారు. ఎంపీ నామా, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ రేగా కాంతారావు సమావేశంలో పాల్గొన్నారు. కాగా, సమావేశం అనంతరం తుమ్మల నాగేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. 18వ తేదీన దేశ రాజకీయాల్లో పెను మార్పుకి ఖమ్మం వేదిక కానుంది. దేశ రాజకీయాల్లో మలుపు తిప్పే విధంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు పాలిటికల్‌గా హీట్‌ను పెంచాయి.
Comments
Please login to add a commentAdd a comment