కొలికపూడి శ్రీనివాస్‌ కొత్త డ్రామా | Tiruvuru TDP MLA Kolikapudi Srinivas Diksha Drama | Sakshi
Sakshi News home page

కొలికపూడి శ్రీనివాస్‌ కొత్త డ్రామా

Published Mon, Sep 30 2024 9:46 PM | Last Updated on Mon, Sep 30 2024 9:46 PM

Tiruvuru TDP MLA Kolikapudi Srinivas Diksha Drama

ఎన్టీఆర్, సాక్షి: కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌.. నిత్యం ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా టీడీపీకి వ్యతిరేకంగా దీక్ష చేపట్టి కొత్త డ్రామాకు తెర తీశారాయన. దీంతో కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. 

ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కొలికపూడి  వైఖరి వివాదాస్పదంగా ఉంటూ వస్తోంది. అధిష్టానం మందలించినా కొలికపూడి వైఖరిలో మార్పు రాలేదు. తాజాగా చిట్టేల సర్పంచ్ , అతని భార్య కవిత పై చర్యలు తీసుకోవాలంటూ దీక్షకు దిగారు. వీఆర్వోను వేధించిన ఆయన.. తిరిగి వారికి వ్యతిరేకంగానే దీక్షకు దిగడం గమనార్హం. 

మరోవైపు.. ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ చిట్టేలలో మహిళలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా పార్టీ అధిష్టానానికి తిరువూరు టీడీపీ శ్రేణులు వరుస ఫిర్యాదు చేస్తున్నాయి. కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధినేత చంద్రబాబుని కోరుతున్నాయి. అయితే ఈలోపే.. పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొలికపూడి దీక్ష డ్రామా చేపట్టడంపై చేయడంపై మండిపడుతున్నాయి. 

ఇదీ చదవండి: కొలికపూడి మమ్మల్ని వేధిస్తున్నాడు సార్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement