సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్ర భుత్వం ప్రకటించింది మెగా డీఎస్సీ కాదని, నిరుద్యోగులను దగా చేసే డీఎస్సీ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వి ద్యా శాఖ గణాంకాల ప్రకారం 21 వేల టీచర్ పోస్టు లు ఖాళీగా ఉన్నాయని, సీఎం మాటల ప్రకారమే 13 వేల పోస్టులు భర్తీ చేయాలని, కానీ నోటిఫికేషన్లు ఇచ్చేది మాత్రం 5 వేల పోస్టులకేనా అని ట్విట్టర్ వేదికగా ఆయన బుధవారం ప్రశ్నించారు. ఇది మెగా డీఎస్సీ కాదని, ఎన్నికల కోసం కేసీఆర్ దగా డీఎస్సీ అని ట్వీట్ చేసిన రేవంత్.. మెగా డీఎస్సీ కోసం నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు.
‘కారు’ కూతలు రావు
తమ చిహ్నం చేతి గుర్తు అని, చేసి చూపించడమే తమ నైజమని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి న ప్రధాన హామీల్లో ఒకటైన గృహలక్ష్మి పథకం ప్రా రంభం సందర్భంగా ఆయన బుధవారం ట్వీట్ చే శారు. ‘ఇచ్చిన మాట ప్రకారమే, అధికారంలోకి వ చ్చిన 100 రోజుల్లోనే, కర్ణాటక ప్రజలకిచ్చిన 5 హా మీల్లో నాలుగింటిని నెరవేర్చి చరిత్ర సృష్టించాం.
‘కారు’కూతలు రావు... ‘జూటా’మాటలు లేవు, వస్తున్నాం తెలంగాణలోనూ .. అమలు చేస్తున్నాం ఇచ్చిన హామీలను.. మోసుకొస్తున్నాం చిరునవ్వులను’అని తన ట్విట్టర్ పోస్టులో పేర్కొన్నారు. వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా రేవంత్‌రెడ్డి స్పందించారు.
‘ఒక గజదొంగ దారిదోపిడీ చేసి సర్వం దోచుకున్న తర్వాత దారి ఖర్చుల కోసం రూ.200 ఉంచుకోవాలని ఇచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంది. ఇన్నాళ్లూ పేద, మధ్య త రగతి ప్రజలను ఇబ్బందులపాలు చేసి తీరా ఇప్పు డు గ్యాస్ ధర తగ్గించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. కాగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment