బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-7) | Will Chandrababu Answer Questions On Zero Interest Loans | Sakshi
Sakshi News home page

బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-7)

Published Wed, Feb 21 2024 3:50 PM | Last Updated on Wed, Feb 21 2024 4:23 PM

Will Chandrababu Answer Questions On Zero Interest Loans - Sakshi

‘‘లేస్తే మనిషిని కానన్నా’’డట వెనకటికి ఎవరో. ఇప్పుడు బాబు, అండ్‌ ఆయన పచ్చమంద తీరు అలాగే ఉంది. పద్నాలుగేళ్లు అధికారం వెలగబెట్టినా... మూడుసార్లు సీఎం కుర్చీపై కూర్చున్నా చెప్పుకోదగ్గ పథకం, కార్యక్రమేదీ చేపట్టలేని బాబుగారు... ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో మరోసారి ‘నేను అధికారంలోకి వస్తే...’’ అంటూ మొదలుపెట్టారు.

‘‘లేస్తే మనిషిని కానన్నా’’డట వెనకటికి ఎవరో. ఇప్పుడు బాబు, అండ్‌ ఆయన పచ్చమంద తీరు అలాగే ఉంది. పద్నాలుగేళ్లు అధికారం వెలగబెట్టినా... మూడుసార్లు సీఎం కుర్చీపై కూర్చున్నా చెప్పుకోదగ్గ పథకం, కార్యక్రమేదీ చేపట్టలేని బాబుగారు... ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో మరోసారి ‘నేను అధికారంలోకి వస్తే...’’ అంటూ మొదలుపెట్టారు.

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమలులో పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకానికి నిధులు ఇవ్వకుండా ఆ పథకం 2014–19 మధ్య అర్ధాంతంగా అమలు కాకుండా నిలిచిపోవడానికి కారణం అప్పడు ముఖ్యమంత్రిగా చంద్రబాబే కదా. చర్చకు సిద్దమా! ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ దక్కించుకోవడం కమీషన్ల కక్కుర్తితోనే కదా బాబూ?
  • నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న మరుసటి రోజే అంటే 2016, సెప్టెంబరు 8న పోలవరం హెడ్‌ వర్క్స్‌ అంచనా వ్యయాన్ని రూ.1481 కోట్లు పెంచేయడం ప్రభుత్వ ఖజానాను దోచుకోవడానికే కదా బాబూ?
  • గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయకుండా ప్రధాన డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణాన్ని చేపట్టడంలో ఆంతర్యమేంటి? బావర్‌ సంస్థకు సబ్‌ కాంట్రాక్టు కింద ఇచ్చి పూర్తి చేసి రూ.400 కోట్లు బిల్లులు ఇచ్చేసి కమీషన్లు దండుకున్న మాట వాస్తవం కాదా? నువ్వు చేసిన ఈ చారిత్రక తప్పిదం వల్ల గోదావరి వరదల ఉద్ధృతికి డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిందిన్నది నిజం కాదా?
  • కమీషన్ల కక్కుర్తి కోసం రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టును నువ్వు జీవం తీస్తే.. సీఎం వైఎస్‌ జగన్‌ జీవం పోసి ఆ ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తుండటం నిజం కాదా?
  • పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా మిగతా జలయఙ్ఞం ప్రాజెక్టులను కేవలం రూ.17,368 పూర్తి చేస్తానని 2014, జూలై 28న శ్వేతపత్రంలో ప్రకటించింది నువ్వే కదా బాబూ? ఐదేళ్లలో రూ.68,293.95 కోట్లు ఖర్చు చేసినా ఒక్క ప్రాజెక్టును కూడా చేయలేదన్నది నిజం కాదా? జీవో 22, జీవో 63లను అడ్డుపెట్టుకుని రూ.25 వేల కోట్లకుపైగా కాంట్రాక్టర్లకు దోచిపెట్టి.. కమీషన్లు దండుకున్నది వాస్తవం కాదా బాబూ?
  • గుళ్లను ప్రభుత్వమే అధికారికంగా కూల్చింది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా. అప్పటి TDPప్రభుత్వం విజయవాడలో కృష్ణా పుష్కరాలు సందర్భంగా కూల్చిన గుళ్లను జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పునర్మించింది వాస్తవం కాదా?
  • గోదావరి పుష్కరాలలో కేవలం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీ ప్రచార పిచ్చితో తొక్కిసలాట జరిగి 29 మంది అమాయక, పేద భక్తులు ప్రాణాలు కోల్పోతే.. ఆ ఘటనపై జాలి చూపించాల్సింది పోయి ‘దాంట్లో ఏం ఘోరం జరిగింది, ఎక్కడ తొక్కిసలాటలు జరగలేదు’ అని ప్రశ్నించింది నిజం కాదా?

చదవండి: బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-6)

చదవండి: బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-5)

చదవండి:  బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-4)

చదవండి:   బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-3)

చదవండి:  బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-2)

చదవండి:  బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-1)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement