సాక్షి, తాడేపల్లి: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వేధించడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. రామకృష్ణారెడ్డిని కోర్టుకు తీసుకెళ్తుంటే టీడీపీ నేత దాడి చేయడానికి ప్రయత్నించడమేంటి?. ఇటువంటి దాడులకు భయపడేది లేదని పిన్నెల్లిని ఓడించాలని టీడీపీ కుట్రలు చేసిందన్నారు. రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే టీడీపీ ప్లాన్.. అంటూ దుయ్యబట్టారు. ఫేక్ న్యూస్‌లతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు.
ఏదోలా కక్షసాధింపు చేయాలనే.. మాజీ మంత్రి అంబటి రాంబాబు
పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి స్వచ్చందగా పోలీసులకు సహకరించారు. మాచర్లలో సుదీర్ఘంగా గెలుస్తూ ఉన్న నాయకుడు. ఎన్నికలకు ముందు చంద్రబాబు భారీ ప్లాన్ వేశారు. పిన్నెళ్లిని ఓడించటానికి అనేక రకాలుగా ప్లాన్ వేశారు. పిన్నెళ్లి ఈవీఎంని పగులకొట్టినట్టుగా ఉన్న వీడియో లోకేష్ ట్విట్టర్‌లో పెట్టారు. దాన్ని చూసి కేసులు పెట్టి అరెస్టు చేశారు. అసలు ఆ వీడియోని పోలీసులో, ఈసీనో బయట పెట్టలేదు. ఒక పోలీసు అధికారిని కొట్టినట్టుగా తొమ్మిది రోజుల తర్వాత పిన్నెళ్లిపై కేసు పెట్టారు. 307 కింద మొత్తం రెండు కేసులలో బుక్ చేసారు.. ఏదోలా కక్షసాధింపు చేయాలనే పిన్నెళ్లిపై కేసులు పెట్టారు.
...ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల్లో తయారు చేసిన వార్తలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పిన్నెళ్లిని కోర్టులో హాజరు పరిచే సమయంలో శివ అనే వ్యక్తి వెళ్లి గొడవకు దిగారు. మాపై ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటాం. 40 శాతం ఓటు షేర్ ఉన్న రాజకీయ పార్టీ వైఎస్సార్‌సీపీ. అవతల మూడు పార్టీలు కలిస్తే 60 శాతం ఓట్ షేర్ వస్తే, మా ఒక్క పార్టీకే 40 శాతం వచ్చింది. చంద్రబాబు తెచ్చిన జీవో ప్రకారమే పార్టీ ఆఫీసులు కడుతున్నాం హైదరాబాద్‌లో ఉన్న ఎన్టీఆర్ భవన్ సహా ఏపీలో ఉన్న టీడీపీ ఆఫీసులన్నీ చంద్రబాబు తెచ్చిన జీవో ప్రకారమే నిర్మాణం చేశారు. ఆ జీవో ప్రకారమే మా పార్టీ ఆఫీసుల నిర్మాణం కూడా జరుగుతోంది
వైఎస్ జగన్ ప్రజావేదికను కూల్చారన్న చంద్రబాబు.. అధికారంలోకి రాగానే వైఎస్సార్‌సీపీ ఆఫీసుని కూల్చారు. పచ్చి విధ్వంసకారుడు చంద్రబాబు. మా ఆఫీసుల నిర్మాణం అక్రమమైతే అధికారులు నోటీసులు ఇవ్వాలి. టీడీపీ నేతలకు మా ఆఫీసులతో ఏం పని?. వారు వెళ్లి మా భవనాలను కూల్చుతామని ప్రెస్ మీట్లు పెటడం ఏంటి?. ఇది ప్రజాస్వామ్యమా? అరాచక ప్రభుత్వమా? ప్రభుత్వం చేతిలో ఉందని అరాచకాలు చేస్తే ప్రజలు సహించరు. ఎల్లోమీడియా చేసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు
పిన్నెల్లిని కక్షపూరితంగా జైలులో పెట్టారు: కాసు మహేష్‌రెడ్డి
వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం చేస్తుందని.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కక్షపూరితంగా జైలులో పెట్టారని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ దాడులు చేస్తూ కొత్త సంప్రదాయానికి తెరలేపింది. టీడీపీ.. కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. పిన్నెల్లిని రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయటం కోసమే టీడీపీ ప్రభుత్వం పని చేస్తున్నట్టు వ్యవహరించింది. అరెస్టు సమయంలో కూడా ఆయనపై దాడి చేసే ప్రయత్నం చేశారు. టీడీపీ వారు బుక్ చేసిన కేసులలో పిన్నెళ్లిని అరెస్టు చేశారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. చేసిన అభివృద్ధి చెప్పుకుని మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాం. వైఎస్సార్‌సీపీ ఆఫీసులన్నీ చంద్రబాబు హయాంలో తెచ్చిన జీవోల ప్రకారమే నిర్మాణాలు జరుగుతున్నాయి. చట్టపరంగా తప్పులుంటే న్యాయపోరాటం చేస్తాం. కానీ వైఎస్సార్‌సీపీ ఆఫీసుల్లోకి టీడీపీ వారు వెళ్లి ప్రెస్ మీట్‌లు పెట్టటం సబబు కాదు.
టీడీపీ నేతలు చేయని అరాచకం లేదు: డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
పల్నాడులో టీడీపీ నేతలు చేయని అరాచకం లేదు. పురంధేశ్వరి చెప్పిన అధికారులను పల్నాడులో నియమించారు. మా వారిపై దాడులు జరుగుతున్నాయని ఎస్పీకి కాల్స్ చేసినా పట్టించుకోలేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య, కుమారునిపై దాడి జరిగితే కనీసం కేసు కూడా పెట్టలేదు. మాపై మాత్రం 307 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇలాంటి సవాళ్లు, కేసులను ఎదుర్కొంటాం. మా కార్యకర్తలను ఆదుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment